న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. బలవంతులపై పేదల శక్తి గెలిచిందన్నారు. కర్ణాటకలో విద్వేషానికి తెరపడిందని, ప్రేమకు తెరలేచిందని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు..
'ఈ ఎన్నికల్లో ధనికులకు, పేదలకు మధ్య యుద్ధం జరిగింది. కర్ణాటకలో పెత్తందార్లను పేదలు ఓడించారు. ఈ ఎన్నికల్లో మేం విద్వేషాన్ని ఉపయోగించి పోరాడలేదు. పేదల కోసం పోరాడం. ఇది అందరి విజయం. ప్రేమతో కర్ణాటక ప్రజల మనసులు గెలుచుకున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన 5 హామీలను మొట్ట మొదటి కేబినెట్ సమావేశంలోనే నెరవేర్చుతాం. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ ఫలితాలే రిపీట్ అవుతాయి. భారీ విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు' అని రాహుల్ అన్నారు.
#WATCH | "Karnataka mein Nafrat ki bazaar band hui hai, Mohabbat ki dukaan khuli hai": Congress leader Rahul Gandhi on party's thumping victory in #KarnatakaPolls pic.twitter.com/LpkspF1sAz
— ANI (@ANI) May 13, 2023
#WATCH | "Poor people defeated crony capitalists in Karnataka. We didn't fight this battle using hatred...": Congress leader Rahul Gandhi on party's thumping victory in #KarnatakaPolls #KarnatakaElectionResults pic.twitter.com/KKSiV2Lxye
— ANI (@ANI) May 13, 2023
కాగా.. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం చేరుకున్న రాహుల్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలతో హొరెత్తించారు. విజయంతో ఫుల్ జోష్‌లో సంబరాల్లో మునిగిపోయారు.
చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే..
Comments
Please login to add a commentAdd a comment