shashi kumar
-
హీరోగా శశికుమార్..త్వరలోనే షూటింగ్ మొదలు
చెన్నై: చెందూర్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై టీడీ రాజా నిర్మిస్తున్న తాజా చిత్రంలో నటుడు శశికుమార్ కథానాయకుడిగా నటించనున్నారు. విజయ్ ఆంటోని హీరోగా ఈ సంస్థ నిర్మించిన కోటియిల్ ఒరువన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా శశికుమార్ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కథానాయికగా హరిప్రియ నటించనున్నారు. ముఖ్యపాత్రల్లో విక్రాంత్, తులసి మధుసూదన్ తదితరులు నటించనున్నారు. కళగు చిత్రం ఫేమ్ సత్యశివ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు. చదవండి : కథ లేకుండా కామెడీ నడిపించలేం! అంతదాకా వస్తే టీ.. కాఫీ అందించడానికీ రెడీయే! -
మహిళల్ని గౌరవించండి
తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు పొందారు కన్నడ హీరో శశి కుమార్. ఇప్పుడు ఆయన తనయుడు అక్షిత్ శశికుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘సీతాయణం’. ‘రెస్పెక్ట్ ఉమెన్’ అన్నది ఉపశీర్షిక. ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహించారు. అనహిత భూషణ్ కథానాయికగా నటించారు. కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రోహన్ భరద్వాజ్ సమర్పణలో లలిత రాజ్యలక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ– ‘‘లవ్, క్రైమ్, డ్రామాగా నడిచే చిత్రమిది. కథ, కథనాలు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటాయి. ఈ నెలలోనే మా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ప్రభాకర్ మాట్లా డుతూ– ‘‘నేటి తరానికి నచ్చే చక్కని అంశాలు, సన్నివేశాలతో రాసుకున్న కథ ఇది. నిర్మాతలు, నటీనటుల సహకారంతో అనుకున్న విధంగా తెరకెక్కించాం. అక్షిత్‌కి ఈ చిత్రం చాలా పెద్ద అవకాశాల్ని తెస్తుంది. అనహిత చాలా బాగా నటించింది. ఈ చిత్రాన్ని తమిళంలో అనువదించి, విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దుర్గాప్రసాద్ కొల్లి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్. -
నాడోడిగళ్ సీక్వెల్ మొదలైంది!
తమిళసినిమా: నాడోడిగళ్ సీక్వెల్ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైంది. తొమ్మిదేళ్ల క్రితం తెరపైకి వచ్చిన చిత్రం నాడోడిగళ్. ఆ చిత్రం దర్శకుడు సముద్రకని, నటి అనన్య, అభినయ వంటి వారికి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతే కాదు కమర్శియల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. తాజాగా అదే సముద్రకని, శశికుమార్‌ల కాంబినేషన్లో నాడోడిగళ్ సీక్వెల్ చిత్రం తెరకెక్కుతోంది. అయితే తొలి భాగంలో నటించిన శశికుమార్, భరణి, నమోనారాయణ మాత్రమే సీక్వెల్లో నటిస్తున్నారు. హీరోయిన్లుగా అంజలి, అతుల్య నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఎంఎస్.భాస్కర్, జ్ఞానసంబంధం, తులసి, శ్రీరంజని, సూపర్‌సుబ్బరాయన్ నటిస్తున్నారు. మరి కొంతమంది నటీనటుల ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు తెలిపారు. మెడ్రాస్ ఎంటర్‌ప్రైజస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకాంబరం ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తిరువళ్లూర్ సమీపంలోని ఒక గ్రామంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రేమను కాపాడే స్నేహితుల ఇతివృత్తంగా నాడోడిగళ్ చిత్రం రూపొందగా ఈ సీక్వెల్లో ఆ అంశంతో పాటు పలు విషయాలు చోటుచేసుకుంటాయని చిత్ర వర్గాలు ఈ సందర్భంగా తెలిపారు. తొమ్మిదేళ్లనాటికి, ఇప్పుటికీ సమాజంలో చాలా మార్పులు జరిగాయని, అలాంటి వన్నీ ఈ చిత్రంలో పొందుపరచనున్నట్లు తెలిపారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో శశికుమార్, అంజలి, అతుల్య చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
కోలీవుడ్‌లో బిజీ అవుతున్న తెలుగమ్మాయి
నటి అంజలి కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోంది. ప్రస్తుతం నటుడు జైతో కలిసి నటించిన బెలూన్ చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా విజయ్‌ఆంథోనికి జంటగా కాళీ చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నా, అంజలికే అధిక ప్రాధాన్యత ఉంటుందట. తాజాగా అంజలికి మరో అవకాశం తలుపు తట్టింది. నాడోడిగళ్–2 చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. 2009లో తెరపైకి వచ్చిన నాడోడిగళ్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శశికుమార్, విజయ్‌వసంత్, గంజాకరుప్పు, నటి అనన్య, అభినయ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఇదే చిత్రం తెలుగులోనూ శంభో శివశంబో పేరుతో రీమేక్ అయ్యింది. తాజాగా శశికుమార్ హీరోగా సముద్రఖని దర్శకుడిగా నాడోడిగళ్–2 చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో అంజలి కథానాయికగా నటించనుందన్నది. మరో హీరోయిన్గా నటి అతుల్యరవి నటించనుంది. ఈమె ఇప్పటికే సముద్రఖనితో కలిసి ఏమాలి చిత్రంలో నటిస్తోందన్నది. ఇన్స్పైర్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం మార్చిలో సెట్‌పైకి వెళ్లనుంది. ఐస్టిన్ ప్రభకరన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నాడోడిగళ్ చిత్రానికి సీక్వెల్ కాదట. ఆ బాణీలో సాగే విభిన్న కథా చిత్రంగా నాడోడిగళ్–2 చిత్రం ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. మొత్తం మీద నటి అంజలి కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో మళ్లీ బలం పుంజుకుంటోందన్న మాట. -
పూర్ణ అంత పని చేసిందా!
తమిళసినిమా: నటి పూర్ణ అంత పని చేసిందా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఇదే. ఇంతకీ పూర్ణ ఏం చేసింది? బహుభాషా నటిగా పేరొందిన ఈ అమ్మడికి తమిళం, తెలుగు, మలయాళం ఇలా ఏ భాషలోనూ పెద్దగా అవకాశాలు లేవు. అయితే పూర్ణ మంచి నటి. అంతకంటే మంచి డాన్సర్. దీంతో నటనకు దూరం కావడం ఇష్టం లేక అంది వచ్చిన పాత్రలను చేస్తూ తన ఉనికిని చాటుకుంటోందని చెప్పవచ్చు. దర్శకుడు మిష్కిన్ నిర్మించిన సవరకట్టి చిత్రంలో దర్శకుడు రామ్‌కు భార్యగా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించింది. ఇందులో తనది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని, అంత మంచి పాత్రను తనకిచ్చినందుకు మిష్కిన్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో బోరున ఏడ్చేసింది కూడా. ఆ చిత్రం విడుదల కావలసి ఉంది. తాజాగా కొడివీరన్ అనే చిత్రంలో నటిస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మహిమా నంబియార్ కథానాయకిగా నటిస్తోంది. చెల్లెలిగా రేణుగుంట చిత్రం ఫేమ్ సనూజ నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణ నటిస్తోంది. ఇది చాలా బలమైన పాత్ర అట. ఈ పాత్రలో నటించడానికి ఈ అమ్మడు తన జుత్తునే త్యాగం చేసిందట. అర్థం కాలా? గుండు కొట్టించుకుందట. సాధారణంగా కథానాయకులే గుండు కొట్టించుకోవడానికి సిద్ధపడరు. విగ్‌తో మ్యానేజ్ చేస్తుంటారు. అలాంటిది నటి పాత్ర కోసం గుండు గీయించుకోవడం టాక్‌గా మారింది. దీని గురించి పూర్ణను అడిగితే పాత్రకు అవసరం అయితే గుండు కొట్టించుకోవడం తప్పేంకాదు అని పేర్కొంది. కథానా యకి పాత్రలే కావాలని పట్టుపట్టి కూర్చోకుండా నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న పూర్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక రౌండ్ కొడుతుందేమో! -
సముద్రఖని తొండన్ ప్రారంభం
ఇటీవల అప్పా అంటూ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చి విశేష ఆదరణను అందుకున్న సముద్రఖని తాజాగా తొండన్ అంటూ రానున్నారు. ఇందులోనూ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు అచ్చంఎన్భదు మడమైయడా, కిడారి వంటి పలు విజయవంతమైన చిత్రాలతో తాజాగా శశికుమార్ హీరోగా నటించిన భలే వెళ్లయదేవా చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తున్న వసంధరాదేవి సినీ ఫిలింస్ అధినేత ఆర్.మణికంఠన్ నాడోడిగళ్ సంస్థతో కలిసి తొలిసారిగా చిత్ర నిర్మాణం చేపట్టిన చిత్రం తొండన్. విక్రాంత్, నమోనారాయణన్, తంబిరామయ్య, సూరి, గంజాకరుప్పు, పిచ్చైక్కారన్ ఫేమ్ మూర్తి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం, జస్టిన్ ప్రభాకన్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్ర పూజాకార్యక్రమాలు శుక్రవారం ఉదయం చెన్నైలో జరిగాయి. చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల 16 నుంచి నెయ్వేలిలో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. -
రీ పోస్టుమార్టం చేయండి
-
ఆడంబర దుస్తులంటే అలర్జీ
ఆడంబర దుస్తులు ధరించడం నటి లావణ్య త్రిపాఠికి అలర్జీలా వున్నట్లుంది. కొందరు హీరోయిన్లు తమ పాత్రకు సంబంధంలేని విధంగా దుస్తులు, నగలు ధరించి గొప్పగా కనిపించేందుకు తహతహలాడుతుంటారు. కొందరు హీరోయిన్లు నిరాడంబరంగా కనిపించేందుకు ఇష్టపడతారు. శశికుమార్ హీరోగా ‘బ్రహ్మన్’ చిత్రంలో నటించిన లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ కథాపాత్రలకు తగిన విధంగాను, సన్నివేశానికి తగ్గట్టు దుస్తులు, నగలు ధరించాలనే విషయంపై దర్శకులు ఏ విధంగా శ్రద్ధ వహిస్తారో తాను కూడా అంతే శ్రద్ధ వహిస్తానన్నారు. వాస్తవంగా ఆడంబరమైన దుస్తులు ధరించడం తనకు సుతరామూ ఇష్టం లేదన్నారు. తక్కువగా నగలు ధరించడమే ఇష్టమని, చెవిలో చిన్న రింగులు, మెడలో చిన్న చెయిన్ మాత్రమే ధరిస్తానన్నారు. ఒక చిత్రంలో డాక్టర్‌గా నటిం చానని, ఆ సమయంలో తనకు ధగధగలాడే కాస్ట్యూమ్ అందజే శారన్నారు. అది ఆస్పత్రిలో చిత్రీకరించే సన్నివేశం కావడంతో తానే దానికి బదులు సాధారణ డ్రెస్ అందజేయమని డెరైక్టర్‌ను కోరానని, దీన్ని డెరైక్టర్ కూడా ప్రశంసించారన్నారు. -
నంద్యాలలో యువతిపై సామూహిక లైంగికదాడి
నంద్యాల టౌన్ : పట్టణంలో ఓ యువతిపై సామూహిక లైంగికదాడి జరిగింది. డీఎస్పీ అమర్నాథ్నాయుడు తెలిపిన మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మిపల్లెకు చెందిన ఓ యువతి (20) తల్లిదండ్రులతో గొడవపడి ఐదు రోజుల క్రితం నంద్యాల రైల్వేస్టేషన్ చేరుకుంది. హోటల్లో తింటూ అక్కడే తలదాచుకుంటోంది. ఈ నేపథ్యంలో పరిచయమైన ఓ ఆటోడ్రైవర్ శుక్రవారం రాత్రి సినిమాకు వెళ్దామంటూ ఆమెను తీసుకెళ్లాడు. అయితే సినిమాకు కాకుండా పట్టణ శివారులోని శాంతిరాం ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యలో మరో ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. జనసంచారం లేకపోవడంతో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావంటూ ఆ యువతి ఆటో డ్రైవర్‌ను నిలదీసింది. వారితో ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. ముగ్గురూ కలసి ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి లైంగికదాడి చేసి పరారయ్యారు. అనంతరం ఆమె అరుపులు, కేకలు విన్న శాంతిరాం ఆసుపత్రి సిబ్బంది విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. షాక్‌లో ఉన్న ఆమె ఒక్కోసారి ఒక్కో విధమైన సమాచారం ఇస్తోంది. ఇదిలా ఉండగా డీఎస్పీ అమర్నాథ్నాయుడు, ట్రైనీ ఐపీఎస్ అధికారి శశికుమార్ ఆధ్వర్యంలో రెండు పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. -
శిథిలావస్థలో కల్వర్టులు
కొండాపూర్, న్యూస్‌లైన్: కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. అయినా అధికారులు మొద్దునిద్ర వీడడంలేదు. మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తా నుంచి మునిదేవునిపల్లి వరకు ప్రమాదకరంగా నాలుగు కల్వర్టులు ఉన్నాయి. పెద్దాపూర్ నుంచి మారెపల్లి వరకు రెండు కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పంచాయతీరాజ్ రోడ్డుపై ఉన్న ఈ కల్వర్టుల మీదుగా ప్రతిరోజు మల్లెపల్లి శివారులోని పరిశ్రమల భారీ వాహనాలు సదాశివపే ట, సంగారెడ్డి పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు రాత్రింబవళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూతూమంత్రంగా మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. పనుల్లో నాణ్యత లేకపోవడంతో మళ్లీ యధాస్థితికి వస్తున్నాయి. ఇదిలా ఉండగా మండలానికి రెగ్యులర్ పీఆర్ ఏఈ లేకపోవడంతో పంచాయతీరాజ్ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడం లేదు. డివిజన్, జిల్లాస్థాయి అధికారులు సైతం మండలంలో పర్యటించిన దాఖలాలు లేవు. ఇన్చార్జి పీఆర్ అధికారులతో ఇబ్బందులు 2010 నుంచి నేటి వరకు అధికరులు తరుచూ బదిలీలు ఇంచార్జిలకు బాధ్యతలు అప్పగించడంతో పంచాయతీరాజ్ పనులు సరిగ్గా చేయ డం లేదనే ఆరోపణలున్నాయి. 2010 నుంచి ఇప్పటి వరకు ఆరుగురు అధికారులు మండల పీఆర్ బాధ్యతలు నిర్వహించారు. ఏడాదిలో ఇద్దరు మార్పు చెందడంతో పనులు నత్తనడకన సాగడమే కాకుండా పర్సెంటేజ్‌లు తీసుకుని నాణ్యత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 2013 ఫిబ్రవరి 5 వరకు శశికుమార్ ఏఈగా పనిచేశారు. 6 నుంచి రత్నం 8 నెలల పాటు ఇన్చార్జిగా పనిచేశారు. అకస్మాత్తు గా రత్నంను ఇన్చార్జి బాధ్యతల నుంచి తొల గించగా ఓ నెలపాటు తిరిగి శశికుమార్ ఇన్చార్జి బాధ్యతలు చూశారు. ప్రస్తుతం సదాశివపేట పీఆర్ఏఈ మధుకర్ 1 డిసెంబర్ 2013 నుంచి ఇన్చార్జి పీఆర్ఏఈ బాధ్యతలు చూస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో హరిసింగ్‌ను వివరణ కోరగా మండలంలో పీఆర్‌ఏఈలు ఇన్చార్జిలుగా ఉండటంతో ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమన్నారు. పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు పంచాయతీరాజ్ కార్యాలయానికి తీసుకెళ్లారని, ఎంపీడీవో కార్యాలయంలో పీఆర్ఏఈ రికార్డులు నమోదు చేస్తామన్నారు.