savithri
-
బేటీ పడావోను తప్పుగా రాసిన కేంద్రమంత్రి.. కాంగ్రెస్ విమర్శలు
‘బేటీ బచావో, బేటీ పడావో’.. దేశంలో బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నినాదాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 22 జనవరి 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. భ్రూణహత్యలను తగ్గించి, బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు, ముఖ్యంగా చదువుల్లోనూ అమ్మాయిలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చారు.కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ నినాదాన్ని తాజాగా ఓ మహిళా కేంద్రమంతి సరిగా రాయలేకపోయారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఆమె మాతృ భాష ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదా హిందీలో తప్పుగా రాశారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన ‘స్కూల్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.ये केंद्रीय महिला एवं बाल विकास राज्यमंत्री सावित्री ठाकुर हैं जिले में शिक्षा जागरूकता रथ पर उन्हें ‘बेटी बचाओ बेटी पढ़ाओ’ का स्लोगन लिखना था लेकिन, मंत्रीजी ने लिखा- "बेढी पडाओ बच्चाव" शपथ-पत्र के मुताबिक वे 12वीं पास हैं ये टीप उनके नहीं बल्कि देश के "शैक्षणिक स्तर" पर है pic.twitter.com/v66qM05Uyc— Anurag Dwary (@Anurag_Dwary) June 19, 2024అయితే జాతీయ స్థాయి నేత మాతృభాషలో ఈ పదాన్ని తప్పుగా రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న నినాదాన్ని కూడా మంత్రి సరిగా రాయలేకపోయారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. పార్టీ సీనియర్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ..రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ పెద్ద శాఖలు చూస్తున్న వ్యక్తులకు తమ మాతృభాషలో సైతం సామర్థ్యం లేకపోవడం దురదృష్టకరం. వాళ్లు తమ శాఖలను సమర్థంగా ఎలా నిర్వహించగలరు?’ అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత నిబంధనను రాజ్యాంగం విధించాలని అభిప్రాయపడ్డారు.అయితే కాంగ్రెస్ విమర్శలను ధార్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఖండించారు.. మంత్రి తొందరపాటులో చేసిన తప్పును కాంగ్రెస్ పెద్దది చేసి చూపడం ఆ పార్టీ అల్పమైన ఆలోచనలకు, గిరిజన వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. ఆదివాసీ మహిళా ప్రతినిధి అని కూడా చూడకుండా కాంగ్రెస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.కాగా సావిత్రి ఠాకుర్.. మధ్యప్రదేశ్‌లోని ధార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల మోదీ 3.0 కేబినెట్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. -
సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ
‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యారు లలితా జువెల్లర్స్ ఎండీ కిరణ్ కుమార్. తన బ్రాండ్‌కు తానే అంబాసిడర్‌గా వ్యవహరించి లలితా జ్యువెల్లరి ఆభరాలను ప్రమోట్ చేసుకున్నారు. వ్యాపారవేత్తగా సక్సెస్ అయి.. వేల కోట్లకు అధిపతి అయిన ఆయన మహానటి సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను ఇంత పెద్ద సెక్సెస్ అవ్వడానికి కారణం మహానటి సావిత్రి అని తాజాగా ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు. సావిత్రి ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించానని, ఆమె వల్లే తాను సక్సెస్ అయ్యానన్నారు. చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం కాగా ఆయన చెన్నైలోని మహానటి సావిత్రి ఇంటిని కొనుగోలు చేసి అక్కడ వ్యాపారం విస్తరించుకున్నారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రిగారి ఇంటితో తనకు ఎమోషనల్ బాండింగ్ ఉందని, ఎంతో ఇష్టంతో సావిత్రి గారి ఆస్తిని కొన్నానని కిరణ్ కుమార్ తెలిపారు. సావిత్రి పేరు మీద ఆమె పిల్లలు అప్పట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారని, అక్కడ షాప్ రెంట్‌కు తీసుకుని బంగారం షాప్ స్టార్ చేశానన్నారు. సావిత్రి గారి ఆశీర్వాదం వల్లే తన వ్యాపారం బాగా నడిచిందని, ఇప్పుడు తాను ఇంత పెద్ద సక్సెస్ అయ్యానని పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ ఆ ఇంటి పేరు ఆమెదే ఉందన్నారు. ఆ బిల్డింగ్ లలితా కార్పొరేట్ ఆఫీస్ అని రాశాము గానీ.. సావిత్రి గణేశన్ పేరు అలానే ఉంచామన్నారు. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అమ్మ ఆస్తి నుంచి వచ్చిన ఇల్లు అదేనని, దానిని పడగొట్టి ఓ కమర్షియల్ బిడ్డింగ్ కట్టామన్నారు. ‘దానిని లలితా జువెల్లర్స్ ఎండీ కిరణ్ రెంట్‌కు తీసుకుని షాప్ పెట్టారు. ఆయనకు బాగా కలిసి వచ్చింది. దాంతో మేం దానిని అమ్మాలకున్నప్పుడు తనకే ఇవ్వాలని కోరాడు. అందుకే ఆయనకు ఆ బిల్డింగ్ అమ్మేసి ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కొనుక్కున్నాం’ అని చెప్పుకొచ్చారు. అనంతరం కిరణ్ కుమార్‌కే ఆ ఆస్తిని అమ్మడానికి ఓ కారణం ఉందని కూడా చెప్పారు. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు ‘అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. కిరణ్ కుమార్‌ది బంగారం షాపే. అమ్మకు కార్ల పిచ్చి ఉన్నట్టే.. కిరణ్‌కి కూడా ఉంది. ‘‘అమ్మను ఆయన బాగా అభిమానిస్తారు. బిల్డింగ్ అమ్మిన తర్వాత ఎంట్రన్స్‌లో ఉన్న అమ్మ బొమ్మను తీసుకువెళ్తుంటే దానిని అక్కడే ఉంచాలని కోరాడు. ‘ఇది నేను కొన్నంత మాత్రానా ఈ ఆస్తి మీది కాకుండా పోదు. ఇక్కడి నుంచి ఏమైనా తీసుకువెళ్లండి. కానీ, సావిత్రి అమ్మ ఫొటో తీసుకు వెళ్లొద్దు’ అని కిరణ్ కోరాడు’ అని ఆమె చెప్పింది. అంతేకాదు తనని తమ్ముడిగా భావించమంటూ అక్కయ్య అని కిరణ్ అప్యాయంగా పిలుస్తారంటూ విజయ చాముండేశ్వరి తెలిపారు. -
‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు
మహానటి సావిత్రి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. నటనకే నటనను నేర్పిన సహజ నటి. పాత్రలకే ప్రాణం పోసిన మహానటి ఆమె. అందుకే తరాలు మారినా ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం. తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే. చలన చిత్ర రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. హీరోయిన్గా కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కన్నుమూశారు. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? తన జీవితం ఎందుకు అలా అయ్యిందనేది ఇప్పటికీ ఆశ్యర్యంగానే ఉంటుంది. ఇక మహానటి సినిమా తర్వాత సావిత్రి గురించిన పలు ఆసక్తికర విషయాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరీ తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహానటి మూవీ తర్వాత ఇంట్లో చాలా గొడవలు అయ్యాయంటూ షాకింగ్ విషయం చెప్పారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ.. మహానటి చిత్రం తర్వాత నాన్నపై చాలా విమర్శలు వచ్చాయి. నాన్న వల్లే అమ్మ జీవితం ఇలా అయ్యిందని అందరు తిడుతూ కామెంట్స్ చేశారు. అవి చూసి అక్కవాళ్లు(జెమిని గణేషన్ మొదటి భార్య పిల్లలు) ‘నీ వల్లే నాన్న పేరు చెడింది’ అని నన్ను తిట్టారు. నాతో మాట్లాడటం కూడా మానేశారు’ అని చెప్పారు. అయితే ఇప్పుడు అంతా సర్దుకుందని, మూడేళ్ల తర్వాత కలిశామని ఆమె పేర్కొన్నారు. రీసెంట్గా ఓ ఫంక్షన్లో అందరం కలిశామని, అప్పుడు నన్ను హగ్ చేసుకుని ‘ఎలా ఉన్నావు’ అని అక్కవాళ్లు పలకరించారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈ గొడవలపై బాలీవుడ్ నటి, జెమిని గణేషన్ మూడో భార్య కూతురు రేఖ సైతం ఫోన్ చేశారట . చదవండి: మహేశ్ సినిమాకు హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నా: రాజమౌళి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బయోపిక్‌లో ఉన్నది ఉన్నట్లు చూపించడం సాధ్యం కాదని, ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేందుకు కొంచెం మాసాల యాడ్ చేస్తారని రేఖ అక్క అన్నారని చెప్పారు. ఇవేవి పట్టించుకోవద్దని, కొద్ది రోజులకు వాళ్లకే అర్థం అవుతుందిలే అని రేఖ అక్క ఫోన్లో ఓదార్చారని విజయ చాముండిశ్వరి చెప్పుకొచ్చారు. కాగా సావిత్రి, జెమిని గణేషన్‌కు రెండో భార్య అనే విషయం తెలిసిందే. సావిత్రిని పెళ్లి చేసుకునే సమయానికి అప్పటికే జెమిని గణేషన్‌కు పెళ్లయి, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆయన మొదటి భార్య, పిల్లలతో సావిత్రికి సత్సంబంధాలు ఉండేవి. అందరు ఒక్క కుటుంబంలా ఉండేవారని మహానటిలో చూపించిన సంగతి తెలిసిందే. -
సావిత్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి ఝాన్సీ
సీనియర్ నటి ఝాన్సీ.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు ఓ అద్దే ఇంట్లో ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె చెన్నైలో లగ్జరీ ఇంట్లో రాజసంగా బ్రతికారు. కానీ ఒక్క మూవీ ఫ్లాప్‌తో ఆస్తులన్నీ అమ్మేసిన పరిస్థితి ఎదురైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఆమె. 78 ఏళ్ల వయసులో కష్టాలు పడుతూ పుట గడవడం కూడా ఇబ్బందిగా మారిందట ఆమె జీవితం. చదవండి: అందుకే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికాను ట్రోల్ చేస్తున్నారు: నటి రమ్య స్క్రీన్ హీరోయిన్గా, నటిగా ఆకట్టుకున్న ఆమె కళ్లతోనే హావభావాలను పలికించేవారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఝాన్సీ చాలా ఏళ్ల తర్వాత తెరముందుకు వచ్చారు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌తో ఆమె ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మహానటి సావిత్రి గురించిన ఓ షాకింగ్ విషయం రివీల్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఎక్కువగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. సావిత్రి, కేఆర్ విజయలతో మాట్లాడేదాని. అంతేకాదు తరచూ సావిత్రి ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాకంటే ముందే సావిత్రిగారు సినిమాల్లోకి వచ్చారు. తననే స్ఫూర్తిగా తీసుకుని నటించేవాళ్లం. తెరపై ఆమె అందంగా, హావభావాలను పలికించేవారు. సావిత్రిలా నటించాలని నటనలో తనని అనుసరించేవారు. సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. అయితే సావిత్రి చివరి రోజుల్లో వెళ్లి చూశారా? అని ప్రశ్నించగా.. ‘ఆ సమయంలో సావిత్రిని చూడలేకపోయానని బాధపడ్డారు. అసలు ఆవిడని చూడలేకపోయేవాళ్లమంట. అంత మనిషి చిన్న పిల్లలా అయిపోయారట. అందుకే తనని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేనని నేను వెళ్లలేదు. చదవండి: విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి అయితే ఎంతో రాజసంగా బతికిన సావిత్రి గురించిన ఓ వార్త నన్ను చాలా బాధించింది. అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని నెలలు కొమాలో ఉన్నారు. ఆ సమయంలోవైద్యం చేయించేందుకు డబ్బుల ఆమె భర్త జెమిని గణేశన్ ఓ ప్రకటన ఇచ్చారు. సావిత్రి చికిత్స కోసం డబ్బు కావాలని, దాతలు ఈ అడ్రస్ డబ్బు పంపించగలరు అంటూ ఆయన పత్రిక ప్రకటన ఇచ్చారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఎంతో ధనవంతురాలు, మహానటి అయిన ఆమె జీవితం చివరికి ఇలా అయ్యిందేంటని అనిపించింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా.. జాగ్రత్తపడకపోవడం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే సావిత్రి జీవితం ఇలా అయ్యిందేమో అని ఆమె అభిప్రాయపడ్డారు. -
చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా..
సావిత్రి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. నటనకే నటనను నేర్పిన సహజ నటి. పాత్రలకే ప్రాణం పోసిన మహానటి ఆమె. అందుకే తరాలు మారిన ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం. తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే. అప్పట్లోనే హీరోలకు ధీటుగా సినిమాలు చేయడమే కాదు, మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా కూడా మారారు. చలన చిత్ర రంగంలో తనకంటూ చేరగని ముద్ర వేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. హీరోయిన్గా కోట్ల ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కన్నుమూశారు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన సుడిగాలి సుధీర్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్ అసలు సావిత్రి చివరి రోజుల్లో ఎలా ఉన్నారు, వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న ఆమెకు చివరిలో రోజుల్లో ఓ మూవీ సెట్లో ఎదురైన చేదు అనుభవాన్ని దివంగత నటులు గుమ్మడి గతంలో చెప్పారు. ఆయన తన చివరి రోజుల్లో ఓ చానల్‌తో ముచ్చటించిన ఈ పాత వీడియోలో గుమ్మడి, సావిత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన తీరు పలువురిని కదిలిస్తోంది. ‘‘నేను సావిత్రికి చాలా ఆత్మీయుడ్ని. నన్ను అన్న అని పిలిచేది. సావిత్రి చివరి రోజుల్లో ఆమె పడ్డ కష్టాలను స్వయంగా చూశాను. ఇందులో ఓ చేదు గుర్తు, తీపి గుర్తు రెండూ ఉన్నాయి. నాకు ఓ వారం రోజులు ఆరోగ్యం బాగోలేదు. అవి సావిత్రి చివరి రోజులు. ఆమె నన్ను పలకరించడానికి ఇంటికి వచ్చింది. డాక్టర్ నాకు ఇంజెక్షన్ ఇస్తే మగతగా పడుకుని ఉన్నా. సావిత్రి వచ్చి నన్ను పలకరించింది. నాతో కాసేపు మాట్లాడిన అనంతరం ఆమె వెళుతూ నా తలగడను సర్దినట్లు అనిపించింది. ఏంటా అని దాన్ని తీసి చూస్తే 2 వేల రూపాయలు ఉన్నాయి. ఫోన్ చేసి ఏంటమ్మా డబ్బులు పెట్టావు అని అడిగా.. ‘‘ మీరు మర్చిపోయారేమో అన్నయ్యా.. నేను మీ దగ్గర అప్పుడు 2 వేల రూపాయలు తీసుకున్నా..పోయే లోపల ఎవ్వరికీ దమ్మడి కూడా బాకీ ఉండకూడదు. నాకు 5 వేలు అడ్వాన్స్ వచ్చింది. దాంట్లోంచి ఇస్తున్నా’’ అంది. ఆమె వ్యక్తిత్వం చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఆమెకు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత.. సినిమాలు కూడా తగ్గిపోయాయి. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేయసాగింది. అప్పుడే ఓ సినిమా కోసం ఆమెను తల్లి పాత్రకు తీసుకున్నారు. నేను కూడా ఆ సినిమాలో చేస్తున్నాను. చదవండి: ఫ్లైట్ నుంచి దూకేశా.. కోలుకోడానికి రెండున్నర ఏళ్లు పట్టింది: శర్వానంద్ ఆ సమయంలో అందరికీ ఇంటి దగ్గరి నుంచి భోజనాలు వస్తాయి. మాకు కొందరికి క్యారియర్లు వచ్చాయి. నా క్యారియర్ కూడా వచ్చింది. అప్పుడు సావిత్రి దూరాన ఒక్కతే అలా కూర్చుని ఉంది. సాధారణంగా ఇంటినుంచి క్యారియర్ రాని వాళ్లకు ప్రొడక్షన్ వాళ్లు భోజనం అరెంజ్ చేయాలి. ఆమె క్యారియర్ తెచ్చేవాళ్లు ఎవరు లేరు. నేను తన దగ్గరికి వెళ్లి ‘భోజనం చేయలేదా’ అని అడిగా.ఆకలిగా లేదని చెప్పింది. నాకు అంత అర్థమైంది. ప్రొడక్షన్ వాళ్లు భోజనం పెట్టలేదు. తనకు ఇంటి దగ్గరినుంచి రాలేదు. ‘‘రామ్మా.. భోజనం చేద్దాం’ అన్నా. ‘‘వద్దు’’ అని అంది. ‘‘లేదమ్మా! నువ్వు వస్తే తప్ప నేను కూడా భోజనం చేయను’’ అన్నాను. అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి భోజనం చేసింది’’ అని అన్నారు. అప్పట్లో మా సినిమాలో సావిత్రిగారే కావాలని పట్టుబట్టి మరి ఆమె కాల్షీట్ కోసం ఎదురు చూసేవాళ్లు.. చివరికి తను ఆ పరిస్థితి రాగానే ప్రోడక్షన్ బాయ్స్‌కు కూడా ఆమె చులక అయిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
‘టీచరమ్మ’గా వెండితెరపై బెత్తం పట్టి అలరించిన హీరోయిన్లు
‘ఈ టీచర్ చాలా స్ట్రిక్ట్’ అనిపించుకుంది సావిత్రి ‘మిస్సమ్మ’లో. ‘ఈ టీచర్ భలే చక్కగా పాఠాలు చెబుతుంది’ అని మెచ్చుకోలు పొందింది జమున ‘మట్టిలో మాణిక్యం’లో. ‘పంతులమ్మ’ సినిమాలో లక్ష్మి పిల్లల పాఠాలే కాదు కథానాయకుని జీవితాన్ని కూడా చక్కదిద్దింది. ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ దగ్గరి నుంచి నిన్న మొన్నటి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు టీచర్ అంటే విజయశాంతే. ‘లేడీస్ టైలర్’లో రాజేంద్ర ప్రసాద్ వంటి అల్లరి స్టూడెంట్‌ని బెత్తం దెబ్బలు కొట్టి సరి చేయలేదూ అర్చన. టీచర్ పాత్రకు గ్లామర్ ఉండకపోవచ్చు గాని ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కొందరు హీరోయిన్లకే దక్కింది. అదిగో చాక్‌పీస్ ఒక చేత్తో బెత్తం మరో చేత్తో పట్టుకుని వాళ్లిటు నడిచొస్తున్నారు చూడండి. శిశువుకు అమ్మ తొలి టీచర్. స్కూల్లో ‘టీచరమ్మే’ తొలి టీచర్. నర్సరీల్లో, ఐదు లోపల తరగతుల్లో పిల్లలకు తొలిగా పరిచయం అయ్యేది ఎక్కువగా టీచర్లే. వీరే పిల్లలకు తొలుత ఆత్మీయులవుతారు. బడి పట్ల, పాఠాల పట్ల ఆసక్తి కలిగిస్తారు. ఈమె కూడా అమ్మలాంటిదే కాబట్టి భయం లేకుండా వెళ్లొచ్చు అని పిల్లలకు నమ్మకం కలిగిస్తారు. అయినా సరే ‘గురు దేవా’ అంటే మగ గురువు గుర్తుకొస్తాడు. స్త్రీల వాటా ఈ విషయంలో సమానం అయినప్పటికీ. సినిమాల్లో కూడా హీరోలు వేసిన టీచర్ పాత్రలు ఎక్కువ ఉన్నాయి. హీరోయిన్లకు తక్కువగా ఈ చాన్స్ వచ్చింది. ‘గ్లామర్’ సినిమా కమర్షియల్ సినిమా వచ్చాక ‘టీచర్’ పాత్రలో హీరోయిన్ను గ్లామరస్‌గా చూపించలేము అనే భావనతో నిర్మాత, దర్శకులు హీరోయిన్ను ‘ఒక ఆడి పాడే బొమ్మ’ స్థాయికే కుదించి పెట్టారు. అయితే అప్పుడప్పుడు మంచి టీచర్ పాత్రలు సత్తా ఉన్న నటీమణుల చేతుల్లో పడి మెరిశాయి. వాళ్లు తెర మీద ఉంటే ప్రేక్షకులు బుద్ధిగా చూసే విద్యార్థులయ్యారు. రిజల్ట్ వందకు వంద వచ్చింది. మీకు మీరే మాకు మేమే: సినిమాల్లో హీరోను చూసి హీరోయిన్ జంకడం ఆనవాయితీ. కాని ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి రామారావు జంకుతుంటాడు. దానికి కారణం ఆమె నిజాయితీ, టీచర్‌గా సిన్సియారిటీ. స్కూల్లో పిల్లలకు పాఠాలతో పాటు జమిందారు గారి కుతురికి సంగీతం పాఠాలు కూడా చెప్తుంది సావిత్రి. అంతేనా? కొంచెం నాన్ సీరియస్‌గా ఉన్న ఎన్.టి.ఆర్ తనను అందుకునేంతగా ఎదిగేలా చేసి ఒక రేవుకు చేరుస్తుంది. ‘రావోయి చందమామా మా వింతగాధ వినుమా’... ఆ రోజుల్లో టీచర్లు పాటలు పాడే పాటలు ఇంత శుభ్రంగా వినసొంపుగా ఉండేది. నా మాటే నీ మాటై చదవాలి: ‘మట్టిలో మాణిక్యం’ లో చలం అమాయకుడు. పౌరుషంతో పట్నం వస్తే టీచరైన జమున పరిచయం అవుతుంది. ప్రేమిస్తుంది. మామూలు చదువే కాదు లౌక్యంగా ఉండటానికి అవసరమైన చదువు కూడా చెబుతుంది. పాఠాలను పాటగా మార్చి ఆమె పాడే ‘నా మాటే నీ మాటై చదవాలి నేనంటే నువ్వంటూ రాయాలి’ పాట బాగుంటుంది. ఆ తర్వాతి రోజుల్లో సింగీతం శ్రీనివాసరావు హీరోయిన్ లక్ష్మితో ‘పంతులమ్మ’ సినిమా తీశాడు. ‘పంతులమ్మ’ టైటిల్‌తో ఒక సినిమా వచ్చి హిట్ కావడం విశేషం. భార్య మరణించిన వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక పంతులమ్మ అతని పిల్లలకు పాఠాలు చెబుతూ అతనిలోని ఒక అపోహను తొలగించడం కథ. ‘ఎడారిలో కోయిల’ పాట ఒయాసిస్ లా ఉంటుంది. ఆ తర్వాత ‘శుభలేఖ’ సినిమాలో సుమలత టీచర్‌గా నటించింది. కట్నం అడగడాన్ని ఎదిరించిందని ఆమె ఉద్యోగం పోతుంది. కాని ఆమె వెరవదు. ఈ దుర్యోధన దుశ్శాసన క్లాసులోని రౌడీ పిల్లాణ్ణి సరి చేయడం టీచర్ బాధ్యత. మరి సమాజంలో ఉన్న రౌడీ పిల్లాణ్ణి దండించడం? చట్టం, న్యాయం, వ్యవస్థ విఫలమైతే ఆ బాధ్యత కూడా టీచరే తీసుకుంటుంది. ‘ప్రతిఘటన’లో లెక్చరర్ అయిన విజయశాంతి ఊళ్లో అనేక ఫతుకాలకు కారణం అవుతున్న రౌడీని అంతిమంగా తెగ నరికి నిర్మలిస్తుంది. చాక్‌పీస్ పట్టిన చేతులు గొడ్డలి కూడా పట్టగలవు అని హెచ్చరిస్తుంది. ఈ టీచర్ పాత్ర తెలుగులో వచ్చిన అన్ని టీచర్ పాత్రల కంటే శక్తిమంతమైనది. క్లాసురమ్లో పిచ్చి జోకులు, లెక్చరర్ల మీద పంచ్‌లకు తావు ఇచ్చే పాత్ర కాదు ఇది. ఈ పాత్రను చూడగానే మహా మహా పోకిరి స్టూడెంట్లు కూడా సైలెంటైపోవాల్సిందే. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో’ అని విజయశాంతి పాడుతుంటే ఆ వేదనా శక్తి చసే ప్రతి విద్యార్థిలో పరివర్తన తెస్తుంది. విజయశాంతి ఆ తర్వాత ‘రేపటి పౌరులు’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల్లో కూడా టీచర్‌గా నటించింది. అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి: అతను బెస్తపల్లెలో రౌడీ. ఆమె క్రైస్తవ విశ్వాసాలు కలిగిన టీచర్. అతను హింస. ఆమె దయ. హింసను వీడి దయ వరకూ చేసే ప్రయాణాన్ని ఆ టీచర్ ఆ రౌడీలో ప్రేరేపిస్తుంది. అతని పాపాలన్నీ స్వీయ రక్తంతో ప్రక్షాళనం అవుతాయి. చివరకు అతను ఆమె ప్రేమను పొందుతాడు. రౌడీగా చిరంజీవి, టీచర్‌గా సుహాసిని ‘ఆరాధన’లో నటించారు. ‘అరె ఏమైంది’ పాట ఇప్పటికీ హిట్ ప్రేమమ్ మరికొన్ని: ఇటీవలి కాలంలో ఈ కాలపు హీరోయిన్లు కూడా టీచర్లుగా నటించారు. ‘ఘర్షణ’లో అసిన్, ‘గోల్కొండ హైస్కల్’లో కలర్స్ స్వాతి, ‘హ్యాపీ డేస్’లో కమలిని ముఖర్జీ, ‘రాక్షసుడు’లో అనుపమ పరమేశ్వరన్ టీచర్లుగా కనిపిస్తారు. మన సాయి పల్లవి మలయాళ ‘ప్రేమమ్’లో టీచర్‌గా నటించే పెద్ద క్రేజ్ సాధించింది. ఆ పాత్రను తెలుగులో శృతిహాసన్ చేసింది. -
సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్ హీరో తెలుసా!
సినిమాల్లో బాల నటులుగా నటించిన వారు కొంతమంది పెద్దాయ్యాక ఇతర రంగాల్లో రాణిస్తుండగా.. మరికొందరూ సినిమాల్లో స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పటి మన స్టార్స్ ఒకప్పుడు సినిమాల్లో బాల నటులుగా నటించిన వారే. ఊయలలో ఉన్నప్పుడే వారు వెండితెర ఎంట్రీ ఇచ్చారు. కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి కృష్ణ సినిమాలతో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, మనోజ్‌లు కూడా బాల నటులుగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే బ్లాక్ అండ్ వైట్ కాలంలో నటించిన మన స్టార్ హీరోలు చైల్డ్ అర్టిస్టులుగా నటించిన విషయం తెలుసా?.. వారుల ఎలా ఉంటారో చూశారా?. (చదవండి: మీరే నా బలం, నా జీవితం: మెగా బ్రదర్) కాగా అప్పటి లెజెండరీ నటుడి తనయుడు చైల్డ్ అర్టిస్టుగా నటించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ఎవరో గుర్తుపట్టలేక చాలా మంది బుర్రకు పని చెబుతున్నారు. మహానటి సావిత్రి ఎత్తుకుని ముద్దాడుతున్న ఆ చిన్నారి ఇప్పటి స్టార్ ఎవరో గుర్తుపట్టలేక నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ బుడ్డోడు ఓ లెజెండరి నటుడు తనయుడు.. తెలుగు ప్రముఖ హీరోల్లో ఒకడు.. అంతేకాదు ఆయన తనయులు కూడా ఇప్పుడు టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడైన సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా... లేదా.. అయితే ఎవరో తెలుసుకుందా రండి!. (చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్‌కు అంత సమయమా..!) అయితే అప్పట్లో టాలీవుడ్‌ను ఏలిన కథానాయకులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావుల కుమారులు చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమాల్లో చైల్డ్ అర్టిస్టులుగా హరికృష్ణ, బాలకృష్ణలు నటిస్తుండగా, నాగేశ్వరావు సినిమాల్లో ఆయన తనయుడు నాగార్జున బాలనటుడిగా రెండు సినిమాలు చేశాడు. అందులో నాగేశ్వరావు, సావిత్రిలు జంటగా నటించిన వెలుగు-నీడలు చిత్రంలో నాగ్ చైల్డ్ అర్టిస్టుగా కనిపించాడు. ఈ మూవీ సమయంలో నాగార్జున 8 నెలల పసిపాపగా ఉన్నాడు. అనంతరం ‘సుడిగుండాలు’ సినిమాలో కూడా నాగార్జున బాలనటుడిగా నటించిన సంగతి తెలిసిందే. మరీ ఇప్పడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. అప్పటి నటశిరోమణి చేతిలో తెరపై ఆడుకున్న ఈ బుడ్డోడే ఇప్పటి మన ‘కింగ్’ నాగార్జున. (చదవండి: Meera Jasmine Now: మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుంది?) -
ఆడపిల్లను ఊరూరూ తిప్పడమేంటి అనడంతో...
మనకు మహానటి సావిత్రి తెలుసు. ఈమె కర్ణాటక రంగస్థలంలో రాణిస్తున్న మంచినటి. చిన్నప్పుడు సాధ్యం కాని తన అభీష్టాన్ని అరవై దాటిన తరవాత నెరవేర్చుకుంది. పదేళ్ల వయసులో ఇంటినే యుద్ధరంగం చేసేది. కర్ర పుల్లనే కరవాలంగా చూసుకునేది. భీకర యుద్ధం చేస్తున్నట్లు నోటితో శబ్దాలు చేస్తూ యుద్ధఘట్టాన్ని రంజింపచేసేది. ముగియగానే ఓ పాట అందుకునేది. పాటకు తగ్గట్టు అభినయించేది. ఆ సన్నివేశాలన్నీ సావిత్రి అనే అమ్మాయి యక్షగానం మీద పెంచుకున్న ప్రేమకు చిహ్నాలు. ఆమె ఇష్టానికి తగ్గట్టు పెద్దవాళ్లు ఆమెకు యక్షగానంలో శిక్షణ ఇప్పించారు. పన్నెండు– పదమూడేళ్లు వచ్చేసరికి చిన్న చిన్న పాత్రలతో రంగస్థలం మీద అడుగుపెట్టడానికి సిద్ధమైన సావిత్రిని ‘పెద్దయిన ఆడపిల్లను యక్షగాన ప్రదర్శన కోసం ఊరూరూ తిప్పడమేంటి?’ అని ఆపేశారు. అలా తెరపడిన ఆమె నటకౌశలానికి అరవై ఆరేళ్ల వయసులో తనకు తానే తెర తీసుకుందామె. ఇప్పుడామె వయసు 77. ఈ పదకొండేళ్లలో వందకు పైగా నాటకాలు ప్రదర్శించింది రంగస్థల, యక్షగాన కళాకారిణి సావిత్రి. అరవై... అయితేనేం? ఈ సావిత్రిది కర్ణాటకలోని మంగుళూరు. తనకు ఇష్టమైన యక్షగాన ప్రదర్శనకు చిన్నప్పుడే అడ్డుకట్ట పడడంతో ఆమె ఆ తర్వాత చదువు మీదనే దృష్టి కేంద్రీకరించింది. స్కూల్ టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కళారంగానికి దూరం కాలేదు. భర్త శ్రీనివాసరావు నడిపిస్తున్న ‘మక్కల్ సాహిత్య సంగమ’కు సహకారం అందించేది. తన విద్యార్థులకు చిన్న నాటకాలు సాధన చేయించి పాఠశాల వార్షికోత్సవాల్లో ప్రదర్శిస్తుండేవారు. ఆ రకంగా తెర వెనుకే ఉంటూ తన కళాభిరుచిని నెరవేర్చుకునేది. రిటైర్ అయిన తర్వాత ఆమెకు ఆ వ్యాపకం కూడా లేకుండా పోయింది. అప్పుడు తీసుకుందామె ఓ నిర్ణయం. మంగుళూరులోని యక్షారాధన కళాకేంద్ర నిర్వహకులు సుమంగళ రత్నాకర్‌ను సంప్రదించి నాలుగైదు గంటల నిడివితో సాగే నాటకాలను కూడా అవలీలగా సాధన చే సింది. పదేళ్లు గడిచేప్పటికి ఆమె వందవ నాటకాన్ని ప్రదర్శించారు. వాల్మీకి, దుర్యోధన, సుగ్రీవ, భీష్మ, ధర్మరాయ వంటి పౌరాణిక పాత్రల్లో చక్కగా ఇమిడిపోతారామె. ‘కరోనా కారణంగా నాటక ప్రదర్శనలు తగ్గాయి. లేకపోతే ఇప్పటికి మరో పాతిక ప్రదర్శనలిచ్చేదాన్ని. లాక్డౌన్ పోయి, అన్‌లాక్ మొదలైన తర్వాత కొద్దిపాటి నిడివితో ప్రదర్శనలు ఇస్తూ వాటిని డిజిటల్లో ప్రదర్శనలు ప్రసారం చేస్తున్నాం’ అన్నారు. అలాగే ‘‘మనం మహిళలం కాబట్టి అలా చేయడం బాగుండదని... ఇలా చేస్తే ఎవరైనా నవ్వుతారేమోనని, మన వయసు ఇంత అని గుర్తు తెచ్చుకుంటూ పరిధులు గీసుకుంటూ పోతే మన కల ఎప్పటికీ నెరవేరదు. మన కలను మనమే సాకారం చేసుకోవాలి’’ అంటూ మహిళలకు మంచి సందేశమిచ్చారు. -
వెండితెర గురువులు
గురు బ్రహ్మ.. గురు విష్ణు.. అని శ్లోకం ఉంది నిజమేగానీ సినిమా వాళ్లు దానికి కాస్త ఎక్స్టెన్షన్ కొట్టి లెంగ్త్ పెంచి గురు హీరో గురు హీరోయిన్ గురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నమః అని కూడా అనుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు లేని సమాజం ఎలా లేదో టీచర్ల, లెక్చరర్ల పాత్రలు లేని సినిమాలు కూడా లేవు. ఆ మిస్సమ్మల, పంతులమ్మల, మాస్టారుల రీ విజిట్.. నేడు టీచర్స్ డే సందర్భంగా. ‘మిస్సమ్మ’లో సావిత్రి కేవలం స్కూల్లో పిల్లలకే టీచర్ కాదు. ఆ సినిమాలోని ప్రతి పాత్రకూ టీచరే. కొంచెం నాన్ సీరియస్‌గా ఉన్న ఎన్.టి.ఆర్కు లక్ష్యం ఏర్పరిచిన ఆమే టీచర్. దొంగ బిచ్చగాడు రేలంగిని ఆ దారి వదిలించిన ఆమే టీచర్. తెలిసీ తెలియని వయసులో ఉన్న జమునకు మంచి చెడు తెలియజేసిన ఆమే టీచర్. కంత్రీ విలన్ రమణా రెడ్డికి బడితె పూజ చేయడం తెలిసిన ఆమే టీచర్. ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి చిన్నపిల్లల్లా ప్రతి ఒక్కరూ భయపడేవారే. ఆఖరుకు ఎస్.వి. రంగారావు, బుష్యేంద్రమణిలతో సహా. సినిమాల్లో టీచర్ పాత్రకు గట్టిగా ఫౌండేషన్ వేసిన పాత్ర అది. కానీ ఆశ్చర్యంగా ‘బడి పంతులు’లో ఎన్.టి.ఆర్ పాత్ర అమిత మెత్తన. నెమ్మది, కరుణ, దయ తప్ప ఆ పాత్రకు ఏమీ తెలియదు. పిల్లలు దేవుళ్లు కాబట్టి ఆ పాత్రలోని దైవత్వాన్ని గ్రహించి ఆదరించారు. కానీ కడుపున పుట్టిన సంతానం అవమానం చేసి వేదన మిగిల్చింది. ఆ పంతులును బడి ఎక్కించి నిలబెట్టింది. అయితే మంచితనమే చివరికి గెలుస్తుంది. శిష్యుడు ఫెయిల్ కావచ్చు గాని విలువలకు నిలబడ్డ గురువు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. అయితే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినని మొండి ఘటాలు కూడా స్కూల్లో ఒక మాస్టారు ముందు మోళీ వేసినట్టుగా తలాడిస్తారనడానికి తార్కాణంగా ‘కోడె నాగు’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో పరమ మొండి ఘటమైన శోభన్ బాబు తన టీచర్ అయిన ఆత్రేయ మాట మాత్రమే వింటాడు. కానీ ఈ శిష్యుడి సంస్కరణలో ఆ గురువు ప్రాణ త్యాగం చేస్తాడు. ఆ గురువుకు నివాళిగా శిష్యుడూ ఆత్మార్పణం చేస్తాడు. గుండెలు పిండే ఈ కథ గురుశిష్యుల అనుబంధాన్ని అజరామరం చేసింది. ‘స్కూలు’, ‘కాన్వెంటు’ అనే మాటలు వాడుకలో పెరుగుతున్న వేళ ఆడవాళ్లు టీచింగ్ ప్రొఫెషన్లోకి ఎక్కువగా వస్తున్న వేళ ‘పంతులమ్మ’ అనే సినిమా రావడం విడ్డూరం కాదు. భార్య చనిపోగా, చిన్న పిల్లాడితో అవస్థలు పడుతున్న రంగనాథ్ దగ్గర పంతులమ్మ ఉద్యోగానికి వచ్చిన లక్ష్మి ఆ పిల్లాడికి తల్లిలా మారి గాడి తప్పిన ఆ ఇంటికి ఇల్లాలిగా కూడా మారే ఆ కథ పెద్ద హిట్ అయ్యింది. అయితే ‘పూజ’లో మేనమామ కూతురైన కన్నడ మంజులను పెళ్లి చేసుకుందామనుకున్న లెక్చరర్ రామకృష్ణ ఇష్టం లేని వాణిశ్రీని చేసుకుని ఆమెను భార్యగా స్వీకరించలేక క్షోభ పడటం, చివరకు ఆ జంట ఏకం కావడం ఆ వృత్తిలో ఉండేవారికి ఎదురయ్యే ‘పరీక్షాకాలం’గా జనం చూశారు. ఇదే సమయంలో వచ్చిన మరో ముఖ్యమైన సినిమా ‘బలిపీఠం’. ఇందులో కులమతాల వివక్ష దూరం కావాలని భావించే స్కూల్ టీచర్ శోభన్‌బాబు తనకంటే పైకులం స్త్రీ శారదను వివాహం ఆడి సంఘంలో ఎంతటి హెచ్చుతగ్గుల వ్యవస్థ ఉన్నదో తెలుసుకుంటాడు. యూనిఫామ్ వేసి పిల్లలందరినీ సమానం చేసే క్లాస్రూమ్ ఇంట్లో.. బజారులో ఎంత అసమానంగా ఉంటుందో ఈ సినిమాలో తెలుస్తుంది. అటు పిమ్మట వచ్చిన ‘విశ్వరూపం’ విద్యార్థి శక్తి తలుచుకుంటే సంఘ నిర్మాణం, దేశ నిర్మాణంలో ఎంత చురుకైన పాత్ర పోషించగలదో చూపించింది. అయితే అందుకు వారిని ఉత్తేజపరచగల గురువు అవసరం. అలాంటి గురువుగా ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో గొప్పగా కనిపిస్తారు. కానీ అన్ని సినిమాల్లోనూ ఎన్.టి.ఆర్లు ఉండరు. కొన్నింటిలో చంద్రమోహన్లు ఉంటారు. ‘మూడుముళ్లు’ సినిమాలో చంటిబిడ్డతో పల్లెటూళ్లో పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్ చంద్రమోహన్ అదే ఊళ్లో ఆకతాయిగా తిరుగుతున్న రాధిక మనసు దోచుకుంటాడు. చంద్రమోహన్ సంస్కారాన్ని చూసిన రాధిక ఎలాగైనా సరే అతణ్ణి పెళ్లి చేసుకొని అతని బిడ్డకు తల్లిలా మారాలనుకుంటుంది. ఆమెను అనేకసార్లు ఫెయిల్ చేసిన చంద్రమోహన్ చివరకు పాస్ చేసి అక్కున చేర్చుకుంటాడు. టి.కృష్ణ వచ్చాక సినిమాల్లో బాధ్యతతో ఉండాల్సిన టీచర్ల పాత్రలు ఎక్కువగా చూపించారు. ‘వందేమాతరం’లో స్కూల్ టీచర్‌గా రాజశేఖర్, ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ సినిమాల్లో టీచర్‌గా, లెక్చరర్‌గా విజయశాంతి ప్రేక్షకులను క్లాస్‌రూమ్‌లో కూర్చోబెట్టారు. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’... ప్రతి ప్రేక్షకుడు బాధ్యత ఉన్న టీచర్‌గా సంస్కరణకు దిగకపోతే భవిష్యత్తు అంధకార బంధురం అని చెప్పారు. ‘శుభలేఖ’లో సుమలత లెక్చరర్. సంతలో పశువును అమ్మినట్టు వరుణ్ణి అతడి తల్లిదండ్రులు అమ్మే వరకట్న దురాచారాన్ని నిర్మూలించడానికి ఆమె గళం ఎత్తుతుంది. కైకాల సత్యనారాయణను ఎదిరిస్తుంది. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకుంటుంది. అయితే ఏం... ఆఖరుకు చిరంజీవిలాంటి ఉత్తముణ్ణి భర్తగా పొందుతుంది. ఈ సినిమాలో కె.విశ్వనాథ్ మూడు విషయాలు చెప్పారు. స్త్రీలు బాగా చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. అమ్మకానికి అబ్బాయిని తెచ్చుకోకుండా ఆత్మగౌరవంతో పెళ్లి బంధంలోకి వెళ్లాలి. లెక్చరర్ పాత్రలు మాస్ హీరోలను కూడా ఆకట్టుకున్నాయి. అందుకే వెంకటేశ్ ‘సుందరకాండ’, చిరంజీవి ‘మాస్టర్’, బాలకృష్ణ ‘సింçహా’ చేశారు. స్టూడెంట్స్‌ను ‘యాంటీ కరెప్షన్ ఫోర్స్’గా మార్చి, అవినీతి అధికారులకు ఏకంగా మరణశిక్ష విధిస్తూ సంచలనం సృష్టించింది కేవలం ఒక ప్రొఫెసర్ అంటే అది ఆ వృత్తి గొప్పతనం అనుకోవాలి. ‘ఠాగూర్’ సినిమాలో చిరంజీవి ఈ పని చేస్తారు. అయితే ఉపాధ్యాయుడంటే విద్యార్థి బాగు మాత్రమే కోరేవాడు కాదు ఊరు బాగు కూడా కోరేవాడు అని రాజేంద్రప్రసాద్ ‘ఓనమాలు’ చెప్పింది. ఇందులో టీచరైన రాజేంద్రప్రసాద్ సొంత ఊరు వదిలిపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఊరికి రావాలని మాతృభూమికి సేవ చేయాలని పిలుపు ఇస్తారు. మార్గదర్శి లేని ఊరు దివిటీ లేని చీకటి దారి అని సందేశం ఇస్తారు. కొత్తతరం హీరోలు కూడా లెక్చరర్లుగా, ట్యూటర్లుగా కనపడటానికి వెనకాడటం లేదు. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ ఒక మంచి లెక్చరర్‌గా కనపడతాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి అబ్దుల్ కలామ్ నుంచి స్ఫూర్తి పొందేవారు ఎందరో ఉంటారు. వారు చెప్పిన మంచే ఒక హీరోనో హీరోయినో చెప్తే వెంటనే తాకే యువతరం శాతం ఎక్కువగా ఉంటుంది. స్టూడియోనే క్లాస్‌రూమ్‌గా కెమెరానే బ్లాక్‌బోర్డుగా సాగే ఈ స్ఫూర్తివంతమైన పాఠాలు కొనసాగాలని కోరుకుందాం. – కె. ‘మిస్సమ్మ’లో సావిత్రి ‘బడిపంతులు’లో ఎన్టీఆర్, అంజలి ‘సుందరకాండ’లో వెంకటేశ్, ‘ఓనమాలు’లో రాజేంద్రప్రసాద్, ‘విశ్వరూపం’లో ఎన్టీఆర్ విజయశాంతి శ్రీవిద్య, శోభన్‌బాబు ‘మూడు ముళ్లు’లో రాధిక, చంద్రమోహన్ ∙చంద్రమోహన్, విజయశాంతి, చరణ్‌రాజ్ ‘ఠాగూర్’లో చిరంజీవి, ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ -
బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్ చేసిన యాంకర్
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ సావిత్రి బిగ్‌బాస్-3లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సావిత్ర పోస్టు చేసిన ఓ వీడియోలో తాను బిగ్‌బాస్-3లో పాల్గొంటున్నట్టు క్లారిటీ ఇచ్చారని సమాచారం. అయితే, ప్రస్తుతం ఆ పోస్ట్‌ను సావిత్రి తొలగించినట్టు తెలుస్తోంది. ఓ టీవీ చానెల్లో ‘సావిత్రక్క’గా ఫేమస్ అయిన శివజ్యోతి బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. యాంకర్ సావిత్రి కంటెస్టెంట్స్ వీరేనా..! నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న బిగ్‌బాస్-3పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వందరోజులపాటు సాగనున్న బిగ్‌బాస్-3 షోలో మొత్తం 15మంది కంటెస్టెంట్స్ పాల్గొననున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్‌లో ఎవరెవరు ఉండబోతునన్నారన్న దానిపై అనేక రకాల కథనాలు మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం చూసుకుంటే.. ఈసారి షోలో సావిత్రితోపాటు ప్రముఖ యాంకర్ శ్రీముఖి, నటి హేమ, వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా షేరు, జర్నలిస్ట్ జాఫర్, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం, నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నది త్వరలోనే స్పష్టం కానుంది. ఇక, ఈ షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. -
మహానటికి సినీ సావిత్రి ధన్యవాదాలు
దివంగత మహానటి సావిత్రి కీర్తిని, ఆమె నటనను వర్ణించడానికి తెలుగు పదాలు చాలావనడం అతిశయోక్తి కాదేమో. ఆమె పేరు సినీ జగతిలో అజరామరం. ఇక ఇటీవల ఆమెలా మహానటి చిత్రంలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్ ఎంతగానో పేరు తెచ్చుకుంది. మహానటి కీర్తీసురేశ్ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. అందుకు కారణం మహానటి సావిత్రినే అవుతారు.అది గుర్తించిన కీర్తిసురేశ్ సావిత్రి జయంతిని పురస్కరించుకుని ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఒక లేఖను రాసి తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఎప్పుడూ గుర్తుంచుకునే మీ కోసం ఇది రాస్తున్నాను. మీరే మమ్మల్ని ఎంచుకున్నారు. మమ్మల్ని ప్రేమతోనూ, ఆశీర్వాదాలను అందించారు. మేమిక్కడ నిలబడడానికి, వ్యతిరేకతను అధిగమించడానికి, ఎల్లలు దాటడానికి, అన్నివిధాలా శక్తిని మీరే ఇచ్చారు. మేము పొందుతున్న అన్నిటికీ అర్హులమని భావించేలా చేశారు. మిమ్మల్ని నేను కూడా సంతోషపడేలా చేశానని భావిస్తున్నాను. మహానటి చిత్రంతో మిమ్మల్ని మళ్లీ ఈ లోకానికి తీసుకొచ్చి మీకు మేము న్యాయం చేశాం అని నమ్ముతున్నాను. మాకు చేతనైంది మేము చేశాం. అయితే మిమ్మల్ని మరిపించడం ఎవరి తరంకాదు. మీరు మా జీవితాలను మార్చేశారు. ధన్యవాదాలు సావిత్రి అమ్మా’ అని కీర్తీసురేశ్ ట్వీట్ చేశారు. -
మరోసారి ‘మహానటి’ పాత్రలో..!
అలనాటి అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో మహానటి పాత్రలో నటించిన కీర్తి సురేష్ నటనకు తెలుగు, తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యారు. తెర మీద సావిత్రినే చూస్తున్నట్టుగా ఉందంటూ కీర్తించారు. అయితే ఇలాంటి గోల్డెన్ చాన్స్ కీర్తికి మరోసారి దక్కింది. మహానటి పాత్రలో కీర్తి సురేష్ మరోసారి తెర మీద కనిపించనుందట. నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మరోసారి సావిత్రి పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే రానా, సుమంత్‌లు ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. -
మధురవాణి పాత్ర కోసం సమంత..!
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఈ సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి కథను నడిపించే కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత నటించారు. 80నాటి జర్నలిస్ట్‌గా మధురవాణి పాత్రలో సమంత నటించి తీరుకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ పాత్ర కోసం ఆమె చేసిన హోం వర్క్ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ మధురవాణి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. షూటింగ్ ప్రారంభానికి ముందు సమంత చేసిన లుక్ టెస్ట్‌తో పాటు షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ను కూడా ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. -
‘మహానటి’కి కౌంటర్
ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహానటి సినిమాతో ఈ ట్రెండ్ దక్షిణాదిలోనూ ఊపందుకుంది. తాజాగా మరో బయోపిక్ తెరమీదకు రానుంది. అయితే ఆ బయోపిక్ మహానటి కి కౌంటర్‌గా తెరకెక్కుతుండటం విశేషం. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రను తప్పుగా చూపించారని ఆయన కూతురు డాక్టర్ కమల ఆరోపిస్తున్నారు. తన తండ్రి అవకాశాలు రాక సావిత్రి వేదించినట్టుగా తాగుబోతుగా చూపించారని అది నిజం కాదని ఆమో వాదిస్తున్నారు. అంతేకాదు త్వరలో జెమినీ గణేషన్ కథతో ఓ డాక్యుమెంటరినీ రూపొందిస్తున్నట్టుగా కమల వెల్లడించారు. మహానటి వివాదం తెర మీదకు వచ్చిన తరువాత జర్నలిస్ట్ అనుపమా సుబ్రమణియంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మహానటిలో కేవలం ఒక వైపు నుంచి మాత్రమే చూపించారని అందుకే తన తండ్రి అసలు ఎలాంటి వారో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టుగా తెలిపారు. గంటా నలబై నిమిషాల నిడివితో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీని చెన్నైతో పాటు హైదరబాద్‌లోనూ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని వెల్లడించారు. -
‘మహానటి’ ఖాతాలో మరో రికార్డ్
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. తొలి షో నుంచే సూపర్ హిట్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓవర్ సీస్లో కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటిపై వసూళ్ల వర్షం కురుస్తోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి ఓవర్ సీస్లో ఇప్పటి వరకు రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘మహానటి’ డిలీటెడ్ సీన్.. వైరల్
అలనాటి ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కి విజయం సాధించిన మూవీ మహానటి. ఇటీవల విడుదలైన ‘మహానటి’లో నటనకుగానూ కీర్తి సురేష్‌కు నటిగా మంచి మార్కులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది ‘మహానటి’. అయితే డిలీటెడ్ సీన్ అని క్యాప్షన్‌తో ఓ వీడియో క్లిప్ పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియదర్శిని పేటిక ముందు కీర్తి సురేష్ మాట్లాడిన క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటివి నిజంగా ఉంటే బాగుండు.. వేరే షూటింగ్లో ఉన్న మా ఆయనతో ఎంచక్కా మాట్లాడుకోవచ్చునంటూ కీర్తి చెప్పడం వీడియోలో వీక్షించవచ్చు. విదేశాల్లోనూ మహానటి మూవీ మంచి వసూళ్లు సాధిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా బ్యానర్లపై సీనియర్ నిర్మాత అశ్వనిదత్, ఆయన కుమార్తెలు స్వప్నాదత్, ప్రియాంకదత్‌లు ఈ సినిమాను నిర్మించారు. -
ఓవర్సీస్లో ‘మహానటి’కి బ్రహ్మరథం
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అదే స్థాయిలో వసూళ్లు కూడా సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి చిత్రం ఓవర్ సీస్లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే అమెరికాలో మిలియన్ డాలర్ (ఆరు కోట్ల రూపాయల) మార్క్‌ను దాటిన మహానటి సినిమా ఇతర ప్రాంతాల్లో కూడా అదే జోరు చూపిస్తోంది. మహానటి ఓవర్ సీస్ కలెక్షన్ల వివరాలు ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా ఆస్ట్రేలియాలో 1,25,900 డాలర్లు (64.03 లక్షల రూపాయలు), యూకేలో 28,373 పౌండ్లు (25.90 లక్షల రూపాయలు), న్యూజీలాండ్‌లో 9,899 డాలర్లు ( 4.65 లక్షల రూపాయల) వసూళ్లు సాధించినట్టుగా వెల్లడించారు. కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా బ్యానర్లపై సీనియర్ నిర్మాత అశ్వనిదత్, ఆయన కుమార్తెలు స్వప్నాదత్, ప్రియాంకదత్‌లు ఈ సినిమాను నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాను అన్ని చోట్లా సూపర్ హిట్ రావటంతో వసూళ్ల పరంగా కూడా మహానటి చిత్రం సత్తా చాటుతోంది. -
భరత్, సూర్యలను మించిన ‘మహానటి’
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్, సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమా రేపు (మే 9న) విడుదలవుతోంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిడివి ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా మూడు గంటల నిడివితో మహానటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన మహేష్ బాబు భరత్ అనే నేను 2 గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ నా పేరు సూర్య 2 గంటల 48 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాల కన్నా మహానటి నిడివి ఎక్కువగా ఉండనుంది. 2 గంటల 56 నిమిషాల నిడివితో మహానటి విడుదలకు రెడీ అయ్యింది. రామ్ చరణ్ రంగస్థలం మాత్రం మహానటి కన్నా ఎక్కువ నిడివితో 2 గంటల 59 నిమిషాల రన్‌టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాల విషయంలో సినిమా లెంగ్త్‌పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. మరి మహానటి అలాంటి కామెంట్స్ లేకుండా అలరిస్తుందేమో చూడాలి. -
మహేష్ తరువాత ‘మహానటి’ కోసం..!
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తీ సురేష్, సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ టీజర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. తాజాగా చిత్రయూనిట్ ఆడియో రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రోజు(మంగళవారం) జరగనున్న ఆడియో వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. వైజయంతి మూవీస్ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎన్టీఆర్ మహానటి ఆడియో రిలీజ్‌కు హాజరయ్యేందుకు అంగీకరించారు. మిక్కి జే మేయర్ సంగీతమందించిన ఈ సినిమాలో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. -
‘ఆ పాత్ర దక్కటం నా అదృష్టం’
తమిళసినిమా: సావిత్రి పాత్రలో నటించాలా వద్దా అని ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు తలెత్తాయని నటి కీర్తీసురేశ్ పేర్కొన్నారు. మహానటి సావిత్రి జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నాగ్అశ్విన్ దర్శకుడు. తమిళంలో నడిగైయార్ తిలగం, తెలుగులో మహానటి పేరుతో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్ నటించగా జెమినీగణేశన్‌గా మలయాళ నటుడు దుల్కర్సల్మాన్ నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ క్రేజీ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకుల సమావేశంలో పాల్గొన్న నటి కీర్తీసురేశ్ మాట్లాడుతూ సావిత్రి పాత్రలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం చాలా మంచి చిత్రాలు చేస్తున్నా, అలాంటి సమయంలో మహానటి సావిత్రి జీవిత చరిత్రలో ఎలా నటించేది? ఆమె జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం. అలాంటి పాత్రలో నటించడం సాధ్యమా లాంటి పలు సందేహాల మధ్య దర్శకుడు నాగ్అశ్విన్, నిర్మాతల నమ్మకమే ఈ చిత్రంలో తనను నటించేలా చేసింది. తొడరి తెచ్చిన అవకాశం తాను నటించిన తొడరి చిత్రం ఏదో ఒక రకంగా తనకు మంచి చేస్తుందని భావించాను. తొడరి చిత్రం చూసే దర్శకుడు నాగ్అశ్విన్ సావిత్రి జీవిత చరిత్రలో నటింపజేయాలని భావించినట్లు చెప్పడంతో తొడరి చిత్రంపై తన నమ్మకం నిజమైందన్నారు. యూనిట్ సమష్టి కృషితోనే.. నగిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్ర యూనిట్ సమష్టి కృషి, శ్రమకు చిహ్నం అన్నారు. సావిత్రి లాంటి గొప్ప నటిగా నటించడానికి తాను ఆమె నటించిన పలు చిత్రాలు చూశానని, నిజజీవితంలో సావిత్రి గురించి ఆమె కూతురు చాముండేశ్వరిని అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న గీతరచయిత మదన్‌కార్గీ మాట్లాడుతూ కీర్తీసురేశ్, సావిత్రిగా నటించనున్నారన్న వార్త వెలువడగానే సావిత్రి పాత్రకు పట్టిన గతి అని పలువురు విమర్శించారన్నారు. తానీ చిత్రంలోని పలు సన్నివేశాలను చూశానని కీర్తీసురేశ్, సావిత్రిగా మారిపోయారని అన్నారు. ప్రతి సన్నివేశంలోనూ కీర్తీసురేశ్ సావిత్రిలా పరకాయప్రవేశం చేశారని తెలిపారు. నటి సావిత్రి గురించి తెలియని ఈ తరం ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్నారు. సావిత్రి బాల్యం నుంచి, చివరి జీవితం వరకూ ఆవిష్కరించే చిత్రంగా నడిగైయార్ తిలగం ఉంటుందన్నారు. చిత్ర సమర్పకుడు సీ.అశ్వినీదత్ మాట్లాడుతూ తాను ఎన్టీ.రామారావు, చిరంజీవి వంటి ప్రముఖ నటులతో 43 చిత్రాలు నిర్మించానని అయితే ఈ మహానటి సావిత్రి జీవిత చరిత్రతో నిర్మించిన చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. -
సావిత్రి ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?
త్వరలో సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సావిత్రికి సంబంధించిన పలు పాత ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిలో ఓ ఫొటో హాట్ టాపిక్‌గా మారింది. వెలుగు నీడలు సినిమాలో సావిత్రి ఓ పిల్లాడిని ఎత్తుకున్న ఫొటో అది. అక్కినేని నాగార్జున అభిమాని గౌతమ్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫొటోతొ పాటు ‘నాగార్జున గారు సావిత్రిగారితో మీరు కలిసి నటించారు’ అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన నాగ్.. గౌతమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలనాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయిన నాగ్, అంతుకు ముందే బాలనటుడిగా తెరమీద కనిపించారు. Thx Goutham for reminding me👍that was the movie veluguneedalu!!🙏 https://t.co/vcdjJeJMEj — Nagarjuna Akkineni (@iamnagarjuna) 17 April 2018 -
మహానటి టీజర్ వచ్చేసింది..
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నటి సావిత్రి బయోపిక్ 'మహానటి'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మహానటి యూనిట్ విడుదల చేసింది. సావిత్రి జీవితంలోని ఏ అంశాలను టీజర్లో చూపించారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్లో కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు చూస్తే మూవీపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కీర్తి సురేష్ లెజండరీ కథానాయకి, మహానటి సావిత్ర పాత్రలో ఒదిగిపోయారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మూవీ ప్రోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతున్నాయి. -
మహానటి టీజర్ విడుదల..
-
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మహానటి’
కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా మహానటి. లెజండరీ కథానాయకి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలుసంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బుధవారం సెట్లో గుమ్మడికాయ కొట్టి షూటింగ్ పనులు ముగించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ.. ‘మా టెక్నికల్ టీమ్ ఎంతో నేర్పుతో క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. ఏ విషయంలోనూ రాజీపడకుండా ‘మహానటి’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీర్తి సురేష్, సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారితో కలిసి మా బ్యానర్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏయన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు ఎప్పటికీ ఋణపడి ఉంటాం. మాకోక స్ట్రాంగ్ సపోర్ట్ గా మోహన్ బాబుగారు, రాజేంద్రప్రసాద్ గారు నిలబడ్డారు. వారితో కలిసి పనిచేసిన ప్రతి నిమిషం మాకు అపురూపమైనది. ఆఖరి రోజున ఆఖరి సన్నివేశం చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుమ్మడికాయ పూజలో భాగంగా సావిత్రిగారి పటం వద్ద ప్రతిమ వెలిగిస్తున్న తరుణంలో కనీరు పెట్టుకొంది. మే 9న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది’ అన్నారు. -
‘మహానటి’ వాయిదా..!
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్ మహానటి. అలనాటి అందాల తార సావిత్రి జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేష్ గా కనిపించనున్నాడు. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, సమంత లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య ఏఎన్నార్‌గా నటించేందుకు అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ముందుగా మార్చి 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే ఇంకా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.