కొండాపూర్, న్యూస్‌లైన్: కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. అయినా అధికారులు మొద్దునిద్ర వీడడంలేదు. మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తా నుంచి మునిదేవునిపల్లి వరకు ప్రమాదకరంగా నాలుగు కల్వర్టులు ఉన్నాయి. పెద్దాపూర్ నుంచి మారెపల్లి వరకు రెండు కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి.
పంచాయతీరాజ్ రోడ్డుపై ఉన్న ఈ కల్వర్టుల మీదుగా ప్రతిరోజు మల్లెపల్లి శివారులోని పరిశ్రమల భారీ వాహనాలు సదాశివపే ట, సంగారెడ్డి పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు రాత్రింబవళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూతూమంత్రంగా మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. పనుల్లో నాణ్యత లేకపోవడంతో మళ్లీ యధాస్థితికి వస్తున్నాయి. ఇదిలా ఉండగా మండలానికి రెగ్యులర్ పీఆర్ ఏఈ లేకపోవడంతో పంచాయతీరాజ్ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడం లేదు. డివిజన్, జిల్లాస్థాయి అధికారులు సైతం మండలంలో పర్యటించిన దాఖలాలు లేవు.
ఇన్‌చార్జి పీఆర్ అధికారులతో ఇబ్బందులు
2010 నుంచి నేటి వరకు అధికరులు తరుచూ బదిలీలు ఇంచార్జిలకు బాధ్యతలు అప్పగించడంతో పంచాయతీరాజ్ పనులు సరిగ్గా చేయ డం లేదనే ఆరోపణలున్నాయి. 2010 నుంచి ఇప్పటి వరకు ఆరుగురు అధికారులు మండల పీఆర్ బాధ్యతలు నిర్వహించారు. ఏడాదిలో ఇద్దరు మార్పు చెందడంతో పనులు నత్తనడకన సాగడమే కాకుండా పర్సెంటేజ్‌లు తీసుకుని నాణ్యత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 2013 ఫిబ్రవరి 5 వరకు శశికుమార్ ఏఈగా పనిచేశారు. 6 నుంచి రత్నం 8 నెలల పాటు ఇన్‌చార్జిగా పనిచేశారు.
అకస్మాత్తు గా రత్నంను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొల గించగా ఓ నెలపాటు తిరిగి శశికుమార్ ఇన్‌చార్జి బాధ్యతలు చూశారు. ప్రస్తుతం సదాశివపేట పీఆర్‌ఏఈ మధుకర్ 1 డిసెంబర్ 2013 నుంచి ఇన్‌చార్జి పీఆర్‌ఏఈ బాధ్యతలు చూస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో హరిసింగ్‌ను వివరణ కోరగా మండలంలో పీఆర్‌ఏఈలు ఇన్‌చార్జిలుగా ఉండటంతో ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమన్నారు. పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు పంచాయతీరాజ్ కార్యాలయానికి తీసుకెళ్లారని, ఎంపీడీవో కార్యాలయంలో పీఆర్‌ఏఈ రికార్డులు నమోదు చేస్తామన్నారు.
శిథిలావస్థలో కల్వర్టులు
Published Sat, Feb 1 2014 5:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement