మహిళల్ని గౌరవించండి | Shashi Kumar son Akshith is ready for his debut Film | Sakshi
Sakshi News home page

మహిళల్ని గౌరవించండి

Mar 14 2020 1:08 AM | Updated on Mar 14 2020 1:08 AM

Shashi Kumar son Akshith is ready for his debut Film - Sakshi

అక్షిత్‌ శశికుమార్, అనహిత

తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు పొందారు కన్నడ హీరో శశి కుమార్‌. ఇప్పుడు ఆయన తనయుడు అక్షిత్‌ శశికుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘సీతాయణం’. ‘రెస్పెక్ట్‌ ఉమెన్‌’ అన్నది ఉపశీర్షిక. ప్రభాకర్‌ ఆరిపాక దర్శకత్వం వహించారు. అనహిత భూషణ్‌ కథానాయికగా నటించారు. కలర్‌ క్లౌడ్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రోహన్‌ భరద్వాజ్‌ సమర్పణలో లలిత రాజ్యలక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ– ‘‘లవ్, క్రైమ్, డ్రామాగా నడిచే చిత్రమిది. కథ, కథనాలు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటాయి. ఈ నెలలోనే మా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ప్రభాకర్‌ మాట్లా డుతూ– ‘‘నేటి తరానికి నచ్చే చక్కని అంశాలు, సన్నివేశాలతో రాసుకున్న కథ ఇది. నిర్మాతలు, నటీనటుల సహకారంతో అనుకున్న విధంగా తెరకెక్కించాం. అక్షిత్‌కి ఈ చిత్రం చాలా పెద్ద అవకాశాల్ని తెస్తుంది. అనహిత చాలా బాగా నటించింది. ఈ చిత్రాన్ని తమిళంలో అనువదించి, విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దుర్గాప్రసాద్‌ కొల్లి, సంగీతం: పద్మనాభ్‌ భరద్వాజ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement