Pop Singer Rihanna Wore Neck Diamond Watch, Price Details Will Amaze You, Deets Inside - Sakshi
Sakshi News home page

Rihanna Diamond Watch: ఈ వజ్రాల గడియారం స‍్పెషాలిటీ అదే!

Published Thu, Jun 22 2023 11:12 AM | Last Updated on Thu, Jun 22 2023 12:26 PM

Rihanna Neck Diamond Watch Cost Details - Sakshi

మీరు వాచీ ఎక్కడ కట్టుకుంటారు? అని అడగ్గానే ఇదేం పిచ్చి ప్రశ్న అని కిందనుంచి పైవరకు చూసి.. చేతికి కట్టుకుంటాం అని చెబుతారు. కానీ కొన్ని గడియారాలు ఉంటాయి. వాటిని బాడీలో ఎక్కడపడితే అక్కడ కట్టుకోవచ్చు! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓ ప్రముఖ పాప్ సింగర్ తన మెడకు ఓ డైమండ్ వాచ్ ధరించి కనిపించింది. ఇప్పుడు ఆ వాచ్, దాని ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

(ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల‍్లోకి 28 సినిమాలు!)

మన దగ్గర పెద్దగా ఉండదు కానీ పాశ్చాత్య దేశాల్లో పాప్ కల్చర్ చాలా ఎక్కువ. పాప్ సాంగ్స్  పాడే సింగర్స్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తారు. అలా ఫేమస్ అయింది రిహానా. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది. తాజాగా తన భాయ్ ఫ్రెండ్ రాకీతో కలిసి ఓ చోట కనిపించింది. అయితే ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కానీ ఆమె మెడకు వాచ్ ఉండటం కాస్త వింతగా అనిపించింది. అది వజ్రాలతో పొదిగిన గడియారం కావడం మరింత ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఈ వాచ్ ధర గురించి మాట్లాడుకుంటే రూ.5.7 కోట్లు రూపాయలని తెలుస్తోంది. జాకబ్ & కో కంపెనీ.. పాప్ సింగర్ రిహానా కోసం ప్రత్యేకంగా ఈ వజ్రాల గడియారాన్ని డిజైన్ చేశారు. మెడపై ఓ వాచ్ ధరించడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చింది. తమ కంపెనీ ఇన్ స్టా పేజీలో రిహానా వాచ్ తో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వాచ్, దాని కాస్ట్ చూసిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు.


(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement