
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తోంది. అప్పటి సినీ దిగ్గజాల పాత్రల కోసం ఈ జనరేషన్ లోని నటులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారిని ఫైనల్ చేయగా దర్శకుల పాత్రలకు క్రిష్, తరుణ్ భాస్కర్ లను తీసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఓ యువ నటుడు చేరాడు. చాలా రోజులుగా సంచలన హీరో విజయ్ దేవరకొండ మహానటిలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా, ఏ పాత్రలో కనిపించనున్నాడో వెల్లడించలేదు.
తాజాగా సమాచారం ప్రకారం విజయ్, అలానాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో నటించనున్నాడట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా ఎవరు కనిపించినున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అశ్వనిదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment