‘‘ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ‘సైనిక’ సాంగ్ ఉంటుంది. రచయిత రామజోగయ్యశాస్త్రిగారు రాసిన సాంగ్ లిరిక్స్ విన్నప్పుడు ఒళ్లు పులకరించింది. రిపబ్లిక్ డే రోజున సైనికులకు నివాళిలా ఈ పాటను రిలీజ్ చేయనున్నాం. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ సినిమా ఉంటుంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకునిగా మారి రూపొందిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఈ సినిమాలోని ‘సైనిక’ సాంగ్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.
‘‘ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా.. నీ తల్లే ఇండియా’’ అనే లిరిక్స్‌తో ఈ పాట ఉంటుందని హీరో అల్లు అర్జున్ పేర్కొన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్–శేఖర్ మంచి సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ బాడీ లాంగ్వేజ్ సూపర్‌గా ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం పీటర్ హెయి¯Œ సారథ్యంలో ఫైట్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నాం. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చూస్తుంటే సాంగ్ టీజర్‌లా.. ఫైట్ టీజర్‌లను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నాను. సినిమాలో ఫైట్స్ హైలైట్‌గా ఉంటాయి. ప్రస్తుతం తీస్తున్న ఇంటర్‌వెల్ బ్యాంగ్ ఫైట్ తర్వాత మరో నెలరోజుల పాటు షూటింగ్ జరిపితే సినిమా కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘భరతమాతకు సైనికులు వందనం చేస్తారు. కానీ సైనికులకు వందనం చేసేలా ఈ సినిమాలోని ‘సైనిక’ సాంగ్ ఉంటుంది. వారి త్యాగాలు, కష్టనష్టాలను తెలియజేసేలా ఉంటుంది. టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. వక్కంతం వంశీ కథలు అందించిన సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. వంశీకి దర్శకునిగా ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్నవారిలా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి నాలుగు పాటలు రాశాను. సాంగ్స్ సందర్భానుసారంగానే ఉంటాయి’’ అన్నారు.
ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా.. నీ తల్లే ఇండియా
Published Wed, Jan 24 2018 12:21 AM | Last Updated on Wed, Jan 24 2018 12:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment