సముద్రఖని తొండన్ ప్రారంభం | Samudrakhani start tondan | Sakshi
Sakshi News home page

సముద్రఖని తొండన్ ప్రారంభం

Published Sat, Dec 10 2016 3:22 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

సముద్రఖని తొండన్ ప్రారంభం

సముద్రఖని తొండన్ ప్రారంభం

ఇటీవల అప్పా అంటూ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చి విశేష ఆదరణను అందుకున్న సముద్రఖని తాజాగా తొండన్ అంటూ రానున్నారు. ఇందులోనూ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు అచ్చంఎన్భదు మడమైయడా, కిడారి వంటి పలు విజయవంతమైన చిత్రాలతో తాజాగా శశికుమార్‌ హీరోగా నటించిన భలే వెళ్లయదేవా చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తున్న వసంధరాదేవి సినీ ఫిలింస్‌ అధినేత ఆర్‌.మణికంఠన్  నాడోడిగళ్‌ సంస్థతో కలిసి తొలిసారిగా చిత్ర నిర్మాణం చేపట్టిన చిత్రం తొండన్.

విక్రాంత్, నమోనారాయణన్, తంబిరామయ్య, సూరి, గంజాకరుప్పు, పిచ్చైక్కారన్ ఫేమ్‌ మూర్తి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్‌ ఎం.నాథన్ ఛాయాగ్రహణం, జస్టిన్ ప్రభాకన్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్ర పూజాకార్యక్రమాలు శుక్రవారం ఉదయం చెన్నైలో జరిగాయి. చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ నెల 16 నుంచి నెయ్‌వేలిలో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement