KRK Khan Shocking Trolls On Rashmika Mandanna And Vijay Devarakonda, See Fans Reaction - Sakshi
Sakshi News home page

KRK On Rashmika Mandanna : 'రష్మిక బోజ్‌పురి సినిమాలకు అయితే పనికొస్తుంది'.. కేఆర్కే ఘాటు వ్యాఖ్యలు

Published Tue, Jan 10 2023 11:03 AM | Last Updated on Tue, Jan 10 2023 12:02 PM

KRK Trolls On Rashmika Mandanna And Vijay Devarakonda Fans Hit Back - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతుంది. సౌత్‌ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయింది. ఆమె నటించిన మిషన్‌ మజ్ను, వారీసు చిత్రాలు రిలజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు వివాదాలతోనూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్న రష్మికపై బాలీవుడ్‌ క్రిటిక్‌ కేఆర్కే దారుణమైన కామెంట్స్‌ చేశాడు.

`మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ మిమ్మల్ని భోజ్‌పురి చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది` అంటూ రష్మికను కించపరిచే విధంగా కేఆర్‌కే ట్వీట్ చేశాడు.

దీంతో అతడి ట్వీట్‌పై అటు రష్మిక ఫ్యాన్స్‌, ఇటు విజయ్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ముందు నీ సంగతి చూసుకో, తర్వాత మిగతా వారి గురించి కామెంట్స్‌ చేద్దువు గానీ అంటూ కేఆర్కేపై మండిపడుతున్నారు ఫ్యాన్స్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement