మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీని తీవ్రవాదంతో సహా అనేక నేరాలపై ఇప్పటికే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించనున్నాయి క్రెమ్లిన్ వర్గాలు.
ప్రాసిక్యూటర్లు అలెక్సి నవాల్నీపై మోపబడిన అదనపు కేసులు.. తీవ్రవాద సంస్థ ఏర్పాటు, నాజీ మద్దతుదారులకు పునరావాసం, తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా రెండు బహిరంగ సభలు, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నవాల్నీ అవినీతి నిరోధక నిధి పేరిట మరో సంస్థను స్థాపించడం, మైనర్లను ఉగ్రవాదం వైపు నడిపించడం (నవాల్నీ సభలకు 18 సంవత్సరాల లోపు వారు హాజరైనందుకు), తీవ్రవాదానికి ఆర్ధికంగా ఊతమిచ్చేందుకు నిధులు సేకరించడం వంటి అభియోగాలను మోపారు.
కొత్తగా నమోదైన కేసుల విషయమై నవాల్నీ స్పందిస్తూ ప్రజా జీవితానికి నన్ను దూరంగా ఉంచాలన్న కారణంతోనే మరిన్ని కేసులు మోపి మరో 20 ఏళ్ళ పాటు జైల్లోనే మగ్గిపోయేలా చేయాలని పుతిన్ నేతృత్వంలోని క్రెమ్లిన్ వర్గాలు చూస్తున్నాయన్నారు. తనను తీవ్రవాదిగా చిత్రీకరించి మొత్తంగా 35 ఏళ్ల జైలు శిక్ష విధించాలన్నదే రష్యా అధ్యక్షుడి అభిమతమని అన్నారు.
జైల్లో ఉన్నా కూడా తన సోషల్ మీడియా ద్వారా అనుచరుల సాయంతో ఎప్పటికపుడు యాక్టివ్ గా ఉంటారు నవాల్నీ. కొత్త అభియోగాల విషయంలో క్రెమ్లిన్ పన్నుతున్న కుట్రను కూడా ఆయన సోషల్ మీడియాలో పొందుపరిచారు. స్వేచ్ఛతో కూడిన కొత్తదైన ధనిక రాజ్యానికి జన్మనివ్వాలంటే ప్రతి ఒక్కరూ అలాంటి రాజ్యం కోసం త్యాగం చేసి తల్లిదండ్రులు కావాలని కోరారు.
ఇది కూడా చదవండి: మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు
Comments
Please login to add a commentAdd a comment