పూర్ణ అంత పని చేసిందా! | Shake up for the role of the actress has become a toss. | Sakshi
Sakshi News home page

పూర్ణ అంత పని చేసిందా!

Published Mon, Jul 3 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

పూర్ణ అంత పని చేసిందా!

పూర్ణ అంత పని చేసిందా!

తమిళసినిమా: నటి పూర్ణ అంత పని చేసిందా? తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం ఇదే. ఇంతకీ పూర్ణ ఏం చేసింది? బహుభాషా నటిగా పేరొందిన ఈ అమ్మడికి తమిళం, తెలుగు, మలయాళం ఇలా ఏ భాషలోనూ పెద్దగా అవకాశాలు లేవు. అయితే పూర్ణ మంచి నటి. అంతకంటే మంచి డాన్సర్‌. దీంతో నటనకు దూరం కావడం ఇష్టం లేక అంది వచ్చిన పాత్రలను చేస్తూ తన ఉనికిని చాటుకుంటోందని చెప్పవచ్చు.

దర్శకుడు మిష్కిన్‌ నిర్మించిన సవరకట్టి చిత్రంలో దర్శకుడు రామ్‌కు భార్యగా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించింది. ఇందులో తనది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని, అంత మంచి పాత్రను తనకిచ్చినందుకు మిష్కిన్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో బోరున ఏడ్చేసింది కూడా. ఆ చిత్రం విడుదల కావలసి ఉంది. తాజాగా కొడివీరన్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మహిమా నంబియార్‌ కథానాయకిగా నటిస్తోంది. చెల్లెలిగా రేణుగుంట చిత్రం ఫేమ్‌ సనూజ నటిస్తోంది.

మరో ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణ నటిస్తోంది. ఇది చాలా బలమైన పాత్ర అట. ఈ పాత్రలో నటించడానికి ఈ అమ్మడు తన జుత్తునే త్యాగం చేసిందట. అర్థం కాలా? గుండు కొట్టించుకుందట. సాధారణంగా కథానాయకులే గుండు కొట్టించుకోవడానికి సిద్ధపడరు. విగ్‌తో మ్యానేజ్‌ చేస్తుంటారు. అలాంటిది నటి పాత్ర కోసం గుండు గీయించుకోవడం టాక్‌గా మారింది.  దీని గురించి పూర్ణను అడిగితే పాత్రకు అవసరం అయితే గుండు కొట్టించుకోవడం తప్పేంకాదు అని పేర్కొంది.  కథానా యకి పాత్రలే కావాలని పట్టుపట్టి కూర్చోకుండా నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న పూర్ణ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఒక రౌండ్‌ కొడుతుందేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement