బన్నీ ఫ్యాన్స్‌ వేధింపులు ఆగట్లేదు | Allu Arjun Fans Harassed Malayalam Female Critic | Sakshi
Sakshi News home page

Published Mon, May 14 2018 8:35 PM | Last Updated on Fri, Aug 17 2018 8:03 PM

Allu Arjun Fans Harassed Malayalam Female Critic - Sakshi

అపర్ణ ప్రశాంతి.. నా పేరు సూర్య చిత్రంలోని ఓ స్టిల్‌

సాక్షి, తిరువనంతపురం: నా పేరు సూర్య చిత్రం రివ్యూ ఆమెను చిక్కుల్లో పడేసింది. అపర్ణ ప్రశాంతి అనే ప్రీలాన్స్‌ ఫిలిం క్రిటిక్‌ చిత్రం అస్సలు బాగోలేదంటూ తన ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. దీంతో అల్లు అర్జున్‌ హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ ఆమెను వేధించటం ప్రారంభించారు. ఈ తతంగంపై గురువారం మల్లాపురం పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు మరింతగా వేధింపులు ఎక్కువయ్యాయని అపర్ణ చెబుతున్నారు.

 ‘గత నాలుగేళ్ల నుంచి పలు ప్రముఖ పత్రికలకు కూడా రివ్యూలు రాస్తున్నా. మోహన్‌లాల్‌, మమ్మూటీ లాంటి స్టార్ల విషయంలో కూడా ఖచ్ఛితమైన రివ్యూలు ఇచ్చా. వాళ్ల ఫ్యాన్స్‌ నుంచి నాకు ఏనాడూ ఇలాంటి బెదిరింపులు ఎదురుకాలేదు. కానీ, ఇప్పుడు ఈ చిత్రం విషయంలోనే నాకీ పరిస్థితి ఎదురైంది. సంస్కారం లేకుండా అసభ్యపదజాలంతో నన్ను తిడుతున్నారు. రేప్‌ చేసి గుణపాఠం నేర్పుతారంట.వాళ్ల ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారన్న విషయం వారికి కనిపించటం లేదేమో. సైనికుడి సినిమాను కించపరుస్తున్నావ్. నువ్వేమైనా దేశద్రోహివా?పాకిస్థాన్‌ గూడఛారివా? అంటూ విమర్శించారు. సినిమా బాగోలేదు అన్నందుకు నన్ను, నా కుటుంబాన్ని చెప్పలేని భాషలో ఇంతలా తిట్టి పోయాలా? అని ఆమె ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. 

‘సినిమా చూస్తున్నంత సేపు తలనొప్పి వచ్చింది. అదేం దేశభక్తో కాస్త కూడా నాకు అర్థం కాలేదు. బయటకు వెళ్దామంటే కుండపోత వర్షం. ఆ కారణంగా బలవంతంగా థియేటర్‌లోనే ఉండిపోయా’ అని వెటకారంగా ఆమె నా పేరు సూర్య సినిమాకు రివ్యూ ఇచ్చారు. అక్కడి నుంచి బన్నీ ఫ్యాన్స్‌ ఆమెను వేధించటం ప్రారంభించారు. ఆమెకు మద్ధతుగా పలు మీడియా ఛానెళ్లు నిలవటం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement