మహానటి సావిత్రి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. నటనకే నటనను నేర్పిన సహజ నటి. పాత్రలకే ప్రాణం పోసిన మహానటి ఆమె. అందుకే తరాలు మారినా ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం. తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే. చలన చిత్ర రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. హీరోయిన్‌గా కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కన్నుమూశారు.
చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా?
తన జీవితం ఎందుకు అలా అయ్యిందనేది ఇప్పటికీ ఆశ్యర్యంగానే ఉంటుంది. ఇక మహానటి సినిమా తర్వాత సావిత్రి గురించిన పలు ఆసక్తికర విషయాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరీ తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహానటి మూవీ తర్వాత ఇంట్లో చాలా గొడవలు అయ్యాయంటూ షాకింగ్ విషయం చెప్పారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ.. మహానటి చిత్రం తర్వాత నాన్నపై చాలా విమర్శలు వచ్చాయి.
నాన్న వల్లే అమ్మ జీవితం ఇలా అయ్యిందని అందరు తిడుతూ కామెంట్స్ చేశారు. అవి చూసి అక్కవాళ్లు(జెమిని గణేషన్ మొదటి భార్య పిల్లలు) ‘నీ వల్లే నాన్న పేరు చెడింది’ అని నన్ను తిట్టారు. నాతో మాట్లాడటం కూడా మానేశారు’ అని చెప్పారు. అయితే ఇప్పుడు అంతా సర్దుకుందని, మూడేళ్ల తర్వాత కలిశామని ఆమె పేర్కొన్నారు. రీసెంట్‌గా ఓ ఫంక్షన్‌లో అందరం కలిశామని, అప్పుడు నన్ను హగ్ చేసుకుని ‘ఎలా ఉన్నావు’ అని అక్కవాళ్లు పలకరించారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈ గొడవలపై బాలీవుడ్ నటి, జెమిని గణేషన్ మూడో భార్య కూతురు రేఖ సైతం ఫోన్ చేశారట .
చదవండి: మహేశ్ సినిమాకు హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నా: రాజమౌళి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బయోపిక్‌లో ఉన్నది ఉన్నట్లు చూపించడం సాధ్యం కాదని, ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేందుకు కొంచెం మాసాల యాడ్ చేస్తారని రేఖ అక్క అన్నారని చెప్పారు. ఇవేవి పట్టించుకోవద్దని, కొద్ది రోజులకు వాళ్లకే అర్థం అవుతుందిలే అని రేఖ అక్క ఫోన్లో ఓదార్చారని విజయ చాముండిశ్వరి చెప్పుకొచ్చారు. కాగా సావిత్రి, జెమిని గణేషన్‌కు రెండో భార్య అనే విషయం తెలిసిందే. సావిత్రిని పెళ్లి చేసుకునే సమయానికి అప్పటికే జెమిని గణేషన్‌కు పెళ్లయి, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆయన మొదటి భార్య, పిల్లలతో సావిత్రికి సత్సంబంధాలు ఉండేవి. అందరు ఒక్క కుటుంబంలా ఉండేవారని మహానటిలో చూపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment