స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 4న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా కూడా రంగస్థలం, భరత్ అనే నేను తరహాలోనే రెండున్నర గంటలకు పైగా నిడివితో రిలీజ్ అవుతోంది.
ఇటీవల విడుదలైన రంగస్థలం మూడు గంటల నిడివితో రిలీజ్ చేశారు. తరువాత భరత్ అనే నేను సినిమాను కూడా రెండు గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల విషయంలోనూ డ్యూరేషన్‌పై విమర్శలు వినిపించాయి. అయితే అవేవి పట్టించుకోకుండా నా పేరు సూర్య సినిమాను కూడా రెండు గంటల 47 నిమిషాల నిడివితో రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, శరత్‌కుమార్, థాకూర్ అనూప్ సింగ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment