Andhra Loyola College
-
విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల మైదానం కల్చరల్ ఫెస్ట్ (ఫొటోలు)
-
4వేల పోలీస్ సిబ్బందికి గుడ్ల పంపిణీ
సాక్షి, విజయవాడ, గుంటూరు : ఆంధ్రా లయోలా కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియోషన్స్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి గుడ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆదివారం విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్‌లో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తూ డీజీపీ గౌతం సవాంగ్, విజయవాడ సీపీ ద్వారాక తిరుమలరావు పలువరు పోలీసులకు గడ్లను పంపిణీ చేశారు. విజయవాడ, గుంటూరులోని 4 వేల మంది పోలీసు సిబ్బందికి ప్రతిరోజు 4 వేల గుడ్లు పంపిణీ చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. లాక్డౌన్ సందర్భంగా పోలీస్ సిబ్బంది 24 గంటలు ప్రజల సేవలో నిమగ్నమయ్యారని తెలిపారు. ప్రజల్ని ఇంటి నుండి బయటకు రావద్దని సూచించినా వారు పట్టించుకోవటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వచ్చే వారికి తమ సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చి పంపటం జరుగుతుందని చెప్పారు. ఇక కేవలం 9 రోజులు లాక్డౌన్ పాటిస్తే కరోనాను నిర్మూలించవచ్చన్నారు. ఈ సమయం చాలా కీలకమని, ప్రజలందరూ తప్పకుండా లాక్డౌన్ పాటించాలని కోరారు. పోలీస్ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి ఆంధ్రా లయోలా కళాశాల పూర్వ విద్యార్థులు.. సిబ్బందిలో ఇమ్యూనిటి పవర్ పెంచేందుకు గుడ్లు పంచటం సంతోషంగా ఉందన్నారు. -
నేటి నుంచి ‘సచివాలయ’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సచివాలయ పోస్టుల భర్తీకి చకచకా అడుగులు పడుతున్నాయి. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆన్లైన్లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంచగా.. నేటి నుంచి (మంగళవారం) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టుగా మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఎస్సీ (డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ) సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తుందని తెలిపారు. కేటగిరీల వారీగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడుతామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు అర్హత, కుల ధృవీకరణ, రెసిడెన్షియల్, క్రిమీలేయర్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సర్టిఫికెట్లన్నింటినీ డీఎస్సీ వెరిఫికేషన్ చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో మెరిట్ లిస్టులు పూర్తి చేశామని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తవ్వగానే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేస్తామని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దు నిబంధన ప్రకారం పనిచేసిన ఏఎన్ఎంలకు సచివాలయ పోస్టుల్లో దక్కాల్సిన వెయిటేజీపై ఆందోళన చెందవద్దని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. వెయిటేజీ ఇవ్వని వారి సర్టిఫికెట్లను సంబంధిత డీఎంఅండ్‌హెచ్‌ఓ(జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి) ఆఫీసులో మంగళవారం అంజేయాలని సూచించారు. వాటిని పరిశీలించిన తర్వాత వెయిటేజీ ఇస్తారని ఆయన తెలియజేశారు. సర్టిఫికెట్ పరిశీలన కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మంగళశారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్... ఆంధ్ర లయోలా కాలేజీలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని 11,025 పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికెషన్ రెండు రోజుల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. అయిదు శాఖలకు సంబంధించి అర్హత సాధించిన వారికి నేడు సర్టిఫికెట్స్ పరిశీలన చేపడుతారని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఇంతియాజ్ పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాఖల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకుగానూ తొలి రోజు 250 మంది అధికారులు విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన పత్రాలతో అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. అక్టోబర్ రెండవ తేదీ కల్లా అభ్యర్థులు కొత్త కొలువుల్లో చేరేలా ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంతియాజ్ అన్నారు. అనంతపురం: సచివాలయ ఉద్యోగాల భర్తీ సజావుగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. కాల్‌లెటర్స్ అందినవారంతా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. కాల్ లెటర్స్ అందనివారికి త్వరలోనే పంపుతామని స్పష్టం చేశారు. ఇక జిల్లావ్యాప్తంగా 8545 పోస్టులు మంజూరయ్యాని ఆయన పేర్కొన్నారు. -
సంప్రదాయ షోయగం
-
అంబరాన్నంటిన ‘సాక్షి’ ఎరీనా వన్
ఉత్సాహంగా సాగిన అవార్డుల ప్రదానోత్సవం విజయవాడ స్పోర్ట్స్: స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు.. సాంస్కృతిక కార్యక్రమాల హోరుతో ‘సాక్షి’ ఎరీనా వన్ సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం విజయవాడలోని ఆంధ్ర లయోల కళాశాలలో నిర్వహించిన ‘సాక్షి’ ఎరీనా వన్(స్కూల్, యూత్) గ్రాండ్ ఫినాలే వైభవంగా జరిగింది. స్కూల్ ఫెస్ట్ విభాగానికి విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, యూత్ ఫెస్ట్ విభాగానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఓఎస్డీ ప్రత్తిపాటి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు (ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ) రీజియన్లలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు పతకాలతో పాటు ‘సాక్షి’ ఎరీనా వన్ ఫెస్ట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా ప్రావీణ్యం సాధించాలని సూచించారు. ప్రతిభను వెలికితీయడంలో ‘సాక్షి’ది విశేష కృషి.. శాప్ ఓఎస్డీ ప్రత్తిపాటి రామకృష్ణ మాట్లాడుతూ.. మరుగునపడిపోయిన క్రీడా ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో ‘సాక్షి’ విశేషంగా కృషి చేస్తోందని కొనియాడారు. ‘సాక్షి’ మీడియా నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీల్లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడిసిన్ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం మంచిపరిణామమన్నారు. సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు ‘సాక్షి’ ఎరీనా ఉత్తమ వేదికని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నత ప్రమాణాలతో నడిచే పాఠశాలు, కళాశాలల వివరాలతో సాక్షి మీడియా తీసుకొచ్చిన కాఫీ టేబుల్ బుక్‌ను సీపీ గౌతమ్ సవాంగ్, ఆంధ్రా హాస్పిటల్స్ అధినేత రమణ మూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ చైర్మన్ ముత్తవరపు మురళీకృష్ణ, ఎఫ్ట్రానిక్స్ ఎండీ రామకృష్ణ, ట్రిట్స్ ఇంటర్నేషనల్ స్కూల్(రాజమండ్రి) ప్రిన్సిపాల్ బాల త్రిపుర సుందరి, ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టర్, నేషనల్ గేమ్స్ సిల్వర్ మెడలిస్టు కె.శిరోమణి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తదితరులు ఆవిష్కరించారు. టీవీ జర్నలిస్టు స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘సాక్షి’ పత్రిక మఫిసిల్ ఎడిటర్ రాఘవరెడ్డి పాల్గొన్నారు. సాక్షి ఎరీనా విజేతలు వీరే.. సాక్షి ఎరీనా వన్ స్కూల్, యూత్‌ఫెస్ట్ క్రికెట్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, క్యారమ్స్, చెస్ పోటీలతో పాటు డ్యాన్స్, హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. జూనియర్ రాష్ట్రస్థాయి క్రికెట్లో విశాఖపట్నం చైతన్య పాలిటెక్నిక్ కళాశాల జట్టు విన్నర్‌గా, తిరుపతి ఎస్.వి.జూనియర్ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచాయి. సీనియర్ విభాగంలో విన్నర్‌గా కంచికచర్ల మిక్ ఇంజినీరింగ్ కళాశాల, రన్నరప్‌గా విశాఖపట్నం చైతన్య ఇంజినీరింగ్ కళాశాల జట్టు నిలిచాయి. వాలీబాల్ ఉత్తరాంధ్రలో శ్రీ సూర్య జూనియర్ కళాశాల, విశాఖపట్నం విన్నర్‌గా, విశాఖపట్నం ప్రభుత్వ ఐటీఐ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచాయి. సోలో డ్యాన్స్‌లో విన్నర్‌గా ఎస్ఎస్ఎన్ కళాశాల నరసారావుపేట విద్యార్థి గణేష్ నాయక్, రన్నరప్‌గా సీహెచ్ తేజస్వీ (నలంద డిగ్రీ కళాశాల), తృతీయ స్థానాన్ని డి.గణేష్ (టీజేపీఎస్ కళాశాల, గుంటూరు) పొందారు. కబడ్డీ యూత్ విభాగం కోస్తాంధ్ర సీనియర్స్‌లో విన్నర్‌గా ఆంధ్ర లయోల కళాశాల విజయవాడ, రన్నరప్‌గా మంగళగిరి వీటీజేఎస్ కళాశాల నిలిచాయి. -
విజయవాడలో ‘ఆక్వా ఆక్వేరియా ఇండియా షో’
సాక్షి, విజయవాడ బ్యూరో: దేశ, విదేశాలకు చెందిన ఆక్వా కల్చర్ రైతులు, శాస్త్రవేత్తలు, పంపిణీదారులు, ఆక్వేరియం నిర్వాహకులందరూ ఒకేచోట చేరి ఆక్వా రంగం లో నూతన ఆవిష్కరణలపై చర్చించుకునేందుకు విజయవాడ వేదిక కానుంది. భారత ప్రభుత్వ వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖలోని సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల అభివృద్ధి సంస్థ(ఎంపెడా) ఆధ్వర్యంలో మెగా ‘ఆక్వా ఆక్వేరియా ఇండియా షో’ శుక్రవారం నుంచి మూడు రోజులపాటు విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల మైదానంలో కొనసాగనుంది. ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఎంపెడా చైర్మన్, సీనియర్ ఐఏఎస్ అధికారిణి లీనానాయర్ గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఆక్వాకల్చర్, అలంకరణ చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రెండేళ్లకోసారి ‘ఆక్వా ఆక్వేరియా ఇండియా ప్రదర్శన’ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. -
రేపు సీఎం విజయవాడ రాక
రోజంతా బిజీ షెడ్యూల్ ఉదయం ఏపీఎన్జీవోల సన్మానం మధ్యాహ్నం అధికారులతో సమీక్ష సాయంత్రం ఇఫ్తార్‌కు హాజరు విజయవాడసిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడ రానున్నారు. ఉదయం పది గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో బయలుదేరి 10.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన 11.20 గంటలకు ఆంధ్ర లయోల కళాశాలకు వెళతారు. అక్కడ ఏపీఎన్జీవో అసోసియేషన్ ఏర్పాటుచేసే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ కార్యాలయానికి వెళతారు. అక్కడ 3.05 గంటల నుంచి 4.05 గంటల వరకు జిల్లాలోని సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు గురునానక్‌కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపానికి చేరుకుని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు బందరు రోడ్డులోని శేషసాయి కల్యాణ మండపంలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. ఎయిర్‌పోర్టులో భద్రత ఏర్పాట్ల పరిశీలన గన్నవరం : సీఎం పర్యటనను పురస్కరించుకుని గురువారం అధికారులు ఎయిర్‌పోర్టులో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ ఆర్.రఘునందన్‌రావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు నేతృత్వంలో పలు శాఖల అధికారులు ఎయిర్‌పోర్టులోని టెర్మినల్ బిల్డింగ్, లాంజ్రూమ్ను పరిశీలించారు. భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, డీసీపీలు ఖాన్, రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ మురళి, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధరరావు, ఏసీపీ ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ ఎస్.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేశ్వరరావు, ఇంటిలిజెన్స్ డీఎస్పీ అంకయ్య, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాధవస్వరూప్, డీఈ మహాదేవ్ పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ దూషించారని.. ఆత్మహత్యాయత్నం
విజయవాడ లయోలా కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బెల్టు పెట్టుకోలేదన్న కారణంతో వినీల్ అనే విద్యార్థిని ప్రొఫెసర్ దూషించారని, దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన వినీల్.. చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని తోటి విద్యార్థులు తెలిపారు. ఈ సంఘటనలో ప్రొఫెసర్ తీరుకు నిరసనగా మాచవరం పోలీసు స్టేషన్ వద్ద లయోలా కాలేజి విద్యార్థులు ఆందోళన చేశారు. చిన్న చిన్న విషయాలకు కూడా విద్యార్థులను దూషించడం వల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని, దాంతో సున్నిత మనస్కులైన విద్యార్థులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని వాళ్లు వాపోయారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.