Kremlin
-
రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది?
రష్యా పలు అధికారిక కార్యక్రమాల కోసం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డూప్ (బాడీ డబుల్స్)ను వినియోగిస్తున్నదంటూ సోషల్‌మీడియాలో తరచూ పలు ఊహాగానాలను షికారు చేస్తున్నాయి. అయితే వీటిని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఖండించింది. క్రెమ్లిన్ అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటువంటి వాదనలను వినోదం కోసమే చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మాస్కోలో ప్రారంభమైన రష్యా ఎగ్జిబిషన్లో పెస్కోవ్ మాట్లాడుతూ ‘మాకు ఉన్నది పుతిన్ ఒక్కరే. రష్యా అధ్యక్షుని ‘బాడీ డబుల్స్’ అంటూ వస్తున్న ఊహాగానాలు హాస్యాస్పదమైనవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇటువంటివి విరివిగా కనిపిస్తున్నాయని అన్నారు. కొందరు నిపుణులు ఇంటర్నెట్లో పుతిన్ రూపాలను లెక్కకుమించి సృష్టిస్తున్నారని ఆరోపించారు. రష్యా అధ్యక్షుని బాడీ డబుల్స్‌ను పలు విదేశీ పర్యటనలతో సహా కొన్ని బహిరంగ కార్యక్రమాలకు కూడా ఉపయోగించారని ఒక వార్తాపత్రిక పేర్కొంది. అలాగే ఇటీవల జపనీస్ టీవీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిల్ బుడనోవ్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. పుతిన్ ‘లుక్-అలైక్’ అంటూ వచ్చిన పలు నివేదికలు అసంబద్ధమైనవంటూ తాజాగా మరోమారు డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మంచి ఫిట్నెస్ కలిగి ఉన్నారని , నాన్‌స్టాప్‌గా కూడా పని చేయగలరని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను క్రెమ్లిన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పందించారు. బాడీ డబుల్స్‌ను వాడుతున్నారని నిరాధార ఆరోపణలను కొట్టిపారేశారు. అదంతా అబద్ధంగా పేర్కొన్నారు. పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్లో వదంతులు వచ్చాయని పేర్కొంటూ ప్రశ్చ్యాత దేశాల మీడియా ప్రచురణలు వెలుగులోకి వచ్చాయి. పుతిన్ (71) క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో సహా తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నట్లు 2022 నుంచే వివిధ నివేదికలు వస్తున్నాయి. బహిరంగ ప్రదర్శనలలోనూ పుతిన్ అస్థిరంగా, ఉబ్బినట్లుగా కనిపించడం ఈ పుకార్లకు అప్పట్లోనే ఆజ్యం పోసింది. తాజాగా సెప్టెంబర్‌లో రష్యాన్ టెలిగ్రామ్ ఛానెల్లో ఓ పోస్టు దర్శనమిచ్చింది.'మీరు మమ్మల్ని విడిచిపెట్టవద్దు. సజీవంగా ఆరోగ్యంగా ఉన్నారని దేవుడిని ప్రార్ధిస్తున్నాం' అంటూ ఓ పోస్టు వెలుగులోకి వచ్చింది. దీంతో మీడియా ప్రతినిధులు పుతిన్ ఆరోగ్యంపై క్రెమ్లిన్ ప్రతినిధిని తాజాగా ప్రశ్నించారు. బాడీ డబుల్స్‌కు సంబంధించి 2020లోనే పుకార్లు వచ్చాయి. భద్రతా ప్రయోజనాలు దృష్ట్యా ఓ దేహాన్ని ఉపయోగించారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ పుకార్లను క్రెమ్లిన్ అప్పట్లోనే ఖండించింది. ఇదీ చదవండి: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం -
భారత్‌లో జరిగే జీ20 భేటీకి పుతిన్ దూరం
మాస్కో: వచ్చే నెలలో భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ పాల్గొనడం లేదు. ఉక్రెయిన్‌లో ఏడాదికి పైగా కొనసాగుతున్న స్పెషల్ మిలటరీ ఆపరేషన్‌పైనే ఆయన దృష్టంతా ఉందని శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. దీంతోపాటు బిజీ షెడ్యూల్ ఉన్నందున అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వెళ్లడం లేదని పేర్కొంది. అధ్యక్షుడు పుతిన్ జీ20 సమావేశంలో వర్చువల్‌గా పాల్గొనే విషయం తర్వాత ఖరారవుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి పెష్కోవ్ చెప్పారు. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 దేశాల నేతల సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. తాజాగా జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ భేటీకి కూడా పుతిన్ వెళ్లలేదు. -
పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీని తీవ్రవాదంతో సహా అనేక నేరాలపై ఇప్పటికే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించనున్నాయి క్రెమ్లిన్ వర్గాలు. ప్రాసిక్యూటర్లు అలెక్సి నవాల్నీపై మోపబడిన అదనపు కేసులు.. తీవ్రవాద సంస్థ ఏర్పాటు, నాజీ మద్దతుదారులకు పునరావాసం, తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా రెండు బహిరంగ సభలు, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నవాల్నీ అవినీతి నిరోధక నిధి పేరిట మరో సంస్థను స్థాపించడం, మైనర్లను ఉగ్రవాదం వైపు నడిపించడం (నవాల్నీ సభలకు 18 సంవత్సరాల లోపు వారు హాజరైనందుకు), తీవ్రవాదానికి ఆర్ధికంగా ఊతమిచ్చేందుకు నిధులు సేకరించడం వంటి అభియోగాలను మోపారు. కొత్తగా నమోదైన కేసుల విషయమై నవాల్నీ స్పందిస్తూ ప్రజా జీవితానికి నన్ను దూరంగా ఉంచాలన్న కారణంతోనే మరిన్ని కేసులు మోపి మరో 20 ఏళ్ళ పాటు జైల్లోనే మగ్గిపోయేలా చేయాలని పుతిన్ నేతృత్వంలోని క్రెమ్లిన్ వర్గాలు చూస్తున్నాయన్నారు. తనను తీవ్రవాదిగా చిత్రీకరించి మొత్తంగా 35 ఏళ్ల జైలు శిక్ష విధించాలన్నదే రష్యా అధ్యక్షుడి అభిమతమని అన్నారు. జైల్లో ఉన్నా కూడా తన సోషల్ మీడియా ద్వారా అనుచరుల సాయంతో ఎప్పటికపుడు యాక్టివ్ గా ఉంటారు నవాల్నీ. కొత్త అభియోగాల విషయంలో క్రెమ్లిన్ పన్నుతున్న కుట్రను కూడా ఆయన సోషల్ మీడియాలో పొందుపరిచారు. స్వేచ్ఛతో కూడిన కొత్తదైన ధనిక రాజ్యానికి జన్మనివ్వాలంటే ప్రతి ఒక్కరూ అలాంటి రాజ్యం కోసం త్యాగం చేసి తల్లిదండ్రులు కావాలని కోరారు. ఇది కూడా చదవండి: మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు -
రష్యాలో హైడ్రామా మధ్య ముగిసిన తిరుగుబాటు సంక్షోభం
మాస్కో: తిరుగుబాటు నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న క్రిమినల్ కేసును ఉపసంహరించుకునే విధంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో జరిపిన మధ్యవర్తిత్వం ఫలించింది. దీంతో మాస్కో వైపుగా కదులుతామని హెచ్చరించిన వాగ్నర్ తిరుగుబాటు సైన్యం శాంతించి తిరుగుముఖం పట్టింది. క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ మాట్లాడుతూ రక్తపాతాన్ని నిరోధించి, అంతర్గత ఘర్షణలను తగ్గుముఖం పట్టించి, పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీయకుండా చూడాలన్నదే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్బంగా దేశం కోసం వారు చేసిన వీరోచిత పోరాటాలను మేమెప్పుడూ గౌరవిస్తామని అన్నారు. బెలారస్ అధ్యక్షుడు లుకాశెంకో జరిపిన ఈ మధ్యవర్తిత్వం ప్రకారం వాగ్నర్ సైన్యం నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న క్రిమినల్ కేసును ఎత్తివేస్తున్నట్లుగానూ, అలాగే వాగ్నర్ సైనికులపై ఎలాంటి విచారణ కూడా ఉండదని పెస్కోవ్ అన్నారు. ఇక ఈ తిరుగుబాటులో పాల్గొనని సైనికులు యధాతధంగా తమ విధులకు హాజరవ్వొచ్చని తెలిపారు. యెవ్జెనీ ప్రిగోజిన్ పై తీవ్రవాద నేరం మోపబడ్డ గంటల వ్యవధిలోనే అతని తిరుగుబాటు సైన్యం రష్యాలో ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. శనివారం రష్యా సైన్యంపై చేసిన తిరుగుబాటుకి దక్షిణ రష్యా అట్టుడికిపోయింది. అప్పటికే ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర రష్యా వైపుగా వస్తున్నామని ప్రిగోజిన్ ప్రకటించారు. దీంతో మరింత విధ్వంసం తప్పదని భావించిన తరుణంలో రష్యా మిత్రపక్షమైన బెలారస్ అధ్యక్షుడు లుకాశెంకో చొరవ తీసుకుని జరిపిన మధ్యవర్తిత్వం ఫలించడంతో ఊపిరి తీసుకున్నాయి రష్యా శ్రేణులు. ఇది కూడా చదవండి: ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ -
మరో ఆప్షన్ లేదు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను డ్రోన్లతో హత్య చేయడానికి ఉక్రెయిన్ పన్నిన కుట్రను.. భద్రతా సిబ్బంది భగ్నం చేశాయి. అధ్యక్ష నివాసంలో పుతిన్ ఉంటున్న ఫ్లోర్‌కు అతి సమీపంగా రెండు డ్రోన్లు వెళ్లాయని, వాటిని నేల కూల్చినట్లు బుధవారం క్రెమ్లిన్ వర్గాలు ప్రకటించాయి. దీనికి ప్రతీకారంగా మాస్కో వర్గాలు.. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో ఉన్న అధ్యక్ష భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడితో తమకేం సంబంధం లేదని ఉక్రెయిన్ అంటోంది. మరోవైపు పుతిన్‌పై హత్యాయత్నానికి రష్యా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు, పుతిన్‌కు ఆప్తుడు దిమిత్రి మెద్వెదేవ్. ఉక్రెయిన్ ఉగ్రదాడికి కౌంటర్‌గా.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందేనని రష్యా బలగాలకు సూచిస్తున్నాడు ఆయన. ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న మెద్వెదేవ్ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ‘‘రష్యా అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నం ద్వారా ఉక్రెయిన్ ఉగ్రచర్యలకు దిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ముందు ఒకేఒక్క ఆప్షన్ ఉంది. అది జెలెన్స్కీని మట్టుబెట్టడమే. ఇక ఆ హిట్లర్(జెలెన్స్కీని ఉద్దేశించి..) లొంగిపోవాల్సి అవసరం లేదు. ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోతానని వచ్చినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మాస్కో ముందు మరో ప్రత్యామ్నాయమూ అక్కర్లేదు. అతన్ని భౌతికంగా లేకుండా చేయడమే ఇప్పుడు రష్యా బలగాలు చేయాల్సిన పని అని మెద్వెదేవ్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం అర్ధరాత్రి పుతిన్ అధ్యక్ష అధికారిక నివాసం క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ UAV(మానవ రహిత) దాడులకు తెగబడిందని, వాటిని చాకచక్యంగా నేలకూల్చామని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని మాస్కో వర్గాలు ప్రకటించాయి. ఆ సమయంలో పుతిన్ ఇంట్లో లేడని వెల్లడించిన ఆయన సిబ్బంది.. మాస్కోలోని తన నివాసం నుంచే ఆయన తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తారని తెలిపింది. అంతేకాదు మే 9వ తేదీన రెడ్ స్క్వేర్ వద్ద జరిగే విక్టరీ డే పరేడ్‌పై ఈ డ్రోన్ ఎటాక్ ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. జెలెన్స్కీ ఏమన్నారంటే.. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. రష్యా ఆరోపణలను ఖండించారు. పుతిన్‌పై గానీ, మాస్కోపైగానీ ఉక్రెయిన్ దళాలు ఎలాంటి దాడులకు యత్నించలేదని స్పష్టత ఇచ్చారు. ఇలాంటి దాడులకు సరిపడే ఆయుధ సంపత్తి ఉక్రెయిన్ వద్ద లేదని చెబుతున్నారాయన. మేం మా దేశ సరిహద్దులోనే పోరాడుతున్నాం. మా గ్రామాలను, నగరాలను రక్షించుకుంటున్నాం. మా వద్ద అలాంటి దాడులు చేయాలన్నా.. అందుకు తగ్గ ఆయుధాలు లేవు. అంతేసి ఖర్చు చేసే పరిస్థితుల్లోనూ లేం అని చెబుతున్నారు. ఇదీ చదవండి: మొసలి కడుపులోకి ఎలాగ వెళ్లాడంటే.. -
Russia-Ukraine war: పుతిన్‌పై హత్యాయత్నం
కీవ్: అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. అందులో భాగంగా బుధవారం తెల్లవారజామున అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్ దాడులు జరిగాయని ప్రకటించింది. ఇది మతిమాలిన ఉగ్రవాద చర్య అంటూ మండిపడింది. ఇందుకు తీవ్రస్థాయిలో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. భారీ స్థాయిలో ప్రతి దాడి ఉంటుందని ప్రకటించింది. సరైన సమయంలో దీటుగా స్పందిస్తామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామన్నదే వాటి అంతరార్థమని భావిస్తున్నారు. ‘‘దాడులను భగ్నం చేశాం. మా భద్రతా దళాలు డ్రోన్లలో మధ్యలోనే పేల్చేశాయి. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. క్రెమ్లిన్ భవనానికీ నష్టం జరగలేదు. ఆ సమయంలో పుతిన్ క్రెమ్లిన్‌లో లేరు. మాస్కో ఆవల నోవో ఒగర్యోవో నివాసంలో సురక్షితంగా ఉన్నారు’’ అని ఆయన అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. మే 9న నగరంలో జరగాల్సిన విక్టరీ డే పరేడ్‌ను అడ్డుకోవడం కూడా దాడి లక్ష్యమని ఆరోపించారు. పరేడ్ యథాతథంగా జరుగుతుందని ప్రకటించారు. దాడిపై అనుమానాలు క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడులు జరిగినట్టు అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. రష్యా కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి రుజువులూ బయట పెట్టలేదు. దాడి జరిగితే ఆ విషయాన్ని 12 గంటల పాటు ఎందుకు దాచారన్న దానిపైనా వివరణ లేదు. క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడిగా చెబుతున్న వీడియోలు మాత్రం వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మాస్కోలో డ్రోన్లపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. క్రెమ్లిన్‌పై జరిగినట్టు చెబుతున్న డ్రోన్ దాడులతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. తమపై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు బహుశా ఈ ఉదంతాన్ని సాకుగా రష్యా వాడుకోవచ్చని అభిప్రాయపడింది. తమ నగరాలపై జరుపుతున్న తీవ్ర స్థాయి సైనిక దాడులను ఇలా సమర్థించుకోజూస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్‌తో రష్యా 14 నెలలుగా పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. రష్యా అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ దాడులను ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతూ వస్తోంది. ఏం జరిగింది? దాడికి సంబంధించి పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఒకదాంట్లో క్రెమ్లిన్‌పైకి డ్రోన్ దూసుకొస్తూ కన్పించింది. అతి సమీపానికి వచ్చాక పేలిపోయి నేలకూలింది. క్రెమ్లిన్, సమీప భవనాల మీదుగా పొగ వస్తున్న వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. దాడికి సంబంధించి క్రెమ్లిన్ పక్కనున్న నది ఆవల నుంచి తీసినట్టు చెబుతున్న వీడియో మాస్కో స్థానిక టెలిగ్రా చానల్లో రాత్రి పూట ప్రసారమైంది.డ్రోన్ శకలాలు అధికార భవన ఆవరణలో పడ్డట్టు క్రెమ్లిన్ వెబ్సైట్ కూడా పేర్కొంది. తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో భారీ శబ్దాలు, పొగ వచ్చినట్టు స్థానికులు చెప్పుకొచ్చారు. దీనిపై రష్యాలో ప్రభుత్వ అనుకూల వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం ప్రతి దాడులకు దిగి ఉక్రెయిన్ సీనియర్ నాయకులను వరుసబెట్టి అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. జెలెన్స్కీ ‘నిర్ణాయక దాడి’ వ్యాఖ్యల నేపథ్యంలో ఘటన ► ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తాజాగా ఫిన్లండ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ► రష్యాను ఎదుర్కొనేందుకు మరిన్ని శక్తిమంతమైన ఆయుధాలు అందజేయాలని ఐదు నోర్డిక్ దేశాలు ఫిన్లండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్లను గట్టిగా కోరారు. ► ఈ సందర్భంగా హెల్సింకీలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ అతి త్వరలో ప్రతిదాడికి దిగనుందని ప్రకటించారు. ► ‘‘విజయం కోసం నిర్ణాయక దాడి చేయనున్నాం’’ అని చెప్పు కొచ్చారు. తర్వాత కాసేపటికే రష్యా నుంచి డ్రోన్ దాడి ఆరోపణ వెలువడింది. ► మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. రాజధాని కీవ్‌పై ఇరాన్ తయారీ డ్రోన్లతో రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. ► 21 డ్రోన్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు దక్షిణ రష్యాలో క్రాస్నోడర్ ప్రాంతంలో ఓ చమురు డిపోలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ► ఇది రష్యా సరఫరా వ్యవస్థలను లక్ష్యం చేసుకుని కొంతకాలంగా ఉక్రెయిన్ చేస్తు న్న దాడుల్లో భాగమేనని భావిస్తున్నారు. ► ఇది రష్యా సరఫరా వ్యవస్థలను లక్ష్యం చేసుకుని కొంతకాలంగా ఉక్రెయిన్ చేస్తు న్న దాడుల్లో భాగమేనని భావిస్తున్నారు. -
Russia-Ukraine War: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి చొరబడింది. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్‌పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికిరాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్ ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు. ఇంతకీ పుతిన్ ఊహించినదేమిటి? ఆయనకు ఎదురైందేమిటి...? ఎస్ రాజమహేంద్రారెడ్డి: పూర్వపు సోవియట్ యూనియన్ రిపబ్లిక్కులన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది తన లక్ష్యమని పుతిన్ చెప్పుకుంటారు. పొరుగు దేశాలైన ఉక్రెయిన్, బెలారస్ కూడా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని అంటారాయన. రెండేళ్ల క్రితం ఆయన రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు. బెలారస్‌తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు ఆదినుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా తొలుత ఉక్రెయిన్‌లో చొరబడేందుకు తన భూభాగాన్ని అనుమతించింది కూడా. ఎటొచ్చీ పుతిన్‌కు పేచీ అల్లా ఉక్రెయిన్‌తోనే! ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్ ఒకే దేశమన్నదే పుతిన్ గట్టి నమ్మకం. లోగుట్టు వేరే నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్‌లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు. మూడేళ్ల క్రితం ఆయన ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్ కీర్తనలు, గుణగానాలతో హోరెత్తేది. ‘కల్లోల సాగరంలాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్ పుతిన్’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్ దృష్టిలో పుతిన్ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ విన్యాసాల్లో పుతిన్ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్. రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో క్రెమ్లిన్ ఎంచుకున్న మార్గమిది. అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్ లక్ష్యం. పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్ను ఓ దారికి తెస్తే బాహుబలి పుతిన్ సత్తా ఏమిటో తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్ థింక్‌టాంక్ అంచనా. అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం... తర్వాత ఉక్రెయిన్ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి. అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్‌పై దాడిని తప్పుగా పుతిన్ అంగీకరించడం లేదు. రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని సెలవిచ్చారు! దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏకంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలో అడుగుపెట్టారు! ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియాముఖంగా ప్రకటించేశారు. బహుశా పుతిన్ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు! ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆపద్ధర్మ పాత్రతో మొదలై... 1999లో బోరిస్ యెల్సిన్ ఆకస్మిక రాజీనామాతో ఆపద్ధర్మ అధ్యక్షునిగా తొలిసారి గద్దెనెక్కిన పుతిన్ 2000–2004, 2004–08ల్లో రెండు దఫాలుగా అధ్యక్షునిగా కొనసాగారు. అప్పట్లో రష్యా అధ్యక్ష పదవీకాలం నాలుగేళ్లే. తర్వాత 2008 నుంచి 2012 దాకా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఈ దశలో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. తర్వాత 2012 నుంచి 2018 దాకా, 2018 నుంచి ఇప్పటిదాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2024 మార్చితో పదవీకాలం ముగుస్తుంది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షునిగా ఉండరాదన్న నిబంధనను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు. ఫలితంగా 2024తో పాటు 2030 ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం పుతిన్‌కు సంక్రమించింది. ఈ రెండుసార్లూ గెలిస్తే 2036 దాకా ఆయనే రష్యా అధినేతగా చక్రం తిప్పుతారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే యుద్ధంతో అటు రాజ్యకాంక్షను, ఇటు పదవీకాంక్షనూ నెరవేర్చుకోవాలని పుతిన్ పట్టుదలగా ఉన్నారు. అందుకే యుద్ధానికి ఇప్పుడప్పట్లో ముగింపు పలికేందుకు ససేమిరా అంటున్నారు. యుద్ధంలో వెనకబడుతున్నట్టు అన్పించినప్పుడల్లా అణ్వాయుధ బూచితో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా మద్దతుతో లొంగేది లేదంటూ దీటుగా తలపడుతున్నారు. చివరికి గెలుపెవరిదైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం వైరి వర్గాలు రెండింటినీ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్ర చెక్కిలిపై యుద్ధం ఎప్పుడూ ఓ కన్నీటి బిందువే! చెరిగిపోని మచ్చే!! కొసమెరుపు ఏడాది యుద్ధం బాహుబలిగా వ్లాదిమిర్ పుతిన్‌కున్న పేరుప్రతిష్టలను బలి తీసుకుంటే, పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్ పాత్రలు పోషించిన వొలోదిమిర్ జెలెన్స్కీని మాత్రం నిజజీవితంలో హీరోను చేసింది! -
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు విలీనం.. రష్యా కీలక ప్రకటన
కీవ్: ఇటీవల రెఫరెండం చేపట్టిన ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము కలిపేసుకుంటామని రష్యా గురువారం ప్రకటించింది. ఈ రెఫరెండంలో దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలైన జపొరిఝియాలో 93%, ఖేర్సన్లో 87%, లుహాన్స్క్లో 98%, డొనెట్స్క్లో 99% మంది రష్యాకు అనుకూలంగా ఓటేశారని క్రెమ్లిన్ అనుకూల పరిపాలనాధికారులు మంగళవారం ప్రకటించారు. శుక్రవారం క్రెమ్లిన్ కోటలోని సెయింట్ జార్జి హాల్లో జరిగే కార్యక్రమంలో విలీనం విషయాన్ని అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటిస్తారని అధికార ప్రతినిధి పెష్కోవ్ చెప్పారు. విలీనానికి సంబంధించిన పత్రంపై ఈ నాలుగు ప్రాంతాల అధికారులు సంతకాలు చేస్తారన్నారు. రష్యా చర్యను ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ ఇతర పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా చేపట్టిన రెఫరెండంను, విలీనం చేసుకోవడాన్ని గుర్తించబోమన్నాయి. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రతిజ్ఞ చేసింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లో ద్నీప్రో ప్రాంతంపై రష్యా జరిపిన రాకెట్ దాడిలో చిన్నారి సహా 8 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈశాన్య ప్రాంత లెమాన్ నగరంపై పట్టు కోసం ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరు సాగుతోందని బ్రిటిష్ నిఘా వర్గాలు వెల్లడించాయి. -
ఉక్రెయిన్ యుద్దంలో అనూహ్య పరిణామం
మాస్కో: ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల విలీనం పేరిట రష్యా వేసిన పథకం మొత్తానికి ఫలించింది. ఎనిమిదేళ్ల కిందట క్రిమియా ఆక్రమణ తరహాలోనే.. ఇప్పుడు ఉక్రెయిన్‌కు చెందిన మరో నాలుగు కీలక ప్రాంతాలను తనలో విలీనం చేసుకోబోతోంది. శుక్రవారం క్రెమ్లిన్ భవనంలో జరగబోయే కార్యక్రమంలో ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను అధికారికంగా తనలో కలిపేసుకోనుంది రష్యా. ఈ మేరకు గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లోని జార్జియన్ హాల్లో శుక్రవారం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కొత్త సరిహద్దులు రష్యాలోని చేరనున్నాయి అని పుతిన్ వ్యక్తిగత ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అంతేకాదు.. ఈ పరిణామంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రసంగం చేస్తారని వెల్లడించారు. దీంతో పుతిన్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి నుంచి మొదలైన ఆక్రమణలో భాగంగా.. క్రెయిన్ సరిహద్దుల్లోని లుగన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా సైన్యం ఇదివరకే ఆక్రమించేసింది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పౌరులు రష్యాలో చేరేందుకు సుముఖంగా ఉన్నారంటూ ఆయా ప్రాంతాల్లో క్రెమ్లిన్ నియమించిన రష్యన్ అధికారులు వెల్లడించారు. -
సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు కన్నుమూత
మాస్కో: సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచేవ్(91) తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడైన గోర్బచేవ్.. ప్రచ్ఛన్నయుద్ధం ముగింపులో కీలక పాత్ర పోషించారు. ఏడేళ్లు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి చెరగని ముద్ర వేశారు. సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా 1985-1991 వరకు కొనసాగారు గోర్బచేవ్. రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలు బలపర్చిన నేతగా ఘనత సాధించారు. అంతేకాదు. ఆయన హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అంతకుముందు నేతల్లా నిరసనకారులపై ఉక్కుపాదం మోపకుండా శాంతియుతంగా వ్యవహరించారు. తూర్పు యూరప్‌కు సోవియట్ యూనియన్ పాలన నుంచి విముక్తి కల్పించారు. అప్పటి నుంచే సోవియట్ యూనియన్ విడిపోయింది. తనదైన మార్క్ పాలనతో పశ్చిమ దేశాల్లోనూ మంచి గుర్తింపు సాధించారు గోర్బచేవ్. 1990లో నోబెల్ శాంతి బహుమతి కూడా ఆయనను వరించింది. అయితే ప్రపంచానికి సూపర్‌పవర్‌గా ఉన్న తమను ఈయనే బలహీనపరిచారని రష్యా నేతల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రష్యా నేతల్లో 90ఏళ్లకు పైగా జీవించిన తొలి వ్యక్తి గోర్బచేవ్ కావడం గమనార్హం. అందుకే ఆయన 90వ పుట్టినరోజు నాడు అమెరికా అధ్యక్షుడు జో బెైడెన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వంటి అగ్రనేతలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: పాకిస్తాన్‌కి అమెరికా రూ. 200 కోట్ల మానవతా సాయం -
‘మాక్స్‌డోమ్’ మళ్లొచ్చింది
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన విమానం ‘ఇల్యుమిష్ ఐఎల్–80 మాక్స్‌డోమ్’(విపత్తు సమయంలో వాడేది) తాజాగా వార్తల్లోకి వచ్చింది. తాజాగా మాస్కో చుట్టూ ఈ విమానం చక్కర్లు కొట్టడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఆకాశంలో ఎగిరే ‘క్రెమ్లిన్’(రష్యా అధ్యక్ష భవనం) అంటుంటారీ విమానాన్ని. అణు యుద్ధం లాంటివి సంభవించినప్పుడు రష్యాను పాలించడం దగ్గర్నుంచి విమానం నుంచే అణు దాడికి ఆదేశాలిచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇందులో ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో ఈ విమానం కనబడటంతో ఉత్కంఠ నెలకొంది. అసలీ విమానం విశేషాలేంటో తెలుసుకుందామా.. ►సోవియట్ కాలానికి చెందిన ఈ విమానానికి అవసరమైన ఇంధనాన్ని ఆకాశంలోనే నింపుకోవచ్చు. ఇందుకోసం కాక్‌పిట్ కింద ఏర్పాటు ఉంది. ►విమానంలో నుంచే రష్యాను పరిపాలించేందుకు, ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆకాశంలో నుంచే మిలిటరీకి ఆదేశాలు జారీ చేయొచ్చు..అంతేకాదు.. అణు దాడికి ఆదేశాలిచ్చేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ►కాక్‌పిట్‌కు తప్ప విమానానికి ఇంకెక్కడా కిటికీలు ఉండవు. ►విమానంలో ముఖ్యమైన భాగం జ్వెనో–ఎస్. ఇందులో అత్యాధునిక కమ్యూనికేషన్ గది ఉంది. విమానంపైన ముందు భాగంలో ఏర్పాటు చేసిన శాటిలైట్ యాంటెన్నాల సాయంతో ఇది పని చేస్తుంది. ►సముద్రంలోని సబ్మెరైన్లలో (బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉండేవి) ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు వెరీలో ఫ్రీక్వెన్సీ యాంటెన్నా వ్యవస్థ కూడా ఉంది. ►1987లో తొలి విమానం తయారైంది. మొత్తం 4 తయారు చేశారు. 2008లో ఈ విమానాలను ఆధునీకరించారు. జ్వెనో–ఎస్ రెండో వెర్షన్‌ను తయారు చేశారు. దీన్ని రెండు విమానాల్లో ఏర్పాటు చేశారు. ►విమానం పొడవు 60 మీటర్లు, రెక్కల పొడవు 48 మీటర్లు ఉంటుంది. ►గంటకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఒకసారి ఇంధనం నింపాక 3,600 కిలోమీటర్లు వెళ్లగలదు. 2010 నుంచి కనిపించలే రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఆ విజయానికి గుర్తుగా ఏటా జరిగే కార్యక్రమంలో ఈ విమానం కనిపిస్తుండేది. అయితే 2010 నుంచి కనిపించకుండాపోయింది. తాజాగా మళ్లీ కనిపించి వార్తల్లో నిలిచింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలకు హెచ్చరికలు పంపేందుకే ఈ విమానాన్ని పుతిన్ మళ్లీ బయటకు తెచ్చారని అనుకుంటున్నారు. అయితే దీనిపై రష్యా రక్షణ శాఖ స్పందించింది. మే 9న విక్టరీ డే పరేడ్‌లో విమానం కనిపించనుందని, అందులో భాగంగా రిహార్సల్స్ చేసేందుకే మాస్కో చుట్టూ చక్కర్లు కొట్టిందని వెల్లడించింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఉక్రెయిన్ హర్షం.. రష్యా రియాక్షన్ ఇది
రష్యా.. ఇక నుంచి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశం కాదు. గురువారం రాత్రి సాధారణ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో రష్యా తొలగింపునకు లైన్ క్లియర్ అయ్యింది. బుచాలో నరమేధానికి తెగబడ్డ రష్యా.. యుద్ధ నేరాలతో ఇప్పటికే శాంతి స్థాపనకు విఘాతం కలిగించిందని.. అలాంటి దేశానికి మండలిలో కొనసాగే అర్హత లేదంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో వాదించింది అమెరికా. ఇక ఈ పరిణామంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. రష్యాను మానవ హక్కుల మండలి నుంచి తొలగించడాన్ని గొప్ప చర్యగా అభివర్ణించింది. రష్యాకు ఈ మండలిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదంటూ సాధారణ అసెంబ్లీలో ఉక్రెయిన్ ప్రతినిధి వాదించారు. ‘‘మానవ హక్కులను కాపాడే లక్ష్యంతో ఉన్న UN సంస్థల్లో యుద్ధ నేరస్థులకు స్థానం లేదు’’ అంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబెల ట్వీట్ చేశారు. న్యాయం వైపు నిలబడిన సభ్యదేశాలకు రుణపడి ఉంటామంటూ పేర్కొన్నారాయన. ► యూఎన్ హెచ్ఆర్సీ నుంచి బహిష్కరణ పట్ల రష్యా మండిపడుతోంది. పూర్తి అక్రమ, రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించింది క్రెమ్లిన్. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో ఒంటరిగా మారిపోయిన రష్యా ప్రతినిధి.. ఓటింగ్ సమయంలోనూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ► మానవ హక్కుల పట్ల గౌరవంతో కొనసాగుతున్న మండలిలో రష్యాకు కొనసాగే అర్హత లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని బుచా, ఇర్పిన్, మారియుపోల్ ప్రాంతాల్లో.. అది కలిగించిన వినాశనం.. ప్రపంచం చూసిన దురాగతాలు యుద్ధ నేరాలకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా తన దురాక్రమణ యుద్ధాన్ని తక్షణమే, బేషరతుగా విరమించుకోవాలని.. UN చార్టర్లో పొందుపరచబడిన సూత్రాలను గౌరవించాలని ఈ తొలగింపు చర్య ద్వారా ప్రపంచం మరొక స్పష్టమైన సంకేతాన్ని పంపినట్లయ్యింది అంటూ అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: పుతిన్‌ను బోనెక్కించగలరా? -
తగ్గేదే లే.. ఐసీజే ఆదేశాల్ని తిరస్కరిస్తున్నాం!: రష్యా
ఉక్రెయిన్‌పై ఆక్రమణలో రష్యా కఠిన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలను ఆపేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు రష్యా ఒక ప్రకటన చేసింది. ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని క్రెమ్లిన్ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడుల్ని మరింత తీవ్రం చేయనుందనే ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను రష్యా తప్పక పాటించాల్సి ఉంటుంది. కానీ.. ఉక్రెయిన్ దాడిని సస్పెండ్ చేయాలని రష్యాకు UN ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను క్రెమ్లిన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో.. పెండింగ్‌లో ఉన్న తీర్పు మీదే ఉక్రెయిన్ భవితవ్యం ఆధారపడి ఉందన్నిక ఐసీజే ఆదేశాల పట్టింపు లేకుండా 22వ రోజూ ఉక్రెయిన్‌పై ఆక్రమణ కొనసాగిస్తోంది రష్యా. మరోపక్క శాంతి చర్చలపై స్పష్టత కొరవడి గందరగోళం నెలకొంది. ఇంకోవైపు రష్యా బలగాలు మెరెఫాలో స్కూల్ భవనాన్ని నాశనం చేశాయి. ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. ఐసీజే ఆదేశాలివి.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేసి, భద్రతా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఐసీజే ఆదేశించింది. కాగా, అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో తామే గెలిచామని పేర్కొన్నారు. కానీ, రష్యా మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్ (భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ) రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న కథనాలను మాస్కో వర్గాలు ఖండించాయి. సుమారు వెయ్యి మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్న Mariupol థియేటర్‌పై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తమ బలగాలు మరియూపోల్ భవనంపై దాడి చేయలేదని చెప్తున్నాయి. ఇంకోపక్క ఈ యుద్ధంలో ఇప్పటిదాకా 14 వేలమంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ జనరల్‌స్టాఫ్ ప్రకటించారు. కొత్త గోడ ధ్వంసానికి సాయం చేయండి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ జర్మనీకి ఆసక్తికరమైన పిలుపునిచ్చారు. ఐరోపాలో రష్యా నిర్మిస్తున్న కొత్త గోడ ధ్వంసం చేయడంలో సహాయపడాలని కోరాడు. బుండెస్టాగ్ దిగువ సభ పార్లమెంటును ఉద్దేశించి గురువారం ప్రసగించిన జెలెన్స్కీ.. భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. ఇక శాంతి చర్చలపై స్పష్టత కొరవడింది. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో తటస్థ దేశంగా ఉండాలన్న రష్యా ప్రతిపాదనకు ఉక్రెయిన్ ఊహూ అంటోంది. -
ఇదేం ఖర్మ! పుతిన్ చెప్పినా.. సైన్యం వినట్లేదా?
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు 19వ రోజు కూడా విరుచుకుపడుతున్నాయి. రాజధాని కీవ్‌తోపాటు ముఖ్య నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేస్తున్నాయి. సైనిక స్థావరాలనే కాదు.. జనావాసాలను కూడా విడిచిపెట్టడం లేదు. ఈ క్రమంలో పుతిన్ చెప్పినా.. రష్యా సైన్యం వినకుండా దాడులతో ముందుకెళ్తోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కూడా రష్యా సైన్యం.. ఉక్రెయిన్ పశ్చిమదిశలో ఉన్న అర్బన్ ప్రాంతాలను చేజిక్కించుకునేందుకు ముందుకు వెళ్తోందని దిమిత్రి వెల్లడించారు. అయితే.. ప్రధాననగరాలపై దాడులను ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బలగాలను సూచించారని దిమిత్రి పేర్కొన్నారు. రష్యా బలగాల దాడుల్లో.. భారీగా ఉక్రెయిన్ పౌరులు బలి అవుతున్నారని.. ముఖ్యంగా జనాభా ఉన్న పెద్ద నగరాలపై దాడులను తక్షణమే ఆపాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు దిమిత్రి మీడియాకు వెల్లడించారు. అయితే రష్యా రక్షణశాఖ మాత్రం.. పుతిన్ సూచనను లైట్ తీస్కుందట. దాదాపు ప్రధాన నగరాలను చుట్టిముట్టేసినట్లు.. వాటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధ్యక్ష భవనానికి తెలియజేశాయి రష్యా బలగాలు. అంతేకాదు ప్రాణ నష్టం వాటిల్లకుండానే ముందుకు వెళ్తామని, అవసరమైతే సేఫ్ కారిడార్ల ద్వారా ఉక్రెయిన్ పౌరులను, ఇతర దేశీయులను తరలించేందుకు ప్రయత్నిస్తామని రష్యా బలగాలు హామీ ఇచ్చాయని దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. పనిలో పనిగా.. పాశ్చాత్య దేశాలపై విరుచుకుపడ్డారు దిమిత్రి పెస్కోవ్. పాశ్చాత్య దేశాల రెచ్చగొట్టే చర్యల వల్లే ఇదంతా అని మండిపడ్డారాయన. ఈ దాడుల్లో జరిగే ప్రాణ నష్టానికి.. రష్యాను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. చైనా సాయం.. తూచ్! ఇదిలా ఉండగా.. రష్యా చైనా సాయం కోరుతోందన్న కథనాలపై క్రెమ్లిన్ స్పందించింది. రష్యా బలగాలు చైనా సాయం తీసుకుంటున్నాయన్న వార్తలను క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తోసిపుచ్చారు. రష్యాకు తనదైన సొంత సామర్థ్యం ఉందని.. ఎవరి సాయం లేకుండానే ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. -
తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవంలో మేము పాల్గొనం।
న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్ తాలిబన్లు ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం ప్రారంభోత్సవంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని రష్యా అధికార ప్రతినిధి క్రెమ్లిన్ స్పష్టం చేశారు. అంతకుముందు తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు రష్యా సహకరిస్తుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో క్రెమ్లిన్ ఖండించారు. తాము తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవంలో పాల్గొనడం లేదని తేల్చి చెప్పారు. (చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్) అఫ్గనిస్తాన్‌ని ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్లు కొత్త ప్రభుత్వం ప్రారంభోత్సవానికి చైనా, పాకిస్తాన్, రష్యాతో సహా అనేక దేశాలను ఆహానించినట్లు సమాచారం. 'తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటును గుర్తిచాలన్న ఉత్సుకతతో ఉంది. కానీ దశాబ్దాలుగా యుద్ధంతో అట్టుడుకుపోతున్న అఫ్గన్ ప్రజలు తమ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని వారు భావిస్తున్నారా ? ' అని భారతదేశంలోని రష్యన్ రాయబారి నికోలాయ్ కుడాషెవ్ సోమవారం సంశయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 11వ తేదీన తాలిబన్ల ప్రభుత్వం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది.(చదవండి: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!) -
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు విడాకులు మంజూరు!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు విడాకులు మంజూరైనట్టు క్రెమ్లిన్ ధృవీకరించింది. విభేదాలు తలెత్తడంతో భార్య ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినా, పుతిన్ లు గత వేసవిలో విడిపోయారు. మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి తెరదించుతున్నామని గత సంవత్సరం జూన్ లో పుతిన్ దంపతులు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. కనీసం ఒకరికొకరం చూసుకోలేకపోతున్నాం. వైవాహిక జీవితానికి అర్ధం లేదని పుతినా చెప్పినట్టు పుతిన్ వెల్లడించారు. దాంతో ఇద్దరం చట్టబద్దంగా విడిపోవడానికి సిద్దపడ్డామని పుతిన్ ఓ ప్రకటనలో తెలిపారు. అప్పటి నుంచి పబ్లిక్ లైఫ్ కు పుతినా దూరంగా ఉంటున్నారు. పుతిన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. తాను ఇక దేశ ప్రథమ పౌరురాలు కాదని పుతినా వెల్లడించింది. పుతినా, పుతిన్ లకు విడాకులు మంజురైనట్టు అధ్యక్ష భవన అధికార ప్రతినిధి మిత్రి పెస్కోవ్ టాస్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. అయితే ఒలంపిక్ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి, పార్లమెంట్ సభ్యురాలు అలినా కబయేవాతో పుతిన్ అఫైర్ నడుపుతున్నారని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.