అంబానీ ఇంట పెళ్లంటే ఎలా ఉండాలి? దేశమంతా మార్మోగిపోవాలి. కలకాలం చరిత్రలో నిలిచిపోయేంత ఘనంగా సెలబ్రేషన్స్ జరగాలి. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్సే అందుకు సాంపుల్. పెళ్లికి నాలుగు నెలల ముందే హడావుడి మొదలుపెట్టేశారు. మార్చి 1 నుంచి 3 వరకు అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకుని వేడుకల్లో భాగమయ్యారు.
అంబానీ ఫ్యామిలీకి థ్యాంక్స్
మొదటి రోజు పాప్ సింగర్ రిహాన్నా తన పర్ఫామెన్స్‌తో అల్లాడించేసింది. భారత్‌లో ఇదే తన తొలి లైవ్ పర్ఫామెన్స్ కావడం విశేషం. ఇక స్టేజీపై మైక్ అందుకుని మాట్లాడిన రిహాన్నా.. 'నన్ను ఇక్కడికి ఆహ్వానించిన అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు. అలాగే కాబోయే కొత్త జంట అనంత్- రాధికిలకు ఆల్‌ద బెస్ట్' అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంబానీ కుటుంబంతో డ్యాన్స్
ఇది చూసిన నెటిజన్లు ఆమెకు పెళ్లికూతురి పేరు కూడా పలకడానికి రావడం లేదని సెటైర్లు వేస్తున్నారు. కోట్లు అందుకున్నప్పుడు కనీసం ఆ జంట పేర్లయినా బట్టీ పట్టాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే స్టేజీపై పోర్ ఇట్ అప్, వైల్డ్ థింగ్స్, డైమండ్స్ సాంగ్స్ పాడిన రిహాన్నా.. చివర్లో ఇషా అంబానీ, ముఖేశ్ అంబానీతో కలిసి డ్యాన్స్ చేసింది. ఒక్క రోజు పర్ఫామెన్స్ కోసం ఆమె ఏకంగా రూ.70 కోట్ల పైనే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment