2021 ఏడాదిలో టీమిండియా చిరస్మరణీయ విజయాలు సాధించింది. దీంతోపాటు కొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించడం.. ఇంగ్లండ్ స్వదేశంలో.. విదేశంలో బోల్తా కొట్టించడం.. ఇక ఏడాది చివర్లో సౌతాఫ్రికా గడ్డపై సెంచూరియన్ టెస్టులో భారీ విజయంతో ముగించడం మధురానుభూతిగా అనిపిస్తే... డబ్య్లూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం.. టి20 ప్రపంచకప్ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి లీగ్ దశలో వెనుదిరగడం సగటు అభిమానిని బాధకు గురిచేసింది.
ఇక 2022లోనూ టీమిండియా బిజీబిజీగా గడపనుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌తో మొదలుపెడితే.. డిసెంబర్ వరకు అన్ని ఫార్మాట్లు కలిపి చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ గ్యాప్‌లోనే టి20 ప్రపంచకప్ 2022, ఐపీఎల్ 2022, ఆసియా కప్ కూడా జరగనుండడం విశేషం. కోవిడ్ లేకుండా ఉంటే ఈ సిరీస్‌లు జరుగుతాయి.. లేదంటే వాయిదాలు పడతాయి. ఇక ఒకసారి టీమిండియా ఆడే మ్యాచ్‌లను పరిశీలిద్దాం.
టీమిండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికా:
ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా మరో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.
జనవరి 3-7 రెండో టెస్టు(జోహన్నెస్‌బర్గ్)
జనవరి 11-15 మూడో టెస్టు( కేప్‌టౌన్)
జనవరి 19: తొలి వన్డే(పార్ల్)
జనవరి 21: రెండో వన్డే(పార్ల్)
జనవరి 23: మూడో వన్డే(కేప్‌టౌన్)
వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా:
దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా ఫిబ్రవరిలో స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఫిబ్రవరి 6: తొలి వన్డే(అహ్మదాబాద్)
ఫిబ్రవరి 9: రెండో వన్డే(జైపూర్)
ఫిబ్రవరి 12: మూడో వన్డే(కోల్‌కతా)
ఫిబ్రవరి 15: తొలి టి20(కటక్)
ఫిబ్రవరి 18: రెండో టి20(విశాఖపట్నం)
ఫిబ్రవరి 20: మూడో టి20(తిరువనంతపురం)
శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా:
అలా వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన ఐదు రోజుల వ్యవధిలోనే టీమిండియా శ్రీలంకతో రెండు టెస్టులు.. మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఫిబ్రవరి 25- మార్చి 1: తొలి టెస్టు(చెన్నై)
మార్చి 5-9: రెండో టెస్టు(మొహలీ)
మార్చి 13: తొలి టి20(మొహలీ)
మార్చి 15: రెండో టి20(ధర్మశాల)
మార్చి 18: మూడో టి20( లక్నో)
►ఇక అఫ్గానిస్తాన్‌తో టీమిండియా మూడు టి20లు ఆడాల్సి ఉంది. అయితే ఈ పర్యటన ఇంకా ఖరారు కాకపోవడంతో బీసీసీఐ తేదీలు ప్రకటించలేదు.
►ఏప్రిల్, మే నెలల్లో టీమిండియా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడనుంది.
సౌతాఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా:
ఐపీఎల్ 2022 ముగిసిన అనంతరం సౌతాఫ్రికా మన గడ్డపై అడుగుపెట్టనుంది. జూన్ 9 నుంచి 19 వరకు 5 టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
జూన్ 9: తొలి టి20(చెన్నై)
జూన్ 12: రెండో టి20(బెంగళూరు)
జూన్ 14: మూడో టి20(నాగ్‌పూర్)
జూన్ 15: నాలుగో టి20(రాజ్‌కోట్)
జూన్ 19: ఐదో టి20(ఢిల్లీ)
ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్:
2021లో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఐదో టెస్టుతో సిరీస్ మొదలుపెట్టనుంది. దానికి కంటిన్యూగా ఈ సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఒక టెస్టు, మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది.
జూలై 1-5: ఐదో టెస్టు( బర్మింగ్‌హమ్)
జూలై 7: తొలి టి20(సౌతాప్టంన్)
జూలై 9: రెండో టి20(బర్మింగ్‌హమ్)
జూలై 10: మూడో టి20(నాటింగ్‌హమ్)
జూలై 12: తొలి వన్డే(ఓవల్, లండన్)
జూలై 14: రెండో వన్డే(లార్డ్స్, లండన్)
జూలై 17: మూడో వన్డే(మాంచెస్టర్)
►ఇంగ్లండ్ పర్యటన తర్వాత జూలై-ఆగస్టులో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. అక్కడ మూడు టి20లు.. మూడు వన్డేలు ఆడనుంది.
►సెప్టెంబర్‌లో ఆసియాకప్ 2022లో టీమిండియా పాల్గొంటుంది.
►ఆ తర్వాత సెప్టెంబర్-నవంబర్ నెలలో ఆస్ట్రేలియా టీమిండియా టూర్‌కు రానుంది.60 రోజుల సుధీర్ఘ పర్యటనలో ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు.. మూడు టి20లు ఆడనుంది.
►అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022లో టీమిండియా పాల్గొననుంది.
►ఆ తర్వాత నవంబర్- డిసెంబర్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. బంగ్లా పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఇక డిసెంబర్‌లో ఆఖరుగా టీమిండియా శ్రీలంకతో స్వదేశంలో ఐదు వన్డేల సిరీస్‌తో ఏడాదిని ముగించనుంది. వీటికి సంబంధించిన తేదీలను బీసీసీఐ రానున్న రోజుల్లో ఖరారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment