Kathi Mahesh : ఫిల్మ్‌ క్రిటిక్‌ కత్తి మహేశ్‌ మృతి | Kathi Mahesh Passed Away | Sakshi
Sakshi News home page

Kathi Mahesh : ఫిల్మ్‌ క్రిటిక్‌ కత్తి మహేశ్‌ మృతి

Published Sat, Jul 10 2021 5:43 PM | Last Updated on Sat, Jul 10 2021 7:56 PM

Kathi Mahesh Passed Away - Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, నటుడు కత్తి మహేశ్‌ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని  అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. త్వరలోనే  కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అకస్మాత్తుగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్‌ మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి  మహేశ్‌ తీవ్రం‍గా గాయపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కత్తి మహేశ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మానవతా కోణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17లక్షల రూపాయలు అందచేసింది. అయినా కూడా మహేశ్‌ ప్రాణాలు దక్కలేదు.

‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేశ్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌-1 ద్వారా సోషల్‌ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు కత్తి మహేశ్‌. అంతకుముందు నందు హీరోగా నటించిన పెసరట్టు అనే సినిమాను తెరకెక్కించారు. కాగా, హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లోనూ నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement