సరైనోడు లాంటి సూపర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాలో అర్జున్ చేయబోయేది బన్నీ తండ్రి పాత్ర అని తెలుస్తోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment