బన్నీ స్టార్ట్‌ చేస్తున్నాడు..! | Allu Arjun Trivikram Movie Starts In December | Sakshi
Sakshi News home page

Oct 25 2018 10:39 AM | Updated on Oct 25 2018 11:28 AM

Allu Arjun Trivikram Movie Starts In December - Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో షాక్‌ తిన్న అల్లు అర్జున్‌, తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేయని బన్నీ ఇద్దరు ముగ్గురు దర్శకుల్ని లైన్‌లో పెట్టాడు. ముఖ్యంగా విక్రమ్‌ కుమార్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లో ఎవరో ఒకరితో బన్నీ సినిమా ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.

తాజాగా త్రివిక్రమ్‌ తో సినిమా చేసేందుకే బన్నీ ఫిక్స్‌ అయినట్టుగా తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అందుకే మరోసారి బన్నీ త్రివిక్రమ్‌కే ఓటేసినట్టుగా తెలుస్తోంది. అన్ని ఓకే అయితే డిసెంబర్‌లోనే సినిమాలు పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. అరవింద సమేత హిట్‌తో మంచి ఫాంలో ఉన్న మాటల మాంత్రికుడు అల్లు అర్జున్‌ కోసం ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement