మాస్కో: వచ్చే నెలలో భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ పాల్గొనడం లేదు. ఉక్రెయిన్‌లో ఏడాదికి పైగా కొనసాగుతున్న స్పెషల్ మిలటరీ ఆపరేషన్‌పైనే ఆయన దృష్టంతా ఉందని శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. దీంతోపాటు బిజీ షెడ్యూల్ ఉన్నందున అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వెళ్లడం లేదని పేర్కొంది.
అధ్యక్షుడు పుతిన్ జీ20 సమావేశంలో వర్చువల్‌గా పాల్గొనే విషయం తర్వాత ఖరారవుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి పెష్కోవ్ చెప్పారు. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 దేశాల నేతల సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. తాజాగా జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ భేటీకి కూడా పుతిన్ వెళ్లలేదు.
Comments
Please login to add a commentAdd a comment