సినిమాలు చూడండి.. 2000 డాలర్లు (రూ. 1.6 లక్షలు) అందుకోండి.. అంటోంది ఓ అమెరికన్ కంపెనీ. మీరు చేయాల్సిందల్లా వాళ్లు చెప్పిన సినిమాలు చూసి మీ అభిప్రాయాలను తెలియజేయడమే. యూఎస్‌కు చెందిన బ్లూమ్‌సీబాక్స్ (BloomsyBox) అనే సంస్థ వివిధ సంవత్సరాల్లో విడుదలైన పేరొందిన 12 క్రిస్మస్ సినిమాలను చూసి అభిప్రాయాలు పంచుకోవాలని సినీ ఔత్సాహికులను కోరుతోంది.
ఎంపికైనవారు వాళ్లు చెప్పిన క్రిస్మస్ సినిమాలను చూసి ప్రతి సినిమా గురించి వారి అభిప్రాయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి డబ్బుతో పాటు హాట్ కోకా, రెండు జతల యూజీజీ సాక్స్‌లు, పీకాక్‌కి ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్, 12 నెలల ఫ్లవర్ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ అందజేస్తుంది
చూడాల్సిన 12 సినిమాలు ఇవే..
- ది మోస్ట్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ది ఇయర్ (2008)
- క్రౌన్ ఫర్ క్రిస్మస్ (2015)
- ది నైన్ లైవ్స్ ఆఫ్ క్రిస్మస్ (2014)
- క్రిస్మస్ గెటవే (2017)
- జర్నీ బ్యాక్ టు క్రిస్మస్ (2016)
- గోస్ట్స్ ఆఫ్ క్రిస్మస్ ఆల్‌వేస్ (2022)
- ఫ్యామిలీ ఫర్ క్రిస్మస్ (2015)
- క్రిస్మస్ అండర్ రాప్స్ (2014)
- త్రీ వైస్ మెన్ అండ్ ఏ బేబీ (2022)
- ఎ రాయల్ క్రిస్మస్ (2014)
- నార్త్‌పోల్ (2014)
- ది క్రిస్మస్ ట్రైన్ (2017)
Comments
Please login to add a commentAdd a comment