మహానటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. తాజాగా దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నానికి జోడీగా నటించింది. ఈనెల 30న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీబిజీగా పాల్గొంటుంది ఈ బ్యూటీ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ప్రేమ, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. బ్రేకప్ చేదుగా ఉంటుందా? మందు చేదుగా ఉంటుందా అని కీర్తిని ప్రశ్నించగా.. ఏమాత్రం ఆలోచించకుండా బ్రేకప్ చేదుగా ఉంటుందని తెలిపింది.
అయితే అలాంటి బ్రేకప్ మీ లైఫ్‌లో జరిగిందా అని అడిగితే మాత్రం నవ్వుతూ లేదని చెప్పి తప్పించుకుంది. ఇది విని పక్కనే ఉన్న నాని మహానటి అంటూ కీర్తిని ఆటపట్టించాడు. ప్రస్తుతం కీర్తి చేసిన ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment