డీజేతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం తుది మెరుపులు దిద్దుకుంటున్న ఈ చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నటించబోయే చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ బన్ని మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఏ సినిమాను ఫైనల్ చేయలేదు.
కానీ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రానికి అంగీకరించినట్టుగా టాలీవుడ్ సమాచారం. మాస్ కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, బన్నీల కాంబినేషన్ సెట్ చేసేందుకు నిర్మాత సీ. కళ్యాణ్ ప‍్రయత్నిస్తున్నారట. ఇదివరకే మెగా హీరో రామ్ చరణ్‌కు ‘రచ్చ’తో విజయం అందించిన సంపత్, మరి అల్లు అర్జున్‌కు అదే స్థాయిలో విజయాన్ని అందించేందుకు కథను సిద్దం చేసుకున్నట్టు సమాచారం. కాగా సంపత్ నంది చివరగా తీసిన సినిమా ‘గౌతమ్‌నంద’ నిరాశపరచటంతో అల్లు అభిమానులు ఈ సినిమాపై కొంత కలవరచెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment