Karnataka Election 2023: Rahul Gandhi's Rides Scooter With A Delivery Boy In Bengaluru, Video Viral - Sakshi
Sakshi News home page

Video: డెలివరీ బాయ్‌ స్కూటర్‌పై రాహుల్‌ గాంధీ చక్కర్లు..

Published Mon, May 8 2023 8:53 AM | Last Updated on Mon, May 8 2023 10:26 AM

Karnataka Election: Rahul Gandhi New style Of Campaign On Scooter - Sakshi

సాక్షి, బెంగళూరు: ఫుడ్‌ డెలివరీ బాయ్‌తో స్కూటర్‌ మీద కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బెంగళూరులో సవారీ చేశారు. దారిలో ఒక హోటల్‌లో టిఫిన్‌ చేశారు. ఎస్‌సీజీ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీని పరామర్శించారు. ఈ సందర్భంగా గిగ్‌ వర్కర్స్, డెలివరీ బాయ్స్‌తో మాట్లాడారు. అధికారంలోకి వస్తే రూ.3 వేల కోట్ల కార్ఫస్‌ ఫండ్‌తో గిగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేసి, అండగా నిలుస్తామన్నారు. 

ఏ ‘ఇంజిన్‌’కు ఎంత కమీషన్‌? 
బనశంకరి: కర్ణాటక ప్రభుత్వ అవినీతిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఆదివారం బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్‌లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ‘మూడేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక్కడ అవినీతి విషయం ప్రధాని మోదీకి కూడా తెలుసు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని కూడా చెప్పుకుంటున్నారు. కానీ, ఈసారి డబుల్‌ ఇంజిన్‌ మాయమైంది. 40 శాతం కమీషన్‌లో ఏ ఇంజిన్‌కు ఎంత అందిందో కర్ణాటక ప్రజలకు మోదీజీ చెప్పాలి’అని అన్నారు. 
చదవండి: కేరళలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 20 మంది మృతి

అవినీతి, నిరుద్యోగమే అసలు ఉగ్రవాదం: ప్రియాంక 
అవినీతి, దోపిడీ, అధిక ధరలు, నిరుద్యోగమే కర్ణాటకలో అసలు తీవ్రవాదమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. అధికార బీజేపీ ప్రజల వాస్తవ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఆదివారం దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరెలో కాంగ్రెస్‌ ప్రచారసభలో ఆమె ప్రసంగించారు.  

మరోవైపు  ఆదివారం బెంగళూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడు కిలోమీటర్ల రోడ్‌ షో నిర్వహించారు. కాషాయరంగు వాహనంపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రజలు పూలను చల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. మోదీ ప్రయాణించిన రోడ్లల్లో పెద్ద ఎత్తున బ్యానర్లను అతికించారు బీజేపీ నాయకులు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బెంగళూరు తిప్పసంద్ర కెంపేగౌడ విగ్రహం నుంచి మహాత్మా గాంధీ రోడ్డులోని ట్రినిటీ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో సాగింది.
చదవండి: క్యూలో నిలబడినా, నిద్రపోయినా.. ఆఖరికి ఏడ్చినా జీతమిస్తారు..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement