రెండేళ్లుగా గ‌ప్‌చుప్‌.. ఊహించ‌ని వార్త చెప్పిన సింగ‌ర్‌ | South Korean Singer Anda Announces Wedding and Pregnancy | Sakshi
Sakshi News home page

ఎలా చెప్పాలో అర్థం కావ‌డం లేదు.. గ‌తేడాదే పెళ్లి, డెలివ‌రీ!

Published Sat, May 4 2024 4:24 PM | Last Updated on Sat, May 4 2024 4:46 PM

South Korean Singer Anda Announces Wedding and Pregnancy

సౌత్ కొరియా సింగ‌ర్ ఆండా రెండేళ్లుగా సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటోంది. అప్ప‌టివ‌ర‌కు ఎంతో యాక్టివ్‌గా ఉన్న ఈ బ్యూటీ ఉన్న‌ట్లుండి సామాజిక మాధ్య‌మాల‌ను ఎందుకు దూరం పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది ఆండా. ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌పెట్టింది.

ఓ విష‌యం చెప్పాలి
త‌న‌కు పెళ్లైంద‌ని, ఓ బిడ్డ కూడా పుట్టింద‌ని వెల్ల‌డించింది. ఈమేర‌కు భ‌ర్త‌తో క‌లిసున్న వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసింది. 'హ‌లో, నా పేరు ఆండా. చాలాకాలంగా నేను సైలెంట్‌గా ఉండ‌టంతో నేనెలా ఉన్నాన‌ని కంగారుప‌డుతున్నారేమో! నేను బాగున్నాను.. మీ అంద‌రికీ ఓ విష‌యం చెప్పాలి. ఇది సాంగ్‌కు సంబంధించిన‌ది కాదు.. ఇదెలా చెప్పాలా? అని చాలాకాలంగా టెన్ష‌న్ ప‌డుతున్నాను. ఇక దాన్ని చెప్పేస్తున్నాను.

పెళ్లి -  పాప
గ‌తేడాది ఓ అద్భుత‌మైన వ్య‌క్తిని క‌లిశాను. మేమిద్ద‌రం శీతాకాలంలో పెళ్లి చేసుకున్నాం. మాకు ఓ పాప పుట్టింది. మీరు ఇక‌పై ఆండా 2.0ను చూడ‌బోతున్నారు. త‌ల్లిగా, భార్య‌గా, సింగ‌ర్‌గా అన్ని ప‌నులు నిర్వ‌ర్తించ‌నున్నాను. మీ అందరికోసం మరింత క‌ష్ట‌ప‌డ‌తాను. థాంక్యూ' అని రాసుకొచ్చింది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement