‘మహానటి ’ షూటింగ్‌ షురూ | ‘Mahanati’ savitri biopic regular shooting starts | Sakshi
Sakshi News home page

‘మహానటి ’ షూటింగ్‌ షురూ

Published Mon, May 29 2017 2:15 PM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM

‘మహానటి ’ షూటింగ్‌ షురూ

‘మహానటి ’ షూటింగ్‌ షురూ

హైదరాబాద్‌: వెండితెర ధ్రువతార , మహానటి సావిత్రి  బయోపిక్ ఎట్టకేలకు సెట్స్‌మీదకు రానుంది.   నాగ్‌ అశ్విన దర్శకత్వంలో  ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం  లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ రామ‌కృష్ణ స్టూడియోలో  పూజాకార్యక్రమాలు  నిర్వహించింది.   నాగ్ అశ్విన్  ఆధ్వర్యంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు అధికారంగా లాంచ్  అయింది. తొలి షాట్ ని లెజండ‌రీ  నటుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సావిత్రి ఫోటోల‌పై  తొలిషాట్‌ను చిత్రీకరించారు.  త్వరలోనే సెట్స్‌మీదకువెళ్లనున్నట్టుచిత్ర  యూనిట్‌ ప్రకటించింది.

తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనున్నారు. ఇక సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో  టాలీవుడ్‌  బ్యూటీ సమంత  అలరించనుంది.  మరోవైపు  సీనియర్ నటి భానుప్రియ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర పోషించనుందని, ప్రస్తుతానికి ఆ పాత్ర వివరాలు సీక్రెట్ అంటున్నాడు నాగ్ అశ్విన్.

సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడట. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.  ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్.  మహిళా దినోత్సవం రోజు మహానటి సావిత్రి బయోపిక్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement