Mahanati Savitri
-
తెలుగు తెరపై చెరిగిపోని జ్ఞాపకం మహానటి 'సావిత్రి' (ఫోటోలు)
-
సావిత్రి గారి కూతురు ఒక మాట అన్నారు..!
-
కనీసం ఆ పిల్లల కోసమైనా మద్యం తాగడం మానేయ్ అని కోపడ్డాను..
-
‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు
మహానటి సావిత్రి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. నటనకే నటనను నేర్పిన సహజ నటి. పాత్రలకే ప్రాణం పోసిన మహానటి ఆమె. అందుకే తరాలు మారినా ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం. తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే. చలన చిత్ర రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. హీరోయిన్గా కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కన్నుమూశారు. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? తన జీవితం ఎందుకు అలా అయ్యిందనేది ఇప్పటికీ ఆశ్యర్యంగానే ఉంటుంది. ఇక మహానటి సినిమా తర్వాత సావిత్రి గురించిన పలు ఆసక్తికర విషయాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరీ తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహానటి మూవీ తర్వాత ఇంట్లో చాలా గొడవలు అయ్యాయంటూ షాకింగ్ విషయం చెప్పారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ.. మహానటి చిత్రం తర్వాత నాన్నపై చాలా విమర్శలు వచ్చాయి. నాన్న వల్లే అమ్మ జీవితం ఇలా అయ్యిందని అందరు తిడుతూ కామెంట్స్ చేశారు. అవి చూసి అక్కవాళ్లు(జెమిని గణేషన్ మొదటి భార్య పిల్లలు) ‘నీ వల్లే నాన్న పేరు చెడింది’ అని నన్ను తిట్టారు. నాతో మాట్లాడటం కూడా మానేశారు’ అని చెప్పారు. అయితే ఇప్పుడు అంతా సర్దుకుందని, మూడేళ్ల తర్వాత కలిశామని ఆమె పేర్కొన్నారు. రీసెంట్గా ఓ ఫంక్షన్లో అందరం కలిశామని, అప్పుడు నన్ను హగ్ చేసుకుని ‘ఎలా ఉన్నావు’ అని అక్కవాళ్లు పలకరించారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈ గొడవలపై బాలీవుడ్ నటి, జెమిని గణేషన్ మూడో భార్య కూతురు రేఖ సైతం ఫోన్ చేశారట . చదవండి: మహేశ్ సినిమాకు హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నా: రాజమౌళి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బయోపిక్‌లో ఉన్నది ఉన్నట్లు చూపించడం సాధ్యం కాదని, ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేందుకు కొంచెం మాసాల యాడ్ చేస్తారని రేఖ అక్క అన్నారని చెప్పారు. ఇవేవి పట్టించుకోవద్దని, కొద్ది రోజులకు వాళ్లకే అర్థం అవుతుందిలే అని రేఖ అక్క ఫోన్లో ఓదార్చారని విజయ చాముండిశ్వరి చెప్పుకొచ్చారు. కాగా సావిత్రి, జెమిని గణేషన్‌కు రెండో భార్య అనే విషయం తెలిసిందే. సావిత్రిని పెళ్లి చేసుకునే సమయానికి అప్పటికే జెమిని గణేషన్‌కు పెళ్లయి, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆయన మొదటి భార్య, పిల్లలతో సావిత్రికి సత్సంబంధాలు ఉండేవి. అందరు ఒక్క కుటుంబంలా ఉండేవారని మహానటిలో చూపించిన సంగతి తెలిసిందే. -
మహానటి.. దాతృత్వ దివిటీ
రేపల్లె రూరల్ (గుంటూరు): ఆమె వెండి తెర సామ్రాజ్ఞి.. నిజ జీవితంలో మహా దాతృత్వం ఉన్న మహా మనీషి. తమిళ సీమలోనూ ‘నడిగర్ తిలగమ్’ (మహానటి) బిరుదాంకితురాలైన ఆమె దానధర్మాలు చేయటంలో చేతికి ఎముక లేదనే కీర్తి గడించారు. ఆమె పేరు వింటేనే గుంటూరు జిల్లా తీరం పులకించిపోతుంది. తీరంలోని కుగ్రామమైన వడ్డివారిపాలెం ఆమె తలంపు వస్తేనే మైమరచిపోతుంది. ‘గొప్ప వాళ్లను గౌరవించాలి.. గొప్పవాళ్లు సైతం సావిత్రమ్మను గౌరవించాలి’ అనేంత ఖ్యాతిని మాత్రమే చివరికి మిగుల్చుకున్న మహానటి సావిత్రి అడుగు జాడలు, ఆమె జ్ఞాపకాలు గుంటూరు జిల్లాలో నేటికీ సజీవమే. పేదరికంలో పుట్టి.. పేదరికంలోనే పెరిగి.. అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్న సావిత్రిని.. సాటి వారికి సాయం చేయడంలోనే సంతృప్తి, పరమార్థం ఉందని గ్రహించిన మహావ్యక్తిగా ఇక్కడి వారు కొలుస్తారు. గుంటూరు తీరంతో అనుబంధం సావిత్రి తల్లి సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గాంబలది వడ్డివారిపాలెం గ్రామమే. తల్లి సుభద్రమ్మకు తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామానికి చెందిన నిశ్శంకర గురవయ్యతో వివాహమైంది. పెద్దమ్మ దుర్గాంబకు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరితో వివాహమైంది. వడ్డివారిపాలెం గ్రామంలో పాఠశాల లేకపోవటంతో పెద్దమ్మ దుర్గాంబ కోరికతో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సావిత్రి గ్రామంలో స్థలాన్ని కొనుగోలు చేసి.. రూ.25 వేలు విరాళంగా ఇచ్చి.. 1962లో పాఠశాలను నెలకొల్పారు. పాఠశాల అభివృద్ధికి అనేక పర్యాయాలు సహకారం అందించారు. ఆ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందిన తరువాత కొన్ని కారణాల వల్ల ఉపాధ్యాయులకు వేతనాలు అందడంలో ఆలస్యం జరుగుతుండేది. దీనివల్ల ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. 1975లో ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాకపోవటంతో ఆరు నెలలైనా ఉపాధ్యాయులకు జీతాలు అందని పరిస్థితులు నెలకొనగా.. సావిత్రి రూ.1,04,000 చెక్కు పంపించారు. అప్పట్లో రూ.1,04,000 అంటే ఇప్పుడు దాని విలువ రూ.కోటికి పైనే ఉంటుంది. ఇలా ఎన్నోసార్లు ఉపాధ్యాయులకు సావిత్రి చేసిన మేలు, పాఠశాల అభివృద్ధికి అందించిన విరాళాలు విద్యారంగంపై ఆమెకు ఉన్న మక్కువకు నిదర్శనాలు. అదే సంకల్పంతో ముందుకు.. ఏ సంకల్పంతో సావిత్రి పాఠశాలను స్థాపించారో.. ఆ సంకల్పం దిశగానే శ్రీమతి సావిత్రి జెమినీ గణేశన్ హైసూ్కల్ పరుగులు పెడుతోంది. ఉపాధ్యాయుల కృషితో పదేళ్లుగా ఈ పాఠశాల నూరు శాతం ఫలితాలు సాధిస్తోంది. తైక్వాండో, షటిల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. ఈ పాఠశాలలో చదివిన వారెందరో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ‘మహానటి’ చిత్ర నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ పాఠశాలను సందర్శించి.. ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేశారు. దీనిని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించారు. నాడు–నేడు పనులతో మరింత అభివృద్ధి శ్రీమతి సావిత్రి గణేశన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇటీవల నాడు–నేడు కార్యక్రమానికి ఎంపికైంది. పాఠశాల అభివృద్ధికి రూ.42 లక్షల నిధులు మంజూరు కాగా.. తరగతి గదుల మరమ్మతులు, విద్యుదీకరణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి ఏర్పాటు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాణ్యమైన విద్య అందిస్తున్నాం మహానటి సావిత్రి దాతృత్వంతో ఏర్పాటైన పాఠశాలలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఉపాధ్యాయులంతా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తోంది. – మట్టా జ్యోత్స్న, హెచ్ఎం -
మహానటి తీసినందుకు గర్వంగా ఉంది
‘‘మహానటి’ సినిమాను జనాలు వచ్చి చూస్తారని ఆశించాం. నేను ఏదైతే అనుకున్నానో ఆడియన్స్ అదే ఫీల్ అవుతున్నారు. డైరెక్టర్‌గా నాకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. వెనక ఉండి మా సినిమాను నడిపించిన అందరికీ థ్యాంక్స్’’ అని నాగ్ అశ్విన్ అన్నారు. కీర్తీ సురేశ్ లీడ్ రోల్లో నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు. స్వప్న దత్ మాట్లాడుతూ– ‘‘మహానటి’ సినిమా మూడో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రేక్షకుల ప్రేమ చూస్తే ఇంకా మంచి సినిమాలు తీయాలనే ఆలోచన వస్తోంది. రాజేంద్రప్రసాద్, నాగచైతన్య.. ఇలా ప్రతి ఒక్కరూ మా సినిమా చేసినందుకు ధన్యవాదాలు’’ అన్నారు.‘‘మహానటి’ సినిమా మా బాధ్యత పెంచింది. సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంక దత్.‘‘సావిత్రిగారి లైఫ్ చూసి నేను షాక్ అయ్యాను. ‘మహానటి’ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి’’ అన్నారు నటుడు విజయ్ దేవరకొండ. ‘‘నాగి, స్వప్న, ప్రియాంక నాకు అందించిన సహకారం మరువలేనిది. నటీనటులు, టెక్నీషియన్స్ కష్టం వల్లే సినిమా విజయం సాధించింది. ఈ సక్సెస్ నేను మర్చిపోలేను’’ అన్నారు కీర్తీ సురేశ్. రచయిత బుర్రా సాయిమాధవ్ పాల్గొన్నారు. -
సోదరి అభ్యంతరాలపై స్పందించిన సావిత్రి కూతురు
‘మహానటి’ విషయంలో జెమిని గణేశన్ కూతురు డాక్టర్ కమల సెల్వరాజ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రిని తక్కువ చేసి చూపించారని, ఇంకా ‘మహానటి’ టీంపై ఆమె పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి స్పందించారు. ‘‘నా దృక్కోణంలో.. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కోణంలో ‘మహానటి’ సినిమా చూశా. నా సోదరి కమల మరో కోణంలో సినిమా చూశారు. ఆమె స్వతహాగా తమిళురాలు. ‘మహానటి’ని ఒక తెలుగు డబ్బింగ్ సినిమాలాగే చూసిందామె. మా అమ్మను నాన్న అమితంగా ప్రేమించిన మాట వాస్తవం. నాకు కమల అక్కకు మధ్య ఈ సినిమా వల్ల విభేదాలు రావాలని నేను కోరుకోవట్లేదు’’ అని చాముండేశ్వరి అన్నారు. ఆ కుటుంబాన్ని దూరం చేసుకోలేను.. తన తల్లి సావిత్రికి తండ్రే మద్యం అలవాటు చేశాడన్నది నిజం కాదని.. సినీ పరిశ్రమలో మద్యం తాగడం మామూలు విషయమని.. అలా తన తల్లికి కూడా అలవాటై ఉండొచ్చని.. ఐతే సినిమాలో తన తండ్రి తాగినపుడే తల్లి కూడా మద్యం తాగినట్లు చూపిస్తారని.. అలాగే ఆమె అలా తాగడం అదే తొలిసారని కూడా చెప్పలేదనే విషయాన్ని చాముండేశ్వరి గుర్తు చేశారు. తన తండ్రి నుంచి తనకు దక్కిన అతి పెద్ద ఆస్తి తన పెద్దమ్మ కుటుంబమే అని.. తన అక్కలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేనన్నారు.. సినిమాలో అలిమేలుగా చూపించిన తన పెద్దమ్మ (బాబ్జీమా) తమకెంతగానో అండగా నిలిచిందని.. తన తండ్రి కుటుంబం మీద తనకు అపారమైన గౌరవం ఉందని.. అది కూడా తన కుటుంబమే అని చాముండేశ్వరి పేర్కొన్నారు. -
కమల సెల్వరాజ్ వ్యాక్యలకుపై స్పందించిన సావిత్రి కూతురు
-
జెమినీ గణేశన్ కుమార్తెల కలయిక
చెన్నై : నటుడు జెమినీ గణేశన్ కుమార్తెలు అందరూ కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విశేష ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్‌ను వాస్తవాలకు భిన్నంగా చూపించారని ఆయన కుమార్తెల్లో ఒకరైన కమలా సెల్వరాజ్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తన తండ్రిపై ఓ డాక్యుమెంటరీని నిర్మించనున్నట్లు ప్రకటన చేశారు. కాగా జెమినీ గణేశన్‌కు అలిమేలు, పుష్పవల్లి, సావిత్రి, జూలియాను వివాహం చేసుకున్న విషయం విదితమే. జెమినీ గణేశన్‌కు ఏడుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇక డాక్టర్ జయ శ్రీధర్, డాక్టర్ రేవితి స్వామినాధన్, డాక్టర్ కమలా సెల్వరాజ్, నారాయణి గణేశన్ మొదటి భార్య అలిమేలు కుమార్తెలు. ఇక బాలీవుడ్ నటి రేఖ, రాధా సయ్యద్ ...పుష్పవల్లి కుమార్తెలు కాగా వీరిలో మూడో భార్య సావిత్రి. ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీష్. వీరంతా ఒక్క తల్లి బిడ్డలు కాకపోయినా అందరూ అక్కాచెల్లెళ్లుగా ప్రేమాభిమానాలు కురిపించుకుంటారు. ప్రతి ఏడాది ఒక వేడుకలా అందరూ కలుసుకుంటారు. అలాంటి ఒక కలయిక శుక్రవారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. ఒకే వేదికపై జెమినీ గణేశన్ ఏడుగురు కుమార్తెలు కలిసి ఉన్న చిత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహానటి’
లెజెండరీ నటి, తెలుగు వాళ్లు గర్వించదగ్గ నటి మహానటి సావిత్రి. అలాంటి నటిపై వస్తున్న సినిమా ‘మహానటి’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా... ఒక్క సన్నివేశం కూడా అభ్యంతర కరంగా లేవని సెన్సార్ వాళ్లు... క్లీన్ యూ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలు ట్విటర్ ద్వారా తెలిపారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్, లుక్స్, మోషన్ పోస్టర్స్,సాంగ్స్ ప్రేక్షకులకు చేరువయ్యాయి. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్, జెమినీ గణేషన్‌గా దుల్కర్సల్మాన్ నటించిన విషయం తెలిసిందే. ఇతర కీలక పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ నటించారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చగా, వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. -
‘మహానటి’ మోషన్ పోస్టర్ విడుదల
-
‘మహానటి’ మోషన్ పోస్టర్ విడుదల
మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. టైటిల్ రోల్లో కీర్తి సురేశ్ నటించగా, ముఖ్య పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్ర యూనిట్. రెండ్రోజుల క్రితమే విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా తాజాగా సమంత, విజయ్‌లతో కూడిన ఒక మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మధురవాణీగా సమంత, విజయ్ ఆంటోనిగా విజయ్ దేవరకొండలు నటిస్తున్నారని తెలిసిందే. నిజం ఎప్పుడు అందంగానే ఉంటుంది మధురవాణి గారు అంటూ వచ్చిన పోస్టర్లో ఏ విషయం గురించో ఇద్దరు మాట్లాడుకుంటున్నారని తెలిసిపోయింది. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్లో విజయ్ పాత కెమెరాను పట్టుకుని, నవ్వుకుంటూ సమంతతో ఏదో మాట్లాడుతుండగా...సమంత మాత్రం తీక్షణంగా ఏదో పుస్తకాన్ని చదువుకుంటూ వింటున్నట్లు కనపడుతుంది. అసలు వీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రేపు (ఏప్రిల్ 14న) టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృంధం తెలిపింది. మే 9న మహానటి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. #VijayAntony and #Madhuravani are all set to bring you the greatest story ever told of the greatest actress that ever lived - #Mahanati #మహానటి #MahanatiTeaserOnApril14thhttps://t.co/cpJkEmHjnU@TheDeverakonda @Samanthaprabhu2 — Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 12, 2018 -
‘ఎందుకమ్మా అలా చేసుకున్నావ్ అని అడగాలని ఉంది’
సమయం లేదు మిత్రమా... శరణమా..? రణమా..?’ ఇప్పుడు చిన్నాపెద్దా తేడా లేకుండా అందని నోటి నుంచి వెలువడుతున్న డైలాగ్ ఇది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలోని ఈ డైలాగ్ సాయిమాధవ్ బుర్రా కలం నుంచి వెలువడింది. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ నుంచి ఇటీవలి ‘ఖైదీ నంబర్ 150’ వరకు ఎన్నో విలక్షణ సినిమాలకు ఆయన రాసిన సంభాషణలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ‘మహానటి’ సినిమాకు ఆయనే సంభాషణలు సమకూరుస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మహానటి సావిత్రి జీవిత చరిత్రపై రూపొందుతున్న ఈ సినిమాకు పనిచేయటం గొప్ప అవకాశంగా ఆ మాటల రచయిత భావిస్తున్నారు. తెనాలిలో జరుగుతున్న సురభి నాటకోత్సవాలకు వచ్చిన సాయిమాధవ్ ‘సాక్షి’తో ఆ విశేషాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలోనే బిగ్ కాస్టింగ్... సావిత్రి జీవిత చరిత్రపై ‘మహానటి’ టైటిల్‌తో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. నాగ్ అశ్విన్ దర్శకుడు. చాలా మంది కన్నా భిన్నమైన దర్శకుడు. ఆలోచనా విధానం గొప్పగా ఉంది. ఏదో సినిమా తీసేద్దాం... గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుందాం అనుకునే తొందర ఆయనలో కనపడదు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తోనే ఆ విషయం అర్థమైంది. సావిత్రి పెదనాన్నగా రాజేంద్రప్రసాద్, విజయా వారి నిర్మాత, రచయిత చక్రపాణిగా ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు. ఎన్టీయార్, ఏఎన్నార్ పాత్రలకు కూడా ఫైనలైతే ఇండస్ట్రీలోనే బిగ్ కాస్టింగ్ అవుతుంది. చాలా ఎక్స్ట్రార్డినరీ సినిమా ఇది. మాటలు రాస్తుంటే కన్నీళ్లొచ్చాయి... సావిత్రి, చక్రపాణి, ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, జమున, భానుమతి...ఇలా ఇండస్ట్రీలో ఒకనాటి ప్రముఖుల పాత్రలకు మాటలు రాసే అవకాశం ‘మహానటి’తో లభించడం నా అదృష్టం. ఆ రోజుల్లోకి వెళ్లిపోవడం, రాయడం... గొప్పగా ఉంది. కొన్ని మాటలు రాస్తుంటే కన్నీళ్లు వచ్చేశాయి నాకు. చాలాసార్లు ఆ కన్నీళ్లు రాసే పేపరుపై పడ్డాయి. చిన్నప్పట్నుంచీ పాత సినిమాలు విపరీతంగా చూసేవాడ్ని, వెండితెరపై ప్రకాశించిన తారామణుల గురించి కథలుగా విన్నవాణ్ణి కావటం ప్లస్సయింది. ఇప్పటికీ ఆ సినిమా టాపిక్ వస్తే చాలు... రాసేటప్పటి నా అనుభూతులన్నీ మనసునిండా పరుచుకుంటున్నాయి. సావిత్రి జీవితం ‘పరిపూర్ణం...!’ జీవితంలో రకరకాల సంఘర్షణలు పడిన మహిళలు, సెలబ్రిటీలున్నారు. సినిమా చరిత్రలో భగవంతుడిచ్చిన ప్రతి ఎమోషన్‌నీ సంపూర్ణంగా అనుభవించిన ఏకైక వ్యక్తి సావిత్రి. ప్రేమిస్తే పూర్తిగా ప్రేమించడం, మోసపోతే పూర్తిగా మోసపోవడం, అసహ్యించుకున్నా, అమాయకంగా నమ్మినా అదేరీతి. అలవిమాలిన కీర్తిప్రతిష్టలు సాధించడం, ఏమీ లేదన్నట్టుగా నేలమీదకు రావడం, చివరకు పూర్తిగా చచ్చిపోవటం...ఆమెకే చెల్లింది. పూర్తిగా చచ్చిపోవటమంటే, ఏమీ లేకుండా సావిత్రిగారు చనిపోయినప్పుడు చూస్తే తెలుస్తుంది. శరీరబరువు కూడా సుమా! పుట్టినప్పుడు ఎంత బరువుందో, పోయేటప్పుడు కాస్త అటూఇటూగా అంతే ఉన్నారామె! జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించటమంటే ఇంత పరిపూర్ణంగానా అనిపిస్తుంది. సావిత్రిని చూడాలనిపించింది.. నటీమణులెందరో ఉన్నారు. సావిత్రి వేరు. చక్కని ముఖవర్చస్సు, భావాలను అలవోకగా చెప్పగలిగిన అందమైన కళ్లు... ఒక నటికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. జీవితంలో విఫలమయ్యారని, వైవాహిక జీవితం దెబ్బతిందని, మద్యానికి బానిసైందనీ... అందరికీ తెలిసినట్టుగా నాకూ అంతవరకే తెలుసు. ఎప్పుడైతే ఆమె చరిత్రలోకి వెళ్లామో? జీవితాన్ని పట్టుకున్నామో? ‘సావిత్రి మరోసారి కనిపిస్తే బాగుండును... ‘అందరిలా ఎందుకు ఉండలేకపోయావు? ఎందుకమ్మా ఇలా చేసుకున్నావు?’ అని అడగాలనిపించింది. రేపు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికీ కచ్చితంగా అలాగే అనిపిస్తుంది. జెమినీ గణేశన్‌ది టిపికల్ పాత్ర. సావిత్రిని అభిమానించేవారు ఆయన్నో విలన్‌గానే భావిస్తారు. వాస్తవంలోకి వెళితే ఆయనపై కోపం రాదు. అంతగా నమ్మడం ఆమె పొరపాటేమో? అనిపిస్తుంది. విభిన్న సినిమాలకు వైవిధ్యంగా... చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’, ఆయన 150వ సినిమాకు నేనే డైలాగులు రాశాను. తొలి స్వాతంత్య్రయోధుడి చరిత్ర అది. ‘సాహో’ తర్వాత ప్రభాస్‌తో మరో సినిమా ఉంది. ‘జిల్’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తుంది. ఒక ఫిక్షన్లా, ఏమోషన్ థ్రిల్లర్‌లా అనిపిస్తూ అన్నిరకాల షేడ్స్ కనిపిస్తాయి. మహేష్‌బాబు సోదరి మంజుల తొలిసారిగా దర్శకత్వం చేపడుతున్న ప్రేమకథాచిత్రానికి రాస్తున్నా. సందీప్‌కిషన్ హీరో. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న ‘సాక్ష్యం’ సినిమా కూడా ఉంది. విభిన్న కథాంశాలతో సినిమాలు రావటంతో అంతే వైవిధ్యంగా సంభాషణలు రాసే ప్రయత్నం చేస్తున్నాను. మంచి పేరు తెస్తాయని భావిస్తున్నా. అంతా సాయిబాబా దయ. -
నిజాలే చూపించాలి!
తమిళసినిమా: మహానటి సావిత్రి జీవిత చరిత్ర తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. జెమినీగణేశన్‌గా మాలీవుడ్ యువ నటుడు దుల్కర్సల్మాన్ నటిస్తుండగా ఒక ప్రత్యేక పాత్రలో చెన్నై చిన్నది సమంత నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెట్‌పైకి వెళ్లింది. అభినేత్రి సావిత్రి చరమ దశలో ఉన్నప్పుడు, కన్నుమూసిన తరువాత ఆమె గురించి చాలా కథనాలు వెలువడ్డాయి. మరణానికి ముందు ఆర్థికసమస్యలను ఎదుర్కొన్నారన్నది ఆ కథనాల్లో ప్రధానమైంది. సావిత్రి మరణించడానికి ముందు ఆమె ఫొటోలు కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆ ఫొటోల విషయమై సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి మండిపడ్డారు. ఆమె పేర్కొంటూ తన తల్లి ఆర్థికసమస్యలతో ఎప్పుడూ కష్టపడలేదన్నారు. రెండు తరాలు సుఖ సంతోషాలతో జీవిం చేలా తమకు ఆస్తులను ఇచ్చారని తెలిపారు.తన తల్లి మధుమేహ వ్యాధికి గురయ్యారని అన్నారు. అయితే తన భర్త జెమినీగణేశన్ బాగానే చూసుకున్నారని చెప్పారు. తన తల్లి జీవిత చరిత్రతో తెరకెక్కిస్తున్న చిత్రంలో నిజాలే చూపిం చాలని, స్క్రిప్ట్ మాకు చూపించి ఆ మోదం పొందిన తరువాతే షూటింగ్ జరపాలని దర్శక నిర్మాతలకు షరతులు విధించినట్లు, అందుకు వారు అంగీకరించినట్లు నటి సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి చెప్పినట్లు తమిళపత్రికలు పేర్కొన్నాయి. -
కీర్తి బరువు పెరగాలి!
బాహుబలి–2 కీర్తిసురేష్‌ని కాపాడనుందా! యువనటి కీర్తిసురేష్ అందాలకు చిరునామా. ఆమె ఒక్క నవ్వు చాలు యువతను ఊహాలోకాల్లో విహరింపచేయడానికి. తమిళంలో సూర్యకు జంటగా తానా సేర్నద కూటం చిత్రంలో నటిస్తున్న కీర్తి ద్విభాషా చిత్రం మహానదిలోనూ నటిస్తున్నారు. ఇది మహానటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందుతున్న చిత్రం అన్నది తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. సావిత్రి మాదిరి గెటప్ వేయించి కీర్తిసురేష్‌తో చిత్రీకరణ మొదలెట్టారు. అయితే ఈ గెటప్ చిత్రాలు లీక్ అయి సోషల్‌మీడియాలో హల్చల్ చేశాయి. అయితే సావిత్రిలా కీర్తిసురేష్‌కు గెటప్ నప్పలేదే, ఇంకా లావైతే బాగుండు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది దర్శక నిర్మాతల్ని ఆలోచనలో పడేసిందని సమాచారం. కీర్తిసురేష్ బరువు పెంచాలని దర్శక నిర్మాతలు ముందుగా చెప్పినప్పుడు సరేనన్న ఈ బ్యూటీ ఆ తరువాత అది కష్టం అని చేతులెత్తేశారట. అమ్మడికి అనుష్క బాధలు గుర్తుకొచ్చాయో ఏమో. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం సుమారు 80 కిలోల వరకు బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి పడని తంటాలు లేవు. బాహుబలి–2 చిత్ర నిర్మాతలకు తన బరువు విషయంలో భారీ ఖర్చునే పెట్టించారనే ప్రచారం హల్చల్ చేసింది. చివరిగా గ్రాఫిక్స్‌తో అనుష్క బరువును తగ్గించారు. కాగా మహానది చిత్రంలో కీర్తిసురేష్ బరువు పెంచాలన్న నిర్ణయానికి ఆ చిత్ర నిర్మాతలు వచ్చినట్టు సమాచారం. ఈ చిత్రంలో చెన్నై చిన్నది సమంత కూడా ఒక ముఖ్యపాత్రలో రిపోర్టర్‌గా నటిస్తున్నారన్నది గమనార్హం. -
‘మహానటి ’ షూటింగ్ షురూ
హైదరాబాద్: వెండితెర ధ్రువతార , మహానటి సావిత్రి బయోపిక్ ఎట్టకేలకు సెట్స్‌మీదకు రానుంది. నాగ్ అశ్విన దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోలో పూజాకార్యక్రమాలు నిర్వహించింది. నాగ్ అశ్విన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు అధికారంగా లాంచ్ అయింది. తొలి షాట్ ని లెజండరీ నటుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ఫోటోలపై తొలిషాట్‌ను చిత్రీకరించారు. త్వరలోనే సెట్స్‌మీదకువెళ్లనున్నట్టుచిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనున్నారు. ఇక సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో టాలీవుడ్ బ్యూటీ సమంత అలరించనుంది. మరోవైపు సీనియర్ నటి భానుప్రియ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర పోషించనుందని, ప్రస్తుతానికి ఆ పాత్ర వివరాలు సీక్రెట్ అంటున్నాడు నాగ్ అశ్విన్. సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడట. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్. మహిళా దినోత్సవం రోజు మహానటి సావిత్రి బయోపిక్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. -
మహానటి సావిత్రిగా తెరపైకి నిత్యామీనన్
మహానటి సావిత్రిని భారతీయ సినిమా ఎప్పటికీ మరచిపోదు. నటిగా సావిత్రి సజీవం. దక్షిణాది భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించిన మహానటి సావిత్రి. మహా మహులైన నటులందరితోనూ నటించిన ఘనత సావిత్రిది. తమిళంలో శివాజీగణేశన్‌ను నడిగర్ తిలకంగా కొనియాడితే, సావిత్రి నటి తిలకంగా కీర్తించబడ్డారు. ప్రఖ్యాత నటుడు జెమినీగణేశన్‌ను ప్రేమించి పెళ్లాడిన సావిత్రి సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టి తీవ్ర నష్టాల పాలై ఆస్తులను పోగొట్టుకున్నారు. అలాంటి మహానటి నిజ జీవితం సుఖ దుఃఖాలమయం. అలాంటి అభినేత్రి జీవితచరిత్ర తెరకెక్కనుంది. ఇటీవల తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్ సావిత్రి జీవిత చరిత్రను తమిళం, తెలుగు భాషల్లో దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి మహానది అనే పేరును నిర్ణయించినట్లు తెలిసింది. ఇది ఇంతకు ముందు విశ్వనటుడు కమలహాసన్ నటించిన చిత్రం పేరు అన్నది గమనార్హం. ఇకపోతే ఇందులో సావిత్రి పాత్రలో నటి నిత్యామీనన్ నటించనున్నారు. సావిత్రి మాదిరిగానే కాస్త పొట్టిగా, బొద్దుగా ఉండడం, ముఖ్యంగా దక్షిణాది భాషల్లో పేరున్న నటి కావడంతో ఈ అవకాశం నిత్యామీనన్‌ను వరించిందన్నది గమనార్హం. ఇతర నటీనటులు,తదితర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
మహానటి 'సావితి' 33వ వర్ధంతి
-
మహానటి
-
సావిత్రి మనవడు హీరోగా ఎంట్రీ