
ప్రతి మనిషికి జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. ఇక్కడ ఏదీ నిరంతరం కాదు జయాపజయాలు అంతే. అదేవిధంగా విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం సహజమే. ఇక నటి కీర్తిసురేష్ విషయానికొస్తే చాలా తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకున్నారు. అదేసమయంలో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సీనియర్ నటి మేనక నిర్మాత సురేష్ వారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన కీర్తిసురేష్ తమిళంలో ఇదు ఎన్న మాయం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
(ఇది చదవండి: చిట్టి ఓటీటీ ఎంట్రీ.. అలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో)
ఆ తర్వాత ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిరాశపరిచినా నటిగా కీర్తిసురేష్ మాత్రం మంచి మార్కులే తెచ్చుకున్నారు. ఆ తర్వాత రజిని మురుగన్ చిత్రాలతో విజయాలను అందుకున్న ఈమె తెలుగులో మహానటి చిత్రంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అదేవిధంగా ఆరంభ దశలోనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి పీక్ సమయంలో మరింత స్లిమ్‌గా తయారవడానికి కసరత్తులు చేశారు. ఫలితంగా చాలా దారుణమైన విమర్శలకు గురయ్యారు.
కీర్తిసురేష్ ముఖంలో గతంలో ఉన్న గ్లామర్ పోయిందని, ఇక ఈమె చాప్టర్ క్లోజ్ అని దారుణమైన కామెంట్స్‌ను ఎదుర్కొన్నారు. అయితే అలాంటి సమయంలోనూ అదేముఖంతో తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తెలుగులో ఆ సమయంలో ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన రీతిలో ఆడలేదన్నది వాస్తవం.
ఆ తర్వాత మళ్లీ సరికొత్త అందాలను సంతరించుకున్న కీర్తిసురేష్ ఇప్పుడు వరుసగా సక్సెస్‌లను అందుకుంటున్నారు. ఆ మధ్య తెలుగులో నాని సరసన నటించిన దసరా మంచి విజయాన్ని సాధించగా, తాజాగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన మామన్నన్ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇక త్వరలో తెలుగులో చిరంజీవికి చెల్లెలిగా నటించిన బోళాశంకర్ ఆగస్టు 11వ తేదీ రావడానికి ముస్తాబవుతోంది. తమిళంలో జయంరవితో సైరన్, హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం రఘుతాత చిత్రాలు చేతిలో ఉన్నాయి.
(ఇది చదవండి: నటికి ఘోర అవమానం.. ఏకంగా ఆ బాడీ పార్ట్స్‌పైనే కామెంట్స్!)
Comments
Please login to add a commentAdd a comment