బ్యాట్‌మ్యాన్ విన్యాసాలను చూసేందుకు ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. 2022లో విడుదలైన ‘బ్యాట్‌మ్యాన్’ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు మాట్ రీవ్స్ తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి విడుదల కోసం బ్యాట్‌మేన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. జెఫ్రీ రైట్, రాబర్ట్ ప్యాటిన్‌సన్, ఆండీ సెర్కిస్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2025 రిలీజ్ చేయాలనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఆ సమయంలో విడుదల కావడంలేదని తెలుపుతూ చిత్ర నిర్మాన సంస్ధ అధికారికంగా ప్రకటించింది.
సూపర్ హీరో చిత్రాలను ఇష్టపడే వారికి 'ది బ్యాట్‌మ్యాన్' తెగ నచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ అభిమానులు ఉన్నారు. ఫిక్షనల్ పాత్ర బ్యాట్‌మ్యాన్‌ను ఆధారంగా చేసుకొనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంస్థ సీక్వెల్‌ను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, 2025లో విడుదల కానున్నట్లు మొదట ప్రకటించారు. ఆపై 2026లో రిలీజ్ చేస్తామని తెలిపారు. కానీ, తాజాగా ఈ చిత్రాన్ని 2027 అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని తేలిపోయింది. మొదటి భాగం ఎంత హిట్ అయిందో అంతకు మించి ఈ సినిమా ఉండాలని, అందుకోసం ఆలస్యం అయినా పర్వాలేదని మేకర్స్ ఆలోచిస్తున్నారట. కథ, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మాట్ రీవ్స్ కొత్తగా కొన్ని మార్పులు అనుకున్నారని, వీటిని సెట్స్‌లో చిత్రీకరించేందుకు టైమ్ పడుతుందని, అందుకే ‘బ్యాట్‌మేన్ 2’ చిత్రం విడుదల వాయిదా పడిందని హాలీవుడ్ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment