ఇదెక్కడి క్రేజ్‌ రా అయ్యా.. పుష్పరాజ్ దెబ్బకు ట్రాఫిక్ జామ్! | Allu Arjun Pushpa 2 Movie Second Sunday Crowd At Theatre Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: పుష్ప థియేటర్ వద్ద మాస్ జాతర.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు!

Published Tue, Dec 17 2024 4:07 PM | Last Updated on Tue, Dec 17 2024 4:51 PM

Allu Arjun Pushpa 2 Movie Second Sunday Crowd At Theatre Goes Viral

అల్లు అర్జున్ పుష్ప-2 థియేటర్లను షేక్ చేస్తోంది. ఈ నెల 5న మొదలైన పుష్పరాజ్ బాక్సాఫీస్ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా ఆల్ టైమ్ రికార్డ్‌ క్రియేట్ చేసిన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్‌ను చేరుకుంది. అంతేకాకుండా హిందీలో ఎప్పుడు లేనివిధంగా రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 12 రోజుల్లోనే రూ.582 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా సెకండ్ వీకెండ్‌లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది.

ఈ వసూళ్లు చూస్తే చాలు హిందీలో పుష్పరాజ్ క్రేజ్ ఏంటో తెలిసిపోతుంది. రెండోవారంలో ఆదివారం థియేటర్ల వద్ద ఏకంగా ఆడియన్స్‌ను చూస్తే ఏకంగా జాతరను తలపించింది. అయితే అది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో పుష్ప-2 థియేటర్ వద్ద ఇసుకెస్తే రాలనంత జనం వచ్చారు. టికెట్స్ కౌంటర్ వద్ద మాస్ జాతర కనిపించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా థియేటర్ ముందు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. ‍అత్యంత వేగంగా వెయ్యి కోట్ల మార్కు అందుకున్న ఘనతను ఇప్పటికే సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ సినిమాల అల్ టైమ్ వసూళ్లను అధిగమించింది. ఇప్పటికే రూ.1409 కోట్లకు వసూళ్లతో రెండు వేల కోట్ల మార్క్ దిశగా పుష్పరాజ్‌ దూసుకెళ్తున్నాడు. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్‌లోనే రూ.2000 వేల కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement