నంద్యాలలో యువతిపై సామూహిక లైంగికదాడి | group sexual assault on a woman | Sakshi
Sakshi News home page

నంద్యాలలో యువతిపై సామూహిక లైంగికదాడి

Jun 22 2014 1:11 AM | Updated on Aug 17 2018 8:06 PM

నంద్యాలలో యువతిపై సామూహిక లైంగికదాడి - Sakshi

నంద్యాలలో యువతిపై సామూహిక లైంగికదాడి

పట్టణంలో ఓ యువతిపై సామూహిక లైంగికదాడి జరిగింది. డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు తెలిపిన మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మిపల్లెకు చెందిన ఓ యువతి (20) తల్లిదండ్రులతో గొడవపడి ఐదు రోజుల క్రితం నంద్యాల రైల్వేస్టేషన్ చేరుకుంది.

నంద్యాల టౌన్ : పట్టణంలో ఓ యువతిపై సామూహిక లైంగికదాడి జరిగింది. డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు తెలిపిన మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మిపల్లెకు చెందిన ఓ యువతి (20) తల్లిదండ్రులతో గొడవపడి ఐదు రోజుల క్రితం నంద్యాల రైల్వేస్టేషన్ చేరుకుంది. హోటల్‌లో తింటూ అక్కడే తలదాచుకుంటోంది. ఈ నేపథ్యంలో పరిచయమైన ఓ ఆటోడ్రైవర్ శుక్రవారం రాత్రి సినిమాకు వెళ్దామంటూ ఆమెను తీసుకెళ్లాడు. అయితే సినిమాకు కాకుండా పట్టణ శివారులోని శాంతిరాం ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యలో మరో ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. జనసంచారం లేకపోవడంతో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావంటూ ఆ యువతి ఆటో డ్రైవర్‌ను నిలదీసింది.
 
వారితో ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. ముగ్గురూ కలసి ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి లైంగికదాడి చేసి పరారయ్యారు. అనంతరం ఆమె అరుపులు, కేకలు విన్న శాంతిరాం ఆసుపత్రి సిబ్బంది విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. షాక్‌లో ఉన్న ఆమె ఒక్కోసారి ఒక్కో విధమైన సమాచారం ఇస్తోంది. ఇదిలా ఉండగా డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు, ట్రైనీ ఐపీఎస్ అధికారి శశికుమార్ ఆధ్వర్యంలో రెండు పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement