
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్, సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమా రేపు (మే 9న) విడుదలవుతోంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిడివి ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా మూడు గంటల నిడివితో మహానటి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల విడుదలైన మహేష్ బాబు భరత్ అనే నేను 2 గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ నా పేరు సూర్య 2 గంటల 48 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాల కన్నా మహానటి నిడివి ఎక్కువగా ఉండనుంది. 2 గంటల 56 నిమిషాల నిడివితో మహానటి విడుదలకు రెడీ అయ్యింది. రామ్ చరణ్ రంగస్థలం మాత్రం మహానటి కన్నా ఎక్కువ నిడివితో 2 గంటల 59 నిమిషాల రన్‌టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాల విషయంలో సినిమా లెంగ్త్‌పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. మరి మహానటి అలాంటి కామెంట్స్ లేకుండా అలరిస్తుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment