Keerthy Suresh breaks silence on relationship rumours, says 'will reveal soon' - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: బాయ్‌ఫ్రెండ్‌ గురించి ఓపెన్‌ అయిన కీర్తిసురేష్‌..ట్వీట్‌ వైరల్‌

Published Tue, May 23 2023 11:33 AM | Last Updated on Tue, May 23 2023 1:15 PM

Keerthy Suresh Breaks Silence On Relationship Rumours - Sakshi

హీరో,హీరోయిన్ల సినిమా సంగతులతో పాటు వారి పర్సనల్‌ విషయాలు తెలుసుకోవాలనే కుతూహాలం ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా హీరోయిన్‌ కీర్తిసురేష్‌ పెళ్లి విషయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ బిజినెస్‌ మ్యాన్‌తో కీర్తిసురేష్‌ లవ్‌లో ఉందని, త్వరలోనే వీరి వివాహం జరగనుందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.

రీసెంట్‌గా కీర్తి ఓ అబ్బాయి ఫోటో షేర్‌ చేయడంతో ఇతడే మహానటికి కాబోయే వరుడు అంటూ ఒక్కసారిగా కథనాలు వెలువడ్డాయి. దీనికి తోడు కీర్తి షేర్‌ చేసిన ఫోటోల్లో ఇద్దరూ ఒకే కలర్‌ డ్రెస్‌ దుస్తులు వేసుకోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. దీంతో కీర్తిసురేష్‌ పెళ్లిపై ఫిల్మీదునియాలో రకరకాలుగా రూమర్స్‌ వస్తున్నాయి.

తాజాగా ఈ వార్తలపై కీర్తి స్వయంగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ.. 'ఈసారి నా బెస్ట్‌ ఫ్రెండ్‌ను ఈ వార్తల్లోకి తీసుకొచ్చారా?నా జీవితంలోని నిజమైన మిస్టరీ మ్యాన్‌ను తప్పకుండా సమయం వచ్చినప్పుడు రివీల్‌ చేస్తాను. అప్పటిదాకా చిల్‌గా ఉండండి' అంటూ పేర్కొంది.

దీంతో రీసెంట్‌గా కీర్తి షేర్‌ చేసిన ఆ అబ్బాయి బాయ్‌ఫ్రెండ్‌ కాదని తేలిపోయింది. అయితే సమయం వచ్చినప్పుడు చెబుతాను అనడంతో కీర్తి లైఫ్‌లో మిస్టరీ మ్యాన్‌ ఉన్నడన్నది మాత్రం స్పష్టమైంది. ఆయన ఎవరన్నది త్వరలోనే తెలియనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement