
సినీ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమల్ మహాత్మా గాంధీ గురించి చాలా ఆసక్తికర విషయాలు రాహుల్‌కి చెప్పారు. తాను టీనేజ్‌లో ఉండగా జాతిపిత మహాత్మగాంధీని తీవ్రంగా విమర్శించేవాడినని, పైగా ఆ వాతావరణం కూడా అలానే ఉండేదంటూ చెప్పుకొచ్చారు. కానీ తన నాన్న మాత్రం కాంగ్రెస్ వ్యక్తేనని అన్నారు.
సంత్సరాలు గడిచేకొద్ది తాను మహాత్మా గాంధీకి అభిమానిగా మారానని చెప్పారు. అందుకే హేరామ్ సినిమా చేశానని చెప్పుకొచ్చారు. తప్పుచేస్తే క్షమించండి అని చెప్పడం తన పద్ధతి అని కూడా చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్న వారం రోజుల తర్వాత ఇరువురు కలిసి ఇలా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో కమల్‌హాసన్‌కు ప్రియాంక గాంధీ కుమారుడు క్లిక్ చేసిన పులి నీరు తాగుతున్నపెద్ధ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు.
ఇది మీ జీవితం పట్ల దృక్పథం, వైఖరిని చెబుతోంది, పైగా మీరు గొప్ప భారతీయుడు, గొప్ప ఛాంపియన్ అనే వాస్తవాన్ని మాకు తెలియజేస్తుందంటూ రాహుల్ ఈ చిత్ర పటాన్ని ఆవిష్కరిస్తూ.. కమల్ హాసన్‌తో అన్నారు. అలాగే రాహుల్ ద్వేషం అనేది అంధత్వం, అపార్థం లాంటిదని కామెంట్ చేయగా, అందుకు ప్రతిగా కమల్ ద్వేషానికి ఉన్న మరో చెత్త రూపం 'హత్య' అని చెప్పారు.
(చదవండి: ఢిల్లీ మహిళను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన..వెలుగులోకి విస్తుపోయే నిజాలు)
Comments
Please login to add a commentAdd a comment