
కీర్తి బరువు పెరగాలి!
బాహుబలి–2 కీర్తిసురేష్‌ని కాపాడనుందా! యువనటి కీర్తిసురేష్ అందాలకు చిరునామా. ఆమె ఒక్క నవ్వు చాలు యువతను ఊహాలోకాల్లో విహరింపచేయడానికి. తమిళంలో సూర్యకు జంటగా తానా సేర్నద కూటం చిత్రంలో నటిస్తున్న కీర్తి ద్విభాషా చిత్రం మహానదిలోనూ నటిస్తున్నారు. ఇది మహానటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందుతున్న చిత్రం అన్నది తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. సావిత్రి మాదిరి గెటప్ వేయించి కీర్తిసురేష్‌తో చిత్రీకరణ మొదలెట్టారు. అయితే ఈ గెటప్ చిత్రాలు లీక్ అయి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేశాయి.
అయితే సావిత్రిలా కీర్తిసురేష్‌కు గెటప్ నప్పలేదే, ఇంకా లావైతే బాగుండు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది దర్శక నిర్మాతల్ని ఆలోచనలో పడేసిందని సమాచారం. కీర్తిసురేష్ బరువు పెంచాలని దర్శక నిర్మాతలు ముందుగా చెప్పినప్పుడు సరేనన్న ఈ బ్యూటీ ఆ తరువాత అది కష్టం అని చేతులెత్తేశారట. అమ్మడికి అనుష్క బాధలు గుర్తుకొచ్చాయో ఏమో. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం సుమారు 80 కిలోల వరకు బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి పడని తంటాలు లేవు.
బాహుబలి–2 చిత్ర నిర్మాతలకు తన బరువు విషయంలో భారీ ఖర్చునే పెట్టించారనే ప్రచారం హల్‌చల్ చేసింది. చివరిగా గ్రాఫిక్స్‌తో అనుష్క బరువును తగ్గించారు. కాగా మహానది చిత్రంలో కీర్తిసురేష్ బరువు పెంచాలన్న నిర్ణయానికి ఆ చిత్ర నిర్మాతలు వచ్చినట్టు సమాచారం. ఈ చిత్రంలో చెన్నై చిన్నది సమంత కూడా ఒక ముఖ్యపాత్రలో రిపోర్టర్‌గా నటిస్తున్నారన్నది గమనార్హం.