రేపు సీఎం విజయవాడ రాక
- రోజంతా బిజీ షెడ్యూల్
- ఉదయం ఏపీఎన్జీవోల సన్మానం
- మధ్యాహ్నం అధికారులతో సమీక్ష
- సాయంత్రం ఇఫ్తార్‌కు హాజరు
విజయవాడసిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడ రానున్నారు. ఉదయం పది గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో బయలుదేరి 10.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన 11.20 గంటలకు ఆంధ్ర లయోల కళాశాలకు వెళతారు.
అక్కడ ఏపీఎన్జీవో అసోసియేషన్ ఏర్పాటుచేసే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ కార్యాలయానికి వెళతారు. అక్కడ 3.05 గంటల నుంచి 4.05 గంటల వరకు జిల్లాలోని సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు గురునానక్‌కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపానికి చేరుకుని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు బందరు రోడ్డులోని శేషసాయి కల్యాణ మండపంలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.
ఎయిర్‌పోర్టులో భద్రత ఏర్పాట్ల పరిశీలన
గన్నవరం : సీఎం పర్యటనను పురస్కరించుకుని గురువారం అధికారులు ఎయిర్‌పోర్టులో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ ఆర్.రఘునందన్‌రావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు నేతృత్వంలో పలు శాఖల అధికారులు ఎయిర్‌పోర్టులోని టెర్మినల్ బిల్డింగ్, లాంజ్‌రూమ్‌ను పరిశీలించారు.
భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, డీసీపీలు ఖాన్, రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ మురళి, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధరరావు, ఏసీపీ ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ ఎస్.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేశ్వరరావు, ఇంటిలిజెన్స్ డీఎస్పీ అంకయ్య, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాధవస్వరూప్, డీఈ మహాదేవ్ పాల్గొన్నారు.