regular shooting
-
ఫిబ్రవరిలో ప్రారంభం?
‘నాయకన్’ (1987) (తెలుగులో నాయకుడు) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘థగ్ లైఫ్’. ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి కీలక పాత్రలు పోషించనున్నారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదట్లో ప్రారంభం కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావచ్చాయని, ఇప్పటికే సెట్ వర్క్ జరుగుతోందని టాక్. కమల్ హాసన్, మణిరత్నం, మహేంద్రన్, శివ అనంత్ నిర్మించనున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మరోవైపు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్ 2’విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే హెచ్ వినోద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించాల్సిన సినిమా ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. -
సెట్లో స్టార్ట్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ‘‘యావత్ దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నాం. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ సినిమా కథాంశం ప్రధానంగా 1958–1982ల మధ్య జరుగుతుంది. అందుకుని 1950, 1980 నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేస్తున్నాం. అలా రీ క్రియేట్ చేసిన ఓ భారీ సెట్లోనే ‘మట్కా’ షూటింగ్ జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
హైదరాబాద్‌లో వైజాగ్
యాక్షన్ మోడ్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు హీరో వరుణ్ తేజ్. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. వైర ఎంటర్టైన్ మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్‌కి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ‘‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. 24 ఏళ్ల వ్యవధిలో (1958 –1982) జరిగే ఈ సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. 1950, 1980 నాటి వాతావరణాన్ని తలపించేలా భారీ సెట్స్‌ను రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్ సిటీని క్రియేట్ చేసేందుకు ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు నలుగురు ఫైట్ మాస్టర్స్ వర్క్ చేస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్. -
మెగా 156 షురూ
చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ‘మెగా 156’(వర్కింగ్ టైటిల్) సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ అయింది. యువీ క్రియేష¯Œ ్సపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మారేడుమిల్లిలో మొదలైంది. ముందుగా చిరంజీవి పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. అతి త్వరలోనే ఈ సెట్స్‌లో చిరంజీవి పాల్గొంటారని సమాచారం. ఫాంటసీ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్ అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి, కెమెరా: ఛోటా కె.నాయుడు. -
ఫైట్‌తో ప్రారంభం
‘అంటే..సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్రధారి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో మంగళవారం హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఫైట్ మాస్టర్ రామ్–లక్ష్మణ్ ఈ ఫైట్ ఎపిసోడ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్. -
పాటలు.. నా సామి రంగ
కొత్త సినిమా కోసం మ్యూజిక్ ఆన్ చేశారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటించనున్న చిత్రం ‘నా సామిరంగ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, విజయ్ బిన్ని ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ‘నా సామిరంగ’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘ఓదెల రైల్వేస్టేషన్’ తర్వాత మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా రెడీ
సందీప్ మాధవ్, కేథరిన్ త్రెసా జంటగా ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఫేమ్ అశోక్ తేజ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీ మహా విష్ణువు మూవీస్‌పై సోమ విజయ్ ప్రకాష్ నిర్మాణంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఆదివారం (సెప్టెంబర్ 10న) కేథరిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె బర్త్ డేని చిత్ర యూనిట్ సెట్స్‌లో జరిపింది. అశోక్ తేజ మాట్లాడుతూ– ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. రెండవ షెడ్యూల్ ప్రస్తుతం హైదారాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే పవర్ ఫుల్ టైటిల్‌ని ప్రకటించబోతున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్ మాధవ్, హీరోయిన్లు కీర్తీ చావ్లా, నిష్మా, దీక్షా పంత్, దావులూరి జగదీశ్, పల్లి కేశవరావు పాల్గొని, కేథరిన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: అనూప్ రూబె¯Œ ్స, సహ నిర్మాతలు: గౌటి హరినాథ్, రొంగుల శివకుమార్. -
సెప్టెంబరులో స్టార్ట్?
‘డాన్‌శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబరులో స్టార్ట్ చేసేలా చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ పాత్రల కోసం మృణాల్ ఠాకూర్, పూజాహెగ్డే వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్‌గా ఫిక్స్ అవుతారా? లేకుంటే వేరే హీరోయిన్ ఈ ప్రాజెక్టులో యాడ్ అవుతారా? అన్నది తెలియాలి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగిల్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబరు 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
మొన్నటివరకు రిలాక్స్.. ఇకపై దబిడి దిబిడే
షార్ట్ బ్రేక్ తీసుకున్నారు... ఫుల్లుగా రిలాక్స్ అయ్యారు. గెట్ సెట్ గో అంటూ హుషారుగా షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. కొంత గ్యాప్ తర్వాత సెట్స్‌లోకి అడుగుపెడుతున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. బిజీ బిజీ దాదాపు యాభై రోజులు యూఎస్‌లో గడిపి, ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు ప్రభాస్. ఇక సినిమా షూటింగ్‌లతో బిజీ కావాలనుకుంటున్నారు. ఇందుకు తగ్గ యాక్షన్ ΄్లాన్ను రెడీ చేసుకున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్), ‘సలార్’ చిత్రాలు ఉన్నాయి. ముందుగా ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్లో పాల్గొననున్నారట. మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ను ్రపారంభించాలనుకుంటున్నారట. ఈ షెడ్యూల్లో ప్రధానంగా ప్రభాస్, దీపికా పదుకోన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలి సింది. గతంలో చిత్ర యూనిట్ ప్రకటించిన ప్రకారం ‘కల్కి 2898 ఏడీ’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ మరో చిత్రం ‘రాజా డీలక్స్’ విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారట ప్రభాస్. మరోవైపు ప్రభాస్ డైరీలో ఉన్న ‘సలార్’ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. సో.. మలి భాగం షూటింగ్‌ని ఆరంభించడానికి ΄్లాన్ చేస్తున్నారట. మొత్తం మీద ప్రభాస్ బిజీ బిజీ. టార్గెట్ ఫిక్స్ ‘దేవర’ సినిమా విషయంలో హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ స్పీడ్ మామూలుగా లేదు. ఈ సినిమా వరుస షూటింగ్ షెడ్యూల్స్ చకా చకా పూర్తవుతున్నాయి. అయితే గత నెల మూడో వారంలో ఓ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేశాక ఈ టీమ్ చిన్న గ్యాప్ తీసుకుంది. రెండు వారాల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ అంటే.. జూలై 31న ‘దేవర’ కొత్త షూటింగ్ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. ఈ కొత్త షెడ్యూల్ రెండు వారాల పాటు సాగుతుందని, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారని తెలిసింది. పీటర్ హెయిన్స్ అండ్ టీమ్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేసిందట. ఈ షెడ్యూల్‌తో ‘దేవర’ మేజర్ యాక్షన్ పార్ట్ పూర్తవుతుందని, తదుపరి షెడ్యూల్స్‌లో ఇతర ప్రధాన తారాగణమైన ఈ చిత్రం విలన్ సైఫ్ అలీఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ వంటి వారు పాల్గొనగా, టాకీ పార్ట్‌ను షూట్ చేస్తారని తెలిసింది. నవంబరు కల్లా ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసేలా ఎన్టీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. షూటింగ్ కాస్త ముందుగానే ముగిసినా.. గ్రాఫిక్స్, పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ కోసం ‘దేవర’ టీమ్ ఎక్కువ టైమ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ‘దేవర’ తర్వాత హిందీ ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని చిత్రాలతో ఎన్టీఆర్ బిజీ అవుతారు. ఏప్రిల్‌లో రిలీజ్? హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సూపర్ డూపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం మలి భాగం ‘పుష్ప: ది రూల్’ సెట్స్‌లో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు ఇటీవల కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ ఈ నెల మొదటివారంలో ‘పుష్ప: ది రూల్’ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలని సుకుమార్ సన్నాహాలు చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ కూడా జాయిన్ అవుతారట. అలాగే ‘పుష్ప: ది రూల్’ను తొలుత ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ షెడ్యూల్స్‌కి గ్యాప్ రావడంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమా కాకుండా... దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగాతో ఓ సినిమాను అల్లు అర్జున్ కమిటైన సంగతి తెలిసిందే. -
త్రివిక్రమ్-మహేశ్‌బాబు సినిమా షూటింగ్ అప్పుడే..
‘అతడు’ (2005), ‘ఖలేజా’(2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండోవారం నుంచి ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. తొలుత ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ‘మహర్షి’ చిత్రం తర్వాత మహేశ్‌బాబు, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ఇది. చినబాబు (ఎస్.రాధాకృష్ణ) నిర్మిస్తున్న ఈ మూవీ 2023 ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. -
ధనుష్ తెలుగు సినిమా.. అప్పుడే షూటింగ్ స్టార్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఓ డైరెక్ట్ ఫిల్మ్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు. నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబరులో ఆరంభించాలనుకుంటున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారని తెలిసింది. -
సన్ ఆఫ్ ఇండియా షురూ
డాక్టర్ మోహన్ బాబు చాలా రోజుల తర్వాత హీరోగా నటిస్తున్న దేశభక్తి కథా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై తెరకెక్కుతోన్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మంచు విష్ణు సతీమణి విరానికా మంచు, కుమార్తె ఐరా, కుమారుడు అవ్రమ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, లక్ష్మీ మంచు, ఆమె కుమార్తె విద్యానిర్వాణ క్లాప్ ఇచ్చారు. హీరో విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు. విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా కలిసి స్క్రిప్టును డైరెక్షన్ టీమ్‌కు అందించారు. ‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. గతంలో ఎన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ తరహా కథ, ఈ జానర్ సినిమా ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని కూడా శుక్రవారమే మొదలుపెట్టాం. మోహన్ బాబు స్వయంగా స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాశారు. సుద్దాల అశోక్‌తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోహన్ బాబుకు స్టైలిస్ట్‌గా విరానికా మంచు వ్యవహరిస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: సర్వేష్ మురారి. -
సురేష్ గోపి @ 250
ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి త్వరలోనే ఓ కొత్త మైలు రాయిని అందుకోబోతున్నారు. నటుడిగా 247 సినిమాల వరకూ చేశారాయన. 248, 249వ íసినిమాలకు ప్లానింగ్ జరిగిపోయింది. తాజాగా 250వ చిత్రం కూడా అంగీకరించారు. ఈ స్పెషల్ సినిమా మరింత స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సురేష్ గోపి మాస్ లుక్‌లో కనిపించనున్నారు. మాథ్యువ్ థామస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
జూన్‌లో జాయిన్ అవుతారు
వంశీ పైడిపల్లితో ఓ సినిమాను ప్లాన్ చేశారు మహేశ్‌బాబు. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు పరశురామ్‌తో చేయబోయే సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నారట మహేశ్. ఈ సినిమా జూన్‌లో స్టార్ట్ కానుందట. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనుల్లో ఉన్నారట దర్శకుడు పరశురామ్. ఉగాదికి ఈ సినిమా ముహూర్తం జరపాలనుకుంటున్నారని తెలిసింది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతోందని టాక్. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రెడీ అవుతుందని ఊహించవచ్చు. మరోవైపు చిరంజీవి–కొరటాల శివ కాంబినేషన్లో చేస్తున్న సినిమాలో మహేశ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఎన్టీఆర్-త్రివిక్రమ్.. మొదలుపెట్టేశారు
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైపోయింది. ముందుగా చెప్పుకున్నట్లుగా యాక్షన్ సీక్వెన్స్‌తోనే షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ హరికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైన విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు శరవేగంగా షూటింగ్ జరుపుకోబోతున్న ఈ చిత్రం దసరాకే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కూడా చెప్పేసింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 28వ చిత్రం కాగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికా. గత చిత్రం నిరాశపరచటంతో త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడోనన్న ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రం కోసమే ఎన్టీఆర్ వర్కవుట్లు చేసింది తెలిసిందే. We are glad to inform you that our Production No 5 with Young Tiger NTR @tarak9999 and #Trivikram garu has started regular shoot from today. Get ready for a scintillating ride of emotions from our wizard of words this Dussehra. Co-Starring @hegdepooja , Music by @MusicThaman pic.twitter.com/ETyeNZHGGP — Haarika & Hassine Creations (@haarikahassine) 13 April 2018 -
‘మహానటి ’ షూటింగ్ షురూ
హైదరాబాద్: వెండితెర ధ్రువతార , మహానటి సావిత్రి బయోపిక్ ఎట్టకేలకు సెట్స్‌మీదకు రానుంది. నాగ్ అశ్విన దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోలో పూజాకార్యక్రమాలు నిర్వహించింది. నాగ్ అశ్విన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు అధికారంగా లాంచ్ అయింది. తొలి షాట్ ని లెజండరీ నటుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ఫోటోలపై తొలిషాట్‌ను చిత్రీకరించారు. త్వరలోనే సెట్స్‌మీదకువెళ్లనున్నట్టుచిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనున్నారు. ఇక సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో టాలీవుడ్ బ్యూటీ సమంత అలరించనుంది. మరోవైపు సీనియర్ నటి భానుప్రియ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర పోషించనుందని, ప్రస్తుతానికి ఆ పాత్ర వివరాలు సీక్రెట్ అంటున్నాడు నాగ్ అశ్విన్. సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడట. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్. మహిళా దినోత్సవం రోజు మహానటి సావిత్రి బయోపిక్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. -
సముద్రఖని తొండన్ ప్రారంభం
ఇటీవల అప్పా అంటూ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చి విశేష ఆదరణను అందుకున్న సముద్రఖని తాజాగా తొండన్ అంటూ రానున్నారు. ఇందులోనూ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు అచ్చంఎన్భదు మడమైయడా, కిడారి వంటి పలు విజయవంతమైన చిత్రాలతో తాజాగా శశికుమార్ హీరోగా నటించిన భలే వెళ్లయదేవా చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తున్న వసంధరాదేవి సినీ ఫిలింస్ అధినేత ఆర్.మణికంఠన్ నాడోడిగళ్ సంస్థతో కలిసి తొలిసారిగా చిత్ర నిర్మాణం చేపట్టిన చిత్రం తొండన్. విక్రాంత్, నమోనారాయణన్, తంబిరామయ్య, సూరి, గంజాకరుప్పు, పిచ్చైక్కారన్ ఫేమ్ మూర్తి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం, జస్టిన్ ప్రభాకన్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్ర పూజాకార్యక్రమాలు శుక్రవారం ఉదయం చెన్నైలో జరిగాయి. చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల 16 నుంచి నెయ్వేలిలో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. -
మూడు తరాల ముచ్చట్లు
సీనియర్ రచయిత పూసల దర్శకునిగా మారి తెరకెక్కించనున్న చిత్రం ‘డాలర్‌కి మరో వైపు’. ఎ.సత్యనారాయణ, కె.రంగారావు నిర్మాతలు. ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో పాత, కొత్త నటీనటులు నటిస్తారు. ఈ సందర్భంగా పూసల మాట్లాడుతూ- ‘‘మూడు తరాల ముచ్చట్ల సమాహారం ఈ కథ. బంధాలు, అనుబంధాలు... ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. పూర్తిస్థాయి కామెడీతో అన్ని వయసులవారూ చూసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ: ఎ.జమునాకుమారి, కెమెరా: మోహన్‌చంద్, సంగీతం: నాని, నిర్మాణ నిర్వహణ: పూసల బుజ్జి, నిర్మాణం: శ్రీ ఓం సాయిరాం ప్రొడక్షన్స్.