సీతంపేట, న్యూస్‌లైన్: ఐటీడీఏ ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు వెయ్యిమంది గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.సునీల్‌రాజ్‌కుమార్ తెలిపారు. స్థానిక పీఎంఆర్‌సీలో సోమవారం జరిగిన జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు. మొత్తం 2,750 మంది గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు వెల్లడించారు. యువకులకు వివిధ రకాల శిక్షణలు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చె ప్పారు. ఉద్యోగాలు పొందినవారు ఆయా రంగాల్లో రాణించాలని కోరారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు మాట్లాడుతూ గిరిజన అభ్యర్థులు ఉద్యోగాలు కావాలని గతంలో వివిధ కంపెనీల వద్దకు వెళ్లేవారని, ఇప్పుడు ఆ అవసరం లేదని, మీ వద్దకే కంపెనీలు వచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాయన్నారు. ప్రైవేటు కంపెనీల్లో కష్టపడి పనిచేస్తే మంచి జీతాలు వస్తాయన్నారు.
జాబ్ మేళాకు 432 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో 361 మంది ఉపాధి శిక్షణకు, మిగిలిన వారు నేరుగా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీడీ సావిత్రి, జేడీఎం శ్రీనివాసరావు, డీపీఎం సత్యంనాయుడు, ఏపీఎం రమేష్, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
వెయ్యి మందికి ఉపాధి కల్పన
Published Tue, Oct 29 2013 6:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement
Advertisement