Bollywood Cine Critic Kamal R Khan Comments On Films - Sakshi
Sakshi News home page

KRK On Bollywood Films: పరిగెత్తి ప్రచారం చేసిన తుస్సే.. కేఆర్‌కే వ్యంగ్యాస్త్రాలు!

Published Mon, Jul 24 2023 4:33 PM | Last Updated on Mon, Jul 24 2023 4:40 PM

Bollywood Cine Critic Kamal r Khan Comments On Films - Sakshi

బాలీవుడ్ సినీ క్రిటిక్‌ కమల్ ఆర్‌ ఖాన్(కేఆర్కే) పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌ సినిమాలకు కాంట్రవర్సీ రివ్యూలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే పూర్తిగా నెగెటివ్ రివ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యారు. గతంలో షారూక్ ఖాన్ పఠాన్‌ మూవీతో పాటు పలు స్టార్ హీరోల చిత్రాలపై సంచలన కామెంట్స్ చేస్తూ షాకిస్తుంటారు. బాలీవుడ్‌ అంటేనే కేవలం రీమేక్‌ చేయడం తప్పా.. సినిమాలు తీయడం రాదని గతంలో పలుసార్లు బహిరంగంగానే విమర్శించారు. 

(ఇది చదవండి: ప్రతీకారమే లక్ష్యం.. భయపెట్టేందుకు వస్తోన్న 'కల్లరై'!)

తాజాగా మరోసారి కేఆర్కే తనదైన శైలిలో బాలీవుడ్‌ చిత్రాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల విడుదలైన ఒపెన్‌ హైమర్‌, బార్బీ చిత్రాలు భారీగా వసూళ్లు సాధించడంతో కేఆర్కే బాలీవుడ్ సినీ ప్రముఖులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. హాలీవుడ్‌ సినిమాలకు ప్రచారం లేకపోయినా ఇండియాలో సక్సెస్‌ అవుతాయని అన్నారు. ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే వారి చిత్రాలకు ప్రేక్షాదరణ దక్కుతుందని అన్నారు.  కానీ అందుకు భిన్నంగా బాలీవుడ్‌ దర్శకులు, నటీనటులు ఎంత ప్రచారం చేసుకున్న సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదని ఎద్దేవా చేశారు. 

కేఆర్కే ట్వీట్‌లో రాస్తూ..'బాలీవుడ్ నటులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి పరుగెత్తుతుంటారు. కానీ బాలీవుడ్ నటులు పరిగెత్తినట్లుగా ఇంగ్లీష్ సినిమా నటులు భారత్‌లో తమ చిత్రాలను ప్రమోట్ చేయడం లేదు. హాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఏ జర్నలిస్టుకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. కానీ ఇప్పటికీ హాలీవుడ్ సినిమాలు ఇండియాలో బ్లాక్ బస్టర్ బిజినెస్ చేస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ తనను తానే నాశనం చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రతి చిత్రం చెత్తగా ఉంటోందని ప్రజలు బాలీవుడ్ చిత్రాలను చూడటానికి ఆసక్తి చూపరు. ఈ విధ్వంసానికి కార్పొరేట్ సంస్థలు పూర్తిగా బాధ్యత వహిస్తాయని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వారు సినిమాలు కాకుండా ప్రాజెక్ట్‌లను మాత్రమే చేస్తున్నారు. ' సినీ క్రిటిక్‌ బాలీవుడ్‌పై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

(ఇది చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement