busy schedule
-
భారత్‌లో జరిగే జీ20 భేటీకి పుతిన్ దూరం
మాస్కో: వచ్చే నెలలో భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ పాల్గొనడం లేదు. ఉక్రెయిన్‌లో ఏడాదికి పైగా కొనసాగుతున్న స్పెషల్ మిలటరీ ఆపరేషన్‌పైనే ఆయన దృష్టంతా ఉందని శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. దీంతోపాటు బిజీ షెడ్యూల్ ఉన్నందున అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వెళ్లడం లేదని పేర్కొంది. అధ్యక్షుడు పుతిన్ జీ20 సమావేశంలో వర్చువల్‌గా పాల్గొనే విషయం తర్వాత ఖరారవుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి పెష్కోవ్ చెప్పారు. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 దేశాల నేతల సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. తాజాగా జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ భేటీకి కూడా పుతిన్ వెళ్లలేదు. -
బిజీ బిజీగా టీమిండియా.. 2022లో ఆడనున్న మ్యాచ్‌లు
2021 ఏడాదిలో టీమిండియా చిరస్మరణీయ విజయాలు సాధించింది. దీంతోపాటు కొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించడం.. ఇంగ్లండ్ స్వదేశంలో.. విదేశంలో బోల్తా కొట్టించడం.. ఇక ఏడాది చివర్లో సౌతాఫ్రికా గడ్డపై సెంచూరియన్ టెస్టులో భారీ విజయంతో ముగించడం మధురానుభూతిగా అనిపిస్తే... డబ్య్లూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం.. టి20 ప్రపంచకప్ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి లీగ్ దశలో వెనుదిరగడం సగటు అభిమానిని బాధకు గురిచేసింది. ఇక 2022లోనూ టీమిండియా బిజీబిజీగా గడపనుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌తో మొదలుపెడితే.. డిసెంబర్ వరకు అన్ని ఫార్మాట్లు కలిపి చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ గ్యాప్‌లోనే టి20 ప్రపంచకప్ 2022, ఐపీఎల్ 2022, ఆసియా కప్ కూడా జరగనుండడం విశేషం. కోవిడ్ లేకుండా ఉంటే ఈ సిరీస్‌లు జరుగుతాయి.. లేదంటే వాయిదాలు పడతాయి. ఇక ఒకసారి టీమిండియా ఆడే మ్యాచ్‌లను పరిశీలిద్దాం. టీమిండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికా: ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా మరో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. జనవరి 3-7 రెండో టెస్టు(జోహన్నెస్‌బర్గ్) జనవరి 11-15 మూడో టెస్టు( కేప్‌టౌన్) జనవరి 19: తొలి వన్డే(పార్ల్) జనవరి 21: రెండో వన్డే(పార్ల్) జనవరి 23: మూడో వన్డే(కేప్‌టౌన్) వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా: దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా ఫిబ్రవరిలో స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 6: తొలి వన్డే(అహ్మదాబాద్) ఫిబ్రవరి 9: రెండో వన్డే(జైపూర్) ఫిబ్రవరి 12: మూడో వన్డే(కోల్‌కతా) ఫిబ్రవరి 15: తొలి టి20(కటక్) ఫిబ్రవరి 18: రెండో టి20(విశాఖపట్నం) ఫిబ్రవరి 20: మూడో టి20(తిరువనంతపురం) శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా: అలా వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన ఐదు రోజుల వ్యవధిలోనే టీమిండియా శ్రీలంకతో రెండు టెస్టులు.. మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 25- మార్చి 1: తొలి టెస్టు(చెన్నై) మార్చి 5-9: రెండో టెస్టు(మొహలీ) మార్చి 13: తొలి టి20(మొహలీ) మార్చి 15: రెండో టి20(ధర్మశాల) మార్చి 18: మూడో టి20( లక్నో) ►ఇక అఫ్గానిస్తాన్‌తో టీమిండియా మూడు టి20లు ఆడాల్సి ఉంది. అయితే ఈ పర్యటన ఇంకా ఖరారు కాకపోవడంతో బీసీసీఐ తేదీలు ప్రకటించలేదు. ►ఏప్రిల్, మే నెలల్లో టీమిండియా ఐపీఎల్ 2022 సీజన్లో ఆడనుంది. సౌతాఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా: ఐపీఎల్ 2022 ముగిసిన అనంతరం సౌతాఫ్రికా మన గడ్డపై అడుగుపెట్టనుంది. జూన్ 9 నుంచి 19 వరకు 5 టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. జూన్ 9: తొలి టి20(చెన్నై) జూన్ 12: రెండో టి20(బెంగళూరు) జూన్ 14: మూడో టి20(నాగ్‌పూర్) జూన్ 15: నాలుగో టి20(రాజ్‌కోట్) జూన్ 19: ఐదో టి20(ఢిల్లీ) ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్: 2021లో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఐదో టెస్టుతో సిరీస్ మొదలుపెట్టనుంది. దానికి కంటిన్యూగా ఈ సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఒక టెస్టు, మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 1-5: ఐదో టెస్టు( బర్మింగ్హమ్) జూలై 7: తొలి టి20(సౌతాప్టంన్) జూలై 9: రెండో టి20(బర్మింగ్హమ్) జూలై 10: మూడో టి20(నాటింగ్హమ్) జూలై 12: తొలి వన్డే(ఓవల్, లండన్) జూలై 14: రెండో వన్డే(లార్డ్స్, లండన్) జూలై 17: మూడో వన్డే(మాంచెస్టర్) ►ఇంగ్లండ్ పర్యటన తర్వాత జూలై-ఆగస్టులో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. అక్కడ మూడు టి20లు.. మూడు వన్డేలు ఆడనుంది. ►సెప్టెంబర్‌లో ఆసియాకప్ 2022లో టీమిండియా పాల్గొంటుంది. ►ఆ తర్వాత సెప్టెంబర్-నవంబర్ నెలలో ఆస్ట్రేలియా టీమిండియా టూర్‌కు రానుంది.60 రోజుల సుధీర్ఘ పర్యటనలో ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు.. మూడు టి20లు ఆడనుంది. ►అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022లో టీమిండియా పాల్గొననుంది. ►ఆ తర్వాత నవంబర్- డిసెంబర్లో టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. బంగ్లా పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఇక డిసెంబర్లో ఆఖరుగా టీమిండియా శ్రీలంకతో స్వదేశంలో ఐదు వన్డేల సిరీస్‌తో ఏడాదిని ముగించనుంది. వీటికి సంబంధించిన తేదీలను బీసీసీఐ రానున్న రోజుల్లో ఖరారు చేయనుంది. -
న్యూజిలాండ్ పర్యటన వాయిదా వేసుకున్న టీమిండియా
India Tour Of New Zeland Postponed.. టీమిండియా న్యూజిలాండ్ పర్యటనను వాయిదా వేసుకుంది. న్యూజిలాండ్ గడ్డపై వచ్చే ఏడాది టీమిండియా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. 2023 వరల్డ్‌కప్ సూపర్‌లీగ్‌లో భాగంగా విరాట్ కోహ్లి బృంధం కివీస్‌తో మూడు వన్డేల్లో పాల్గొనాల్సి ఉండగా.. తాజగా వాయిదా పడింది. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022 ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్ ఆడేలా షెడ్యూల్ చేయనున్నట్లు కివీస్ క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు. చదవండి: ఈసారి కూడా టైటిల్ వాళ్లదే: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వాస్తవానికి న్యూజిలాండ్ వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు బిజీగా గడపనుంది. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్ ముగిసిన అనంతరం ఆటగాళ్లు ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ఆడేందుకు యూఏఈకి వెళ్లారు. అది ముగిసిన తర్వాత అక్కడే జరగనున్న టి20 ప్రపంచకప్ 2021లో పాల్గొనాల్సి ఉంది. ప్రపంచకప్ అనంతరం కివీస్ భారత్‌లో పర్యటించి రెండు టెస్టులు, మూడు టీ20 ఆడనుంది. అలా చూసుకుంటే న్యూజిలాండ్ డిసెంబర్లో మళ్లీ స్వదేశానికి వస్తుంది. కాగా న్యూజిలాండ్ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన కరోనా మార్గదర్శకాల ప్రకారం 14 రోజులు క్వారంటైన్లో గడపాల్సి ఉంది. ఇక మార్చి 4 నుంచి ఏప్రిల్ 3వరకు జరగనున్న మహిళల వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ గ్యాప్‌లో నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లు న్యూజిలాండ్ పర్యటనకు రానున్నాయి. అందుకే వచ్చే ఏడాది ఆగస్టులో జరగనున్న టి20 ప్రపంచకప్ 2022 తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడేలా ప్లాన్ చేయనున్నారు. ఇక టీమిండియా, న్యూజిలాండ్‌లు చివరిసారిగా జూన్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన కివీస్ తొలి చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. చదవండి: T20 World Cup 2021: ఆరోజు మమ్మల్ని ఆపటం ఎవరితరం కాదు.. -
రేపు సీఎం విజయవాడ రాక
రోజంతా బిజీ షెడ్యూల్ ఉదయం ఏపీఎన్జీవోల సన్మానం మధ్యాహ్నం అధికారులతో సమీక్ష సాయంత్రం ఇఫ్తార్‌కు హాజరు విజయవాడసిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడ రానున్నారు. ఉదయం పది గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో బయలుదేరి 10.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన 11.20 గంటలకు ఆంధ్ర లయోల కళాశాలకు వెళతారు. అక్కడ ఏపీఎన్జీవో అసోసియేషన్ ఏర్పాటుచేసే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ కార్యాలయానికి వెళతారు. అక్కడ 3.05 గంటల నుంచి 4.05 గంటల వరకు జిల్లాలోని సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు గురునానక్‌కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపానికి చేరుకుని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు బందరు రోడ్డులోని శేషసాయి కల్యాణ మండపంలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. ఎయిర్‌పోర్టులో భద్రత ఏర్పాట్ల పరిశీలన గన్నవరం : సీఎం పర్యటనను పురస్కరించుకుని గురువారం అధికారులు ఎయిర్‌పోర్టులో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ ఆర్.రఘునందన్‌రావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు నేతృత్వంలో పలు శాఖల అధికారులు ఎయిర్‌పోర్టులోని టెర్మినల్ బిల్డింగ్, లాంజ్రూమ్ను పరిశీలించారు. భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, డీసీపీలు ఖాన్, రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ మురళి, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధరరావు, ఏసీపీ ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ ఎస్.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేశ్వరరావు, ఇంటిలిజెన్స్ డీఎస్పీ అంకయ్య, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాధవస్వరూప్, డీఈ మహాదేవ్ పాల్గొన్నారు.