
తమకు కావాల్సిన వారి పుట్టినరోజుకు గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అదే తమ అభిమాన హీరో జన్మదిన వేడుకలను ఏడాది పొడవునా గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తారు. మరికొంతమంది అభిమానులు కాస్త విభిన్నంగా ఆలోచిస్తారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు. ఈ ఆదివారం(ఏప్రిల్ 8న) బన్నీ పుట్టినరోజును పురస్కరించుకొని స్పెషల్ బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు.
దీనిలో భాగంగా వైజాగ్ బీచ్‌లో బన్నీ భారీ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఆయన అభిమానులు ఉన్నారు. దీనికోసం ప్రముఖ సైకత శిల్పులను సంప్రదించారని, అనుకున్నట్టు జరిగితే వైజాగ్ బీచ్‌లో ఆదివారం బన్నీ సైకత శిల్పాన్ని చూడొచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మే 4న ప్రేక్షకుల ముందు రాబొతుంది.
Comments
Please login to add a commentAdd a comment