critic
-
ఆయన మరణం పుతిన్ నాశనానికే: బైడెన్ ఫైర్
ఆయన చనిపోవడం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత, పుతిన్‌దే పూర్తి బాధ్యత.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్.. రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(47) హఠాన్మరణంపై యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీలో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణించారని.. వైద్యులు ప్రయత్నించినా లాభం లేకపోయిందని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే.. అంతకు ముందు రోజు కూడా కోర్టు విచారణకు నవ్వుతూ హాజరైన నావల్నీ.. ఉన్నట్లుండి మరణించడంతో క్రెమ్లిన్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలెక్సీ నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతూ.. నావల్నీ మరణం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయనొక పోరాటయోధుడు. అవినీతి విషయంలో పుతిన్‌ను ఎదురించాడు. పుతిన్ ప్రభుత్వ పాల్పడుతున్న హింసకు ధైర్యంగా అడ్డుచెప్పాడు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత.. ఇది పుతిన్ వినాశనానికి దారి తీయక తప్పదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మరోవైపు నావల్నీ మృతిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించే పనిలో ఉన్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. #WATCH | On the death of jailed Russian opposition figure and Kremlin critic Alexey Navalny, US President Joe Biden says, "...Putin is responsible for Navalny's death. Putin is responsible..." (Video source: Reuters) pic.twitter.com/6xpoKvAnA4 — ANI (@ANI) February 17, 2024 ఇంకోవైపు మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. అలెక్సీ నావల్నీ భార్య యూలియాని కలిసి ఓదార్చారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ యూలియా కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అని యూలియా అన్నారు. అతి(తీవ్ర)వాదం అభియోగాలపై కిందటి ఏడాది ఆగస్టులో అలెక్సీ నావల్నీకి 19 ఏళ్ల జైలుశిక్ష పడింది. ‘‘నా ప్రాణం ఉన్నంతవరకు లేదా ఈ (పుతిన్) ప్రభుత్వం ఉన్నంత కాలం నేను జైల్లోనే ఉంటానన్న సంగతి నాకు తెలుసు’’ అని నాటి తీర్పు సమయంలో నావల్నీ వ్యాఖ్యానించారు. రెండు నెలల కిందటే ఆయన్ని.. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీకి తరలించారు. ఇదీ చదవండి: నిరసన గళం మూగబోయింది పుతిన్ హేట్స్ నావల్నీ రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ విధానాలను వ్యతిరేకిస్తూ నావల్నీ అనేక నిరసనలు చేపట్టారు. అందుకుగాను పలుమార్లు అరెస్టయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో నావల్నీ పోటీ చేశారు. వ్లాదిమిర్ పుతిన్‌కు ఆయనంటే తీవ్ర కోపం. నావల్నీ పేరును పలికేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. నావల్నీకి మరింత ఎక్కువ పేరు రావొద్దనే ఆయన పేరును పుతిన్ పలికేవారు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే.. ఆ వ్యక్తి అని మాత్రమే సంబోధించేవారు. ఆది నుంచీ ధిక్కార స్వరమే! ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. పుతిన్ సర్కారు పాలనా విధానాల్లో లోపాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఎదురైనా లెక్కచేయలేదు. నాయకులు/అధికారుల అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు జరిపి అనేక కీలక వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ టీవీ ఛానళ్లలో నావల్నీకి ఏమాత్రం ప్రచారం లభించేది కాదు. అయితే యూట్యూబ్ వీడియోలు, సామాజిక మాధ్యమ ఖాతాలతో ఆయన జనానికి బాగా దగ్గరయ్యారు. -
KRK Arrest: వివాదాస్పద సినీ క్రిటిక్ అరెస్ట్.. ఆ స్టార్ హీరోపై తీవ్ర ఆరోపణలు!
కమల్ రషీద్ ఖాన్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ.. కేఆర్కే అంటే వెంటనే కనిపెట్టేస్తారు. అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలపై నెగెటివ్ రివ్యూలు ఇస్తూ హల్ చల్ చేసేవారిలో కేఆర్కే ఒకరు. ఇటీవల డంకీ, సలార్ చిత్రాలపై తనదైన శైలిలో రివ్యూలు ఇచ్చేశాడు. సినిమా ఏదైనా సరే బాగాలేదు, డిజాస్టర్ అనే పదాలు ఎక్కువగా వినియోగించే వారిలో కేఆర్కేను మించినవారు ఉండరు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నామని అనుకుంటున్నారా? అసలే జరిగిందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: Alia-Ranbir: ముద్దుల కూతురిని పరిచయం చేసిన స్టార్ కపుల్!) కేఆర్కే అసలు పేరు కమల్ రషీద్ ఖాన్ కాగా.. తాజాగా ఆయను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. నేను జైల్లో చనిపోతే అది హత్యగా భావించాలంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అతను ట్వీట్లో రాస్తూ.. "నేను గత ఏడాది కాలంగా ముంబైలో ఉన్నా. నా అన్ని కోర్టు కేసులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నా. ఈ రోజు నేను కొత్త సంవత్సరం వేడుకల కోసం దుబాయ్‌కి వెళ్తున్నా. కానీ ముంబై పోలీసులు నన్ను విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పోలీసుల దృష్టిలో నేను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నా. ఇది 2016లో జరిగిన ఒక కేసు. నా వల్లే తన సినిమా టైగర్-3 ఫ్లాప్ అయిందని సల్మాన్ ఖాన్ చెబుతున్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లోనో, జైల్లోనో చనిపోతే అది హత్యగా మీరందరు భావించాలి. దీనికి బాధ్యులు ఎవరో మీ అందరికీ తెలుసు. " అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం కేఆర్కే పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. గతేడాది తన అరెస్ట్‌కు, సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సల్మాన్ ఖాన్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అంటూ పోస్ట్ చేశారు. తాజా అరెస్ట్‌తో మళ్లీ సల్మాన్‌పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. (ఇది చదవండి: ప్రియుడికి స్పెషల్ విషెస్ చెప్పిన 'సరైనోడు' భామ.. పోస్ట్ వైరల్!) గతేడాది ఆగస్ట్ 30న దుబాయ్ నుంచి ముంబైకి వచ్చినప్పుడు కూడా అరెస్టు చేశారు. తన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్‌లపై 2020లో నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నారు. గతంలో దివంగత ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్‌లపై చేసిన ట్వీట్లపై యువసేన నాయకుడు రాహుల్ కనాల్ 2020 ఏప్రిల్ 30న ఫిర్యాదు చేశాడు. I am in Mumbai for last one year. And I am attending my all court dates regularly. Today I was going to Dubai for new year. But Mumbai police arrested me at the airport. According to police, I am wanted in a 2016 case. Salman khan is saying that his film #Tiger3 is flop because… — KRK (@kamaalrkhan) December 25, 2023 -
సినిమాలు చూడండి.. రూ. 1.6 లక్షలు అందుకోండి!
సినిమాలు చూడండి.. 2000 డాలర్లు (రూ. 1.6 లక్షలు) అందుకోండి.. అంటోంది ఓ అమెరికన్ కంపెనీ. మీరు చేయాల్సిందల్లా వాళ్లు చెప్పిన సినిమాలు చూసి మీ అభిప్రాయాలను తెలియజేయడమే. యూఎస్‌కు చెందిన బ్లూమ్‌సీబాక్స్ (BloomsyBox) అనే సంస్థ వివిధ సంవత్సరాల్లో విడుదలైన పేరొందిన 12 క్రిస్మస్ సినిమాలను చూసి అభిప్రాయాలు పంచుకోవాలని సినీ ఔత్సాహికులను కోరుతోంది. ఎంపికైనవారు వాళ్లు చెప్పిన క్రిస్మస్ సినిమాలను చూసి ప్రతి సినిమా గురించి వారి అభిప్రాయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి డబ్బుతో పాటు హాట్ కోకా, రెండు జతల యూజీజీ సాక్స్‌లు, పీకాక్‌కి ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్, 12 నెలల ఫ్లవర్ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ అందజేస్తుంది చూడాల్సిన 12 సినిమాలు ఇవే.. ది మోస్ట్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ది ఇయర్ (2008) క్రౌన్ ఫర్ క్రిస్మస్ (2015) ది నైన్ లైవ్స్ ఆఫ్ క్రిస్మస్ (2014) క్రిస్మస్ గెటవే (2017) జర్నీ బ్యాక్ టు క్రిస్మస్ (2016) గోస్ట్స్ ఆఫ్ క్రిస్మస్ ఆల్వేస్ (2022) ఫ్యామిలీ ఫర్ క్రిస్మస్ (2015) క్రిస్మస్ అండర్ రాప్స్ (2014) త్రీ వైస్ మెన్ అండ్ ఏ బేబీ (2022) ఎ రాయల్ క్రిస్మస్ (2014) నార్త్‌పోల్ (2014) ది క్రిస్మస్ ట్రైన్ (2017) -
పుతిన్ బద్ధశత్రువు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల జైలు శిక్ష
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించారు. ఈ మేరకు విచారణకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. వీడియోలో నవాల్నీ నల్లని దుస్తులు ధరించి ఉన్నారు. చేతులు జోడించుకుని నిలబడి తీర్పును వింటున్నట్లు కనిపించారు. వీడియోలో న్యాయమూర్తి వెలువరించిన తీర్పుకు సంబంధించిన ఆడియో అస్పష్టంగా ఉందని నవాల్నీ అనుచరలు అన్నారు. తీర్పును విని నిర్దారించడం కష్టంగా ఉందని చెప్పారు. రష్యాలో పుతిన్‌కు ఏకైక ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నవాల్నీపై ఉగ్రవాదం సహా పలు కేసులు నమోదు చేశారు. ఇందులో ఆయన ఇప్పటికే 11 ఏళ్లకు పైగా శిక్ష పడగా.. తాజాగా మరికొన్ని అభియోగాల్లో మరో 19 ఏళ్లు కారాగార శిక్ష ఖరారైంది. పుతిన్ తన ప్రత్యర్థిని బయటకు వెళ్లకుండా జైళ్లోనే మగ్గే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని నవాల్నీ అనుచరులు ఆరోపిస్తున్నారు. నవాల్నీ ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో ఉన్నారు. కాగా తాజా తీర్పుతో అతని అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదీ చదవండి: Putin Critic Alexei Navalny: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బద్ధశత్రువుపై మరిన్ని కేసులు -
పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీని తీవ్రవాదంతో సహా అనేక నేరాలపై ఇప్పటికే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించనున్నాయి క్రెమ్లిన్ వర్గాలు. ప్రాసిక్యూటర్లు అలెక్సి నవాల్నీపై మోపబడిన అదనపు కేసులు.. తీవ్రవాద సంస్థ ఏర్పాటు, నాజీ మద్దతుదారులకు పునరావాసం, తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా రెండు బహిరంగ సభలు, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నవాల్నీ అవినీతి నిరోధక నిధి పేరిట మరో సంస్థను స్థాపించడం, మైనర్లను ఉగ్రవాదం వైపు నడిపించడం (నవాల్నీ సభలకు 18 సంవత్సరాల లోపు వారు హాజరైనందుకు), తీవ్రవాదానికి ఆర్ధికంగా ఊతమిచ్చేందుకు నిధులు సేకరించడం వంటి అభియోగాలను మోపారు. కొత్తగా నమోదైన కేసుల విషయమై నవాల్నీ స్పందిస్తూ ప్రజా జీవితానికి నన్ను దూరంగా ఉంచాలన్న కారణంతోనే మరిన్ని కేసులు మోపి మరో 20 ఏళ్ళ పాటు జైల్లోనే మగ్గిపోయేలా చేయాలని పుతిన్ నేతృత్వంలోని క్రెమ్లిన్ వర్గాలు చూస్తున్నాయన్నారు. తనను తీవ్రవాదిగా చిత్రీకరించి మొత్తంగా 35 ఏళ్ల జైలు శిక్ష విధించాలన్నదే రష్యా అధ్యక్షుడి అభిమతమని అన్నారు. జైల్లో ఉన్నా కూడా తన సోషల్ మీడియా ద్వారా అనుచరుల సాయంతో ఎప్పటికపుడు యాక్టివ్ గా ఉంటారు నవాల్నీ. కొత్త అభియోగాల విషయంలో క్రెమ్లిన్ పన్నుతున్న కుట్రను కూడా ఆయన సోషల్ మీడియాలో పొందుపరిచారు. స్వేచ్ఛతో కూడిన కొత్తదైన ధనిక రాజ్యానికి జన్మనివ్వాలంటే ప్రతి ఒక్కరూ అలాంటి రాజ్యం కోసం త్యాగం చేసి తల్లిదండ్రులు కావాలని కోరారు. ఇది కూడా చదవండి: మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు -
ఆ సినిమాలే ఓ పరమ చెత్త.. అందుకే ఎవరూ చూడరు: సినీ క్రిటిక్
బాలీవుడ్ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే) పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ సినిమాలకు కాంట్రవర్సీ రివ్యూలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే పూర్తిగా నెగెటివ్ రివ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యారు. గతంలో షారూక్ ఖాన్ పఠాన్ మూవీతో పాటు పలు స్టార్ హీరోల చిత్రాలపై సంచలన కామెంట్స్ చేస్తూ షాకిస్తుంటారు. బాలీవుడ్ అంటేనే కేవలం రీమేక్ చేయడం తప్పా.. సినిమాలు తీయడం రాదని గతంలో పలుసార్లు బహిరంగంగానే విమర్శించారు. (ఇది చదవండి: ప్రతీకారమే లక్ష్యం.. భయపెట్టేందుకు వస్తోన్న 'కల్లరై'!) తాజాగా మరోసారి కేఆర్కే తనదైన శైలిలో బాలీవుడ్ చిత్రాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల విడుదలైన ఒపెన్ హైమర్, బార్బీ చిత్రాలు భారీగా వసూళ్లు సాధించడంతో కేఆర్కే బాలీవుడ్ సినీ ప్రముఖులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. హాలీవుడ్ సినిమాలకు ప్రచారం లేకపోయినా ఇండియాలో సక్సెస్ అవుతాయని అన్నారు. ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే వారి చిత్రాలకు ప్రేక్షాదరణ దక్కుతుందని అన్నారు. కానీ అందుకు భిన్నంగా బాలీవుడ్ దర్శకులు, నటీనటులు ఎంత ప్రచారం చేసుకున్న సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదని ఎద్దేవా చేశారు. కేఆర్కే ట్వీట్లో రాస్తూ..'బాలీవుడ్ నటులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి పరుగెత్తుతుంటారు. కానీ బాలీవుడ్ నటులు పరిగెత్తినట్లుగా ఇంగ్లీష్ సినిమా నటులు భారత్‌లో తమ చిత్రాలను ప్రమోట్ చేయడం లేదు. హాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఏ జర్నలిస్టుకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. కానీ ఇప్పటికీ హాలీవుడ్ సినిమాలు ఇండియాలో బ్లాక్ బస్టర్ బిజినెస్ చేస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ తనను తానే నాశనం చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో ప్రతి చిత్రం చెత్తగా ఉంటోందని ప్రజలు బాలీవుడ్ చిత్రాలను చూడటానికి ఆసక్తి చూపరు. ఈ విధ్వంసానికి కార్పొరేట్ సంస్థలు పూర్తిగా బాధ్యత వహిస్తాయని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వారు సినిమాలు కాకుండా ప్రాజెక్ట్‌లను మాత్రమే చేస్తున్నారు. ' సినీ క్రిటిక్ బాలీవుడ్‌పై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఇది చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) English films actors are not promoting their films in India like Bollywood actors are running pillar to pole to promote their films. Hollywood producers, directors, actors are not Giving interviews to every Aira Gera Natthu Khera journalist. Still Hollywood films are doing… — KRK (@kamaalrkhan) July 24, 2023 -
Pingali Lakshmikantham: ఆయన జయంతి, వర్ధంతి.. ఒకేరోజు
ఆధునికాంధ్ర సాహిత్యంలో సుప్రసిద్ధ కవి, ఆచార్యుడు, నటుడు, విమర్శకుడు, ఆకాశవాణి కార్యక్రమాల సలహాదారు ఆయన. అష్టదిగ్గజ కవుల్లో పింగళి సూరన వంశానికి చెందిన పింగళి లక్ష్మీకాంతం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 1894 జనవరి 10వ తేదీన కృష్ణాజిల్లా అర్తమూరులో జన్మించారు. పాఠశాల విద్య మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. అప్పుడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అక్కడ తెలుగు పండితుడుగా ఉన్నారు. పింగళి, విశ్వనాథ వంటి వారంతా చెళ్లపిళ్ల వారి శిష్యులే. బందర్ నోబుల్ హైస్కూల్లో తెలుగు పండితుడిగా పింగళి కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత మద్రాస్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడిగా పనిచేశారు. 1931లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్ కోర్సు ప్రారంభించి పాఠ్య ప్రణాళికను రూపొందించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు అదే ప్రామాణికమైన పాఠ్యప్రణాళిక. ఆయన ప్రియమిత్రుడు, సహాధ్యాయి కాటూరి వెంకటేశ్వరరావుతో కలసి తొలి రోజుల్లో శతావధానాలు చేశారు. ఇద్దరూ జంట కవులుగా రచించిన ‘సౌందర నందం’ కావ్యాన్ని తమ గురు వైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రికి అంకితం ఇచ్చారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యుడిగా 1961–65 మధ్య పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 18 సంవత్సరాలు పనిచేసి 1949లో పదవీ విర మణ చేశారు. ఆయన బోధనల నోట్సులు ఆంధ్ర సాహిత్య చరిత్ర, విమర్శకు ప్రామాణి కాలు. తర్వాత వాటిని ఆంధ్ర సాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్షలుగా ఆయనే ప్రచురించారు. అవి ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఆయన రూపొందించిన సంస్కృత ‘కుమార వ్యాకరణం’ ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథంగా ఉంది. ఆయన రేడియో ప్రసంగాలు, గౌతమ వ్యాసాలు విమ ర్శకు నిలువెత్తు నిదర్శనాలు. ఆయన రచించిన మధుర పండితరాజం, గంగాలహరి, తేజోలహరి ప్రసిద్ధి పొందాయి. ఆయన గౌతమ నిఘంటువు (ఇంగ్లీషు–తెలుగు) ప్రామాణికమైంది. పింగళి 1954 నుండి 1961వరకు విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారుడిగా గొప్ప కార్యక్రమాలు రూపొందించారు. నటుడిగా పాండవోద్యగ విజయాల్లో ధర్మరాజుగా, ముద్రారాక్షసం నాటకంలో రాక్షస మంత్రిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. పింగళివారు 1972 జనవరి 10 తేదీన పరమదించారు. సాహితీ ప్రియుల హృదయాల్లో ఆయన చిరస్మర ణీయులు. – డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు (జనవరి 10 పింగళి లక్ష్మీకాంతం జయంతి, వర్ధంతి) -
'నీ బాయ్‌ఫ్రెండ్‌కి పట్టిన గతే నీకూ పడుతుంది'.. రష్మికపై దారుణమైన ట్వీట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం టాప్ హీరోయిన్గా వెలిగిపోతుంది. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఆమె నటించిన మిషన్ మజ్ను, వారీసు చిత్రాలు రిలజ్కు రెడీగా ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు వివాదాలతోనూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న రష్మికపై బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే దారుణమైన కామెంట్స్ చేశాడు. `మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ మిమ్మల్ని భోజ్‌పురి చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది` అంటూ రష్మికను కించపరిచే విధంగా కేఆర్కే ట్వీట్ చేశాడు. దీంతో అతడి ట్వీట్‌పై అటు రష్మిక ఫ్యాన్స్, ఇటు విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ముందు నీ సంగతి చూసుకో, తర్వాత మిగతా వారి గురించి కామెంట్స్ చేద్దువు గానీ అంటూ కేఆర్కేపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. Madam @iamRashmika Ji hope you know, what we Hindi audiences did with your boyfriend Anakonda film #Liger and throw him out of Bollywood. Exactly same, we are going to do with you. But we will be happy to watch you in Bhojpuri films. — KRK (@kamaalrkhan) January 9, 2023 Those all the people should do checkup of their eyes, who call @iamRashmika a national crush. Rashmika should do films with #RaviKishan #Nirahua #PawanSingh #KhesariLal etc if she wants to rock.🤪😁 — KRK (@kamaalrkhan) January 9, 2023 -
టీనేజ్‌లో గాంధీజీని తీవ్రంగా విమర్శించేవాడిని: కమల్ హాసన్
సినీ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమల్ మహాత్మా గాంధీ గురించి చాలా ఆసక్తికర విషయాలు రాహుల్‌కి చెప్పారు. తాను టీనేజ్‌లో ఉండగా జాతిపిత మహాత్మగాంధీని తీవ్రంగా విమర్శించేవాడినని, పైగా ఆ వాతావరణం కూడా అలానే ఉండేదంటూ చెప్పుకొచ్చారు. కానీ తన నాన్న మాత్రం కాంగ్రెస్ వ్యక్తేనని అన్నారు. సంత్సరాలు గడిచేకొద్ది తాను మహాత్మా గాంధీకి అభిమానిగా మారానని చెప్పారు. అందుకే హేరామ్ సినిమా చేశానని చెప్పుకొచ్చారు. తప్పుచేస్తే క్షమించండి అని చెప్పడం తన పద్ధతి అని కూడా చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్న వారం రోజుల తర్వాత ఇరువురు కలిసి ఇలా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో కమల్‌హాసన్‌కు ప్రియాంక గాంధీ కుమారుడు క్లిక్ చేసిన పులి నీరు తాగుతున్నపెద్ధ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇది మీ జీవితం పట్ల దృక్పథం, వైఖరిని చెబుతోంది, పైగా మీరు గొప్ప భారతీయుడు, గొప్ప ఛాంపియన్ అనే వాస్తవాన్ని మాకు తెలియజేస్తుందంటూ రాహుల్ ఈ చిత్ర పటాన్ని ఆవిష్కరిస్తూ.. కమల్ హాసన్‌తో అన్నారు. అలాగే రాహుల్ ద్వేషం అనేది అంధత్వం, అపార్థం లాంటిదని కామెంట్ చేయగా, అందుకు ప్రతిగా కమల్ ద్వేషానికి ఉన్న మరో చెత్త రూపం 'హత్య' అని చెప్పారు. (చదవండి: ఢిల్లీ మహిళను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన..వెలుగులోకి విస్తుపోయే నిజాలు) -
ఒడిశాలో ఏం జరుగుతోంది? మరో రష్యా పౌరుడు మిస్సింగ్!
భువనేశ్వర్: పది నెలలుగా ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తోన్న రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దేశ పౌరులు ఇటీవల ఒడిశాలోని రాయగడ హోటల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పావెల్ అంటోవ్(65) అనే ఎంపీ, ఆయన స్నేహితుడు ఇరువురు రెండ్రోజుల వ్యవధిలో హోటల్లో రక్తపు మడుగులో పడి కనిపించటం కలకలం రేపింది. ప్రస్తుతం పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన మరో రష్యా పౌరుడు కనిపించకుండా పోయాడనే వార్త కలకలం సృష్టిస్తోంది. ఒడిశాలో ఏం జరుగుతోంది? అక్కడి పోలీసులు ఏం చెబుతున్నారు. ఇదీ జరిగింది.. ఒడిశా రాజధాని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం.. రష్యాకు చెందిన ఓ 60ఏళ్ల వ్యక్తి ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. తాను రష్య వసలదారుడినని, తాను యుద్ధానికి, పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. తాను నిరాశ్రయుడిగా మారానని, తనకు సాయం చేయాలని కోరాడు. మరోవైపు.. రైల్వే స్టేషన్లో ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి ఆచూకీ గల్లంతైనట్లు వార్తలు చక్కర్లు కొంటాయి. ఆయనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాయి. ఒడిశా రాయగడలోని హోటల్లో ఇద్దరు రష్యన్ వ్యక్తులు మరణించిన క్రమంలో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఆ వార్తలను కొట్టిపారేశారు ఒడిశా పోలీసులు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి అదృశ్యం కేసు నమోదు కాలేదని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ‘నవంబర్లోనూ ఆ వ్యక్తి ప్లకార్డు పట్టుకుని రైల్వే స్టేషన్లో కనిపించాడు. ఆయన పాస్‌పోర్టును తనిఖీ చేశాం. ప్రయాణికుల నుంచి డబ్బులు అడుక్కుంటున్నాడు. అతడి వివరాలు తనిఖీ చేసి పూరీకి పంపించాం. అప్పటి నుంచి తనవారితో అక్కడే ఉంటున్నాడు. రాయగడ హోటల్ ఘటనలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు’అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో.. -
''బ్రహ్మస్త్ర నష్టాలతో కరణ్ జోహార్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు''
బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) కరణ్ జోహార్‌పై సంచలన కామెంట్స్ చేశారు.ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ట్వీట్ చేశాడు. బ్రహ్మాస్త్ర తో భారీ నష్టాలను చవిచూసిన కరణ్‌జోహార్ ఆత్మహత్యకు ప్రయత్నించాడంటూ బాంబ్ పేల్చాడు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ నిర్మించాయి. ''ఈ సినిమా ఫలితం, నష్టాలను చూసి కరణ్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో డిప్రెషన్‌తో ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తనకు సమాచారం ఉందని కేఆర్కే ఆరోపించాడు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ అతనికి రూ. 300 కోట్లు అప్పుగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే బ్రహ్మాస్త్ర కారణంగా దివాళా తీసినట్లు కరణ్ ఎందుకు ప్రపంచానికి చెప్పట్లేదు'' అంటూ కేఆర్కే ప్రశ్నించాడు. కాగా గతంలో బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ లెక్కలు తప్పిచూపించారని ఆరోపించిన కేఆర్కే ఇప్పుడు కరణ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేఆర్కే చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. According to sources, Sometimes ago, Karan Johar made a drama at his home for suicide coz of huge loss of #Brahmastra! Then Mukesh Ambani gave him ₹300Cr loan. Now Question is this, why Karan doesn’t tell to world clearly that he has become bankrupt coz of disaster #Brahmastra — KRK (@kamaalrkhan) December 2, 2022 -
KRK Arrest: నటుడు, క్రిటిక్ కేఆర్కే అరెస్ట్.. ఆ ట్వీట్‌తో వివాదం
బాలీవుడ్ సినీ విమర్శకుడిగా పొరేందిన కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు(మంగళవారం) కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో కేఆర్కే వెలుగులోకి వచ్చారు. తనను తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే రషీద్ ఖాన్.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ సమా టాప్ హీరోల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. 'కొంతమంది ప్రముఖులను తీసుకెళ్లకుండా కరోనా వెళ్లదు. ఆ సమయంలో నేను పేర్లు చెప్పలేదు. కానీ నాకు తెలుసు.. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి వాళ్లు చనిపోతారని. అంతేకాకుండా తర్వాత పైకి పోయేది ఎవరో కూడా నాకు తెలుసు' అంటే కేఆర్కే చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై కేసు నమోదవగా తాజాగా కేఆర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. KRK arrested for below tweets done in 2020 pic.twitter.com/WklfVN8Lzi — Gabbbar (@GabbbarSingh) August 30, 2022 -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హఠాన్మరణం
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ ఎల్ఎం హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. కౌశిక్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంలో తమిళనాట కౌశిక్‌కు మంచి పేరుంది. ఈయన చనిపోయే ఆరుగంటలకు ముందు కూడా 'సీతారామం' సినిమాకు సంబంధించిన ట్వీట్ చేశారు. ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ను అందించడం,ఇంటర్వ్యూలతో కౌశిల్ సోషల్ మీడియాలోనూ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. కాగా కౌశిక్ మరణం పట్ల దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ధనుష్ , కీర్తి సురేష్ వంటి పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు. 50 CR+ WW gross is official now 👍🔥👌👏 #SitaRamam https://t.co/MZn9XTPfiI — Kaushik LM (@LMKMovieManiac) August 15, 2022 Thinking of you and saying a prayer. You will be missed @LMKMovieManiac. — Vijay Deverakonda (@TheDeverakonda) August 15, 2022 @LMKMovieManiac This is truly heartbreaking. I so so wish this isn’t true. I cannot imagine what your family is going through. Kaushik we know each other mostly through Twitter and a few personal interactions. You have always shown me so much love and support 💔💔💔 — Dulquer Salmaan (@dulQuer) August 15, 2022 -
Kathi Mahesh : ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ మృతి
సాక్షి, చెన్నై : ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అకస్మాత్తుగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కత్తి మహేశ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మానవతా కోణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17లక్షల రూపాయలు అందచేసింది. అయినా కూడా మహేశ్ ప్రాణాలు దక్కలేదు. ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేశ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్-1 ద్వారా సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కత్తి మహేశ్. అంతకుముందు నందు హీరోగా నటించిన పెసరట్టు అనే సినిమాను తెరకెక్కించారు. కాగా, హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లోనూ నటించారు. -
బన్నీ ఫ్యాన్స్ వేధింపులు ఆగట్లేదు
సాక్షి, తిరువనంతపురం: నా పేరు సూర్య చిత్రం రివ్యూ ఆమెను చిక్కుల్లో పడేసింది. అపర్ణ ప్రశాంతి అనే ప్రీలాన్స్ ఫిలిం క్రిటిక్ చిత్రం అస్సలు బాగోలేదంటూ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆమెను వేధించటం ప్రారంభించారు. ఈ తతంగంపై గురువారం మల్లాపురం పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు మరింతగా వేధింపులు ఎక్కువయ్యాయని అపర్ణ చెబుతున్నారు. ‘గత నాలుగేళ్ల నుంచి పలు ప్రముఖ పత్రికలకు కూడా రివ్యూలు రాస్తున్నా. మోహన్‌లాల్, మమ్మూటీ లాంటి స్టార్ల విషయంలో కూడా ఖచ్ఛితమైన రివ్యూలు ఇచ్చా. వాళ్ల ఫ్యాన్స్ నుంచి నాకు ఏనాడూ ఇలాంటి బెదిరింపులు ఎదురుకాలేదు. కానీ, ఇప్పుడు ఈ చిత్రం విషయంలోనే నాకీ పరిస్థితి ఎదురైంది. సంస్కారం లేకుండా అసభ్యపదజాలంతో నన్ను తిడుతున్నారు. రేప్ చేసి గుణపాఠం నేర్పుతారంట.వాళ్ల ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారన్న విషయం వారికి కనిపించటం లేదేమో. సైనికుడి సినిమాను కించపరుస్తున్నావ్. నువ్వేమైనా దేశద్రోహివా?పాకిస్థాన్ గూడఛారివా? అంటూ విమర్శించారు. సినిమా బాగోలేదు అన్నందుకు నన్ను, నా కుటుంబాన్ని చెప్పలేని భాషలో ఇంతలా తిట్టి పోయాలా? అని ఆమె ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘సినిమా చూస్తున్నంత సేపు తలనొప్పి వచ్చింది. అదేం దేశభక్తో కాస్త కూడా నాకు అర్థం కాలేదు. బయటకు వెళ్దామంటే కుండపోత వర్షం. ఆ కారణంగా బలవంతంగా థియేటర్లోనే ఉండిపోయా’ అని వెటకారంగా ఆమె నా పేరు సూర్య సినిమాకు రివ్యూ ఇచ్చారు. అక్కడి నుంచి బన్నీ ఫ్యాన్స్ ఆమెను వేధించటం ప్రారంభించారు. ఆమెకు మద్ధతుగా పలు మీడియా ఛానెళ్లు నిలవటం విశేషం. -
నా తండ్రే పెద్ద విమర్శకుడు..!
ముంబైః బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలపై విమర్శకుల గురించి అడిగిన ప్రశ్నకు భిన్నంగా స్పందించాడు. ప్రేక్షలకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సూపర్ స్టార్.. తాజా సినిమా సుల్తాన్ కూడ సునామీ సృష్టిస్తున్న తరుణంలో తన తండ్రే తనకు పెద్ద విమర్శకుడని చెప్పుకొచ్చారు. మీ దృష్టిలో ఎవరు మంచి విమర్శకులు అని అడిగిన ప్రశ్నకు సల్మాన్ కొత్తగా స్పందించారు. ప్రతి సినిమా విషయంలోనూ తనకు తన తండ్రే పెద్ద విమర్శకుడని తెలిపాడు. ముందుగా ఆయన స్పందనే నాకు ముఖ్యమని, ప్రతి సినిమా చూసి వచ్చిన తర్వాత మా త్రండ్రి సలీం ఖాన్... తన అభిప్రాయాన్ని ఎంతో సున్నితంగా చెప్తుంటారని తెలిపాడు. ఆయనకు నచ్చితే ఆ సినిమా విషయం ఇక మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చని చెప్తుంటారని, నచ్చకపోయినప్పుడు కూడా ఆ విషయం మర్చపోయి మరో సినిమాకు ఇంకొంచెం ఎక్కువ కష్టపడమని సూచిస్తుంటారని సల్మాన్ వివరించాడు. అయితే మీకోసం ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాస్తుంటారా అన్న ప్రశ్నకు మాత్రం... ఆయన ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయకపోయినా, అద్భుతమైన వ్యాసాలు రాస్తుంటారని, ప్రస్తుతం ట్వీట్లు కూడా చేస్తున్నారని అన్నాడు. నేను ఎన్నో ఏళ్ళుగా సినిమాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నానని, ఒక చిత్రంలో చేసినట్లు మరోదాంట్లో చేయనని, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగనివ్వనని ఈ సందర్భంలో తెలిపాడు. -
సంజయ్ @సినీపీడియా
తెలుగు సినీ చరిత్రకారునిగా, విశ్లేషకునిగా, విమర్శకుడిగా, కాలమిస్ట్‌గా సంజయ్ కిషోర్‌ది దశాబ్దాల అనుభవం. తెలుగు సినిమాపై అభిమానం అతన్ని సినీపీడియాగా మార్చేసింది. సినిమాలకు సంబంధించి ఏ ఫొటో కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా అందరికీ తన పేరే గుర్తొచ్చేంతగా ఎదిగారు సంజయ్ కిషోర్. ఈ సినీ నిధికి రాగరాగిణి ఆర్ట్ అసోసియేషన్ ఆదివారం ‘సినీ పరిజ్ఞాన ప్రవీణ’ బిరుదును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సంజయ్ కిషోర్‌తో సిటీప్లస్ మాటామంతి. నా చిన్నప్పుడు మా కుటుంబం గుంటూరులో ఉండేది. మా అమ్మ ధనలక్ష్మి నాయుడు మహానటి సావిత్రికి ఉత్తరాలు రాసేది. ఆ మహానటి తన ఫొటో జత చేసి ప్రత్యుత్తరాలు పంపేది. అలా పంపిన ఒక ఫొటోను అమ్మ నాకు చూపించింది. అప్పుడు నా మనసులో కలిగిన ఆలోచన ఇప్పటికీ ఒక యజ్ఞంలా సాగుతోంది. తొమ్మిదో తరగతి నుంచి స్టిల్ ఫొటోల కోసం ఎన్నో ఏళ్లు, ఎన్నో ఊళ్లు తిరిగాను. ఎంతో ఖర్చు పెట్టి వాటిని సేకరించాను. నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులు, జర్నలిస్ట్‌లు ఇలా అందరి నుంచి దాదాపు 70 వేలకుపైగా ఫొటోలను సేకరించి భద్రపరిచాను. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే సావిత్రి తొలి స్టిల్ ఫొటో నా ఒక్కని దగ్గరే ఉంది. జీవితమే సినిమా రంగం.. నా జీవితం సినిమాతోనే ముడిపడి ఉంది. పాత్రికేయుడిగా ఎందరో సినీప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. ఎన్నో కాలమ్స్, రివ్యూలు రాశాను. ప్రింట్ మీడియాతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సినీ నేపథ్యం ఉన్న కార్యక్రమాలు నిర్వహించాను. నాలుగేళ్లు సెన్సార్ బోర్డులో సభ్యుడిగా, సినిమా నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్‌గా కూడా చేశాను. ‘సంగమం’ సంస్థ ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. సినిమాలతో ముడిపడి ఉన్న ప్రతి క్షణం నేను ఎప్పటికీ మరచిపోలేను. నా దగ్గర ఉన్న ఫొటోలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఉంది. -కోన సుధాకర్‌రెడ్డి