మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను క్రెమ్లిన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పందించారు. బాడీ డబుల్స్‌ను వాడుతున్నారని నిరాధార ఆరోపణలను కొట్టిపారేశారు. అదంతా అబద్ధంగా పేర్కొన్నారు.
పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో వదంతులు వచ్చాయని పేర్కొంటూ ప్రశ్చ్యాత దేశాల మీడియా ప్రచురణలు వెలుగులోకి వచ్చాయి. పుతిన్ (71) క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో సహా తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నట్లు 2022 నుంచే వివిధ నివేదికలు వస్తున్నాయి. బహిరంగ ప్రదర్శనలలోనూ పుతిన్ అస్థిరంగా, ఉబ్బినట్లుగా కనిపించడం ఈ పుకార్లకు అప్పట్లోనే ఆజ్యం పోసింది.
తాజాగా సెప్టెంబర్‌లో రష్యాన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఓ పోస్టు దర్శనమిచ్చింది.'మీరు మమ్మల్ని విడిచిపెట్టవద్దు. సజీవంగా ఆరోగ్యంగా ఉన్నారని దేవుడిని ప్రార్ధిస్తున్నాం' అంటూ ఓ పోస్టు వెలుగులోకి వచ్చింది. దీంతో మీడియా ప్రతినిధులు పుతిన్ ఆరోగ్యంపై క్రెమ్లిన్ ప్రతినిధిని తాజాగా ప్రశ్నించారు. బాడీ డబుల్స్‌కు సంబంధించి 2020లోనే పుకార్లు వచ్చాయి. భద్రతా ప్రయోజనాలు దృష్ట్యా ఓ దేహాన్ని ఉపయోగించారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ పుకార్లను క్రెమ్లిన్ అప్పట్లోనే ఖండించింది.
ఇదీ చదవండి: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment