Kamal Haasan Praises Rahul Gandhi After Congress Win in Karnataka - Sakshi
Sakshi News home page

శభాష్‌ రాహుల్‌.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్‌.. కమల్ ప్రశంసల వర్షం..

Published Sat, May 13 2023 6:27 PM | Last Updated on Sat, May 13 2023 7:22 PM

Kamal Haasan Praises Rahul Gandhi After Congress Win Karnataka - Sakshi

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటుడు, ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్. ట్విట్టర్‌లో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మహాత్మా గాంధీలా నడుచుకుంటూ వెళ్లి ప్రజల మనసులు గెలుచుకున్నావని కొనియాడారు. 

'మీ సౌమ్యమైన మార్గంలో ప్రేమ, వినయంతో ప్రపంచంలో ఏ శక్తినైనా కదలించవచ్చనని నిరూపించారు. ప్రగల్భాలకు పోకుండా, రొమ్ముచరుచుకోకుండా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు.  కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరిస్తారని మీరు నమ్మారు. ఇప్పుడు వారంతా ఐకమత్యంగా స్పందించి మీపై ఉన్న నమ్మకాన్ని తెలియజేశారు.  విజయానికే కాదు.. ఆ విజయం సాధించిన తీరుకు కూడా మీకు వందనం..' అని కమల్ ట్వీట్ చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 136 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. బీజేపీ కేవలం 64 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 20 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు.
చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన 6 మంత్రాలివే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement