Nigerian Socialite Daniel Regha Controversial Comments On Rihanna Pregnancy - Sakshi
Sakshi News home page

Rihanna Pregnancy: పెళ్లి కాకుండానే గర్భవతైన సింగర్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ విమర్శలు!

Published Thu, Feb 3 2022 12:47 PM | Last Updated on Thu, Feb 3 2022 1:34 PM

Nigerian Socialite Daniel Regha Controversial Comments On Rihanna Pregnancy - Sakshi

అమెరికన్‌ పాప్‌ సింగర్‌ రిహాన్నా పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. తన బాయ్‌ఫ్రెండ్‌ రాకీతో కలిసి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే పెళ్లి చేసుకోకుండా గర్భం దాల్చడం సరికాదంటూ నైజీరియన్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌ డేనియల్‌ రెఘా విమర్శలు గుప్పించాడు. ఇదేమీ పొగడాల్సినంత గొప్ప విషయం కాదని అభిప్రాయపడ్డాడు. సెలబ్రిటీలు అయినా, మామూలువాళ్లైనా వివాహం చేసుకున్నాక పిల్లల్ని కనడం సరైన పని అని చెప్పుకొచ్చిన ఆయన బేబీ మా అండ్‌ బేబీ డాడీ పదాలను ఈ ప్రపంచం నార్మలైజ్‌ చేస్తోందన్నాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు మనల్ని ఆ దేవుడే కాపాడాలంటూ ట్వీట్‌ చేశాడు. 

'ఏ అమ్మాయైనా సరే, పెళ్లికి ముందే గర్భం దాల్చేందుకుకు పురుషుడికి అనుమతిస్తుందంటే తన  విలువ తనకు తెలీనట్లే. ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తే ముందు ఎదురుకట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకుని ఆ తర్వాతే కుటుంబాన్ని ప్రారంభించాలి' అని మరో ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు. ఈయన ట్వీట్లపై రిహాన్నా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. 'నిన్నెవరు అడిగారు?. రిహాన్నాకు 30 ఏళ్లు. ఎప్పుడేం చేయాలో, ఏం చేయకూడదో ఆమెకు తెలుసు' అని చురకలంటిస్తున్నారు.

కాగా తన ప్రతిభతో సింగర్‌గానేగాక, మంచి వ్యాపారవేత్తగా కూడా రాణిస్తూ వందల కోట్లు ఆర్జిస్తోంది. రిహాన్నా పాటలకు ఆడియెన్స్‌ ఆదరణతోపాటు అనేక అవార్డులు వరించాయి. వీటిలో గ్రామీ, అమెరికన్‌ మ్యూజిక్, బిల్‌బోర్డ్‌ మ్యూజిక్, బీఆర్‌ఐటీ వంటి అవార్డులను పదుల సంఖ్యలో అందుకుంది. బిల్‌బోర్డ్‌ రిహాన్నాకు 2000 దశాబ్దపు ‘డిజిటెక్‌ సాంగ్స్‌ ఆర్టిస్ట్‌’ అనే బిరుదును ప్రదానం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement