
మహానటి సావిత్రి అంటే పేరు కాదు టాలీవుడ్‌లో గుర్తుండిపోయే బ్రాండ్

ఇప్పుడంటే హీరోహీరోయిన్లు బోలెడంతమంది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు.

ఎవరైనా సరే యాక్టింగ్‌తో ప్రేక్షకుల్ని రంజింప చేయాల్సి ఉండేది. ఇందులో సావిత్రి టాప్ క్లాస్ స్టూడెంట్.

ఈరోజు (డిసెంబరు 6) సావిత్రి జయంతి. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.

1936లో గుంటూరులోని చిర్రాపూర్ అనే ఊరిలో సావిత్రి పుట్టింది.

ఈమెకు ఆరు నెలల వయసున్నప్పుడు తండ్రి చనిపోవడంతో.. తల్లితో కలిసి పెద్దమ్మ దగ్గర పెరిగింది.

13 ఏళ్ల వయసులో కాకినాడలోని ఆంథ్రనాటక పరిషత్ ఉత్సవాలలో పాల్గొనడం ఈమె జీవితాన్ని మలుపుతిప్పింది.

'సంసారం' అనే సినిమాలో తొలి ఛాన్స్ రాగా.. తక్కువ వయసుందనే కారణంతో ఈమెని తీసేశారు.

తర్వాత 'పాతాళభైరవి' సినిమాలో కనబడీకనబడని పాత్రలో నటించింది. 'పెళ్ళిచేసి చూడు' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కానీ రెండో హీరోయిన్ పాత్ర.

1953సంవత్సరం ఈమె జీవితాన్ని మరో మలుపుతిప్పింది. ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన 'దేవదాసు'లో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి.

ఆ తర్వాత నుంచి సావిత్రి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

సినిమాలు, యాక్టింగ్ పరంగా టాలీవుడ్‌లో సావిత్రి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.

కుటుంబ బాధ్యతలు, సినిమాలని రెండింటిని సావిత్రి బ్యాలెన్స్ చేసుకోలేక.. ఓ సాధారణ నటిగా జీవితాన్ని ముగించింది.

ఈమె జీవితం ఆధారంగా 'మహానటి' సినిమా తీశారు. చాలామంది ఇప్పటికే చూసేసి ఉంటారు. లేదంటే చూడండి.

సావిత్రి అంటే ఎవరో మీకు తెలియకపోయినా.. సినిమా చూస్తే మాత్రం ఆమెతో ప్రేమలో పడిపోతారు.

ఎంతమంది హీరోయిన్లు వచ్చినా సరే సావిత్రి మాత్రం.. తెలుగు తెరపై చెరిగిపోని మధుర జ్ఞాపకం.

సావిత్రి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ ఎప్పటికీ 'ఆకాశ వీధిలో అందాల జాబిలి'!









