మొన్నటివరకు రిలాక్స్.. ఇకపై దబిడి దిబిడే | Prabhas, Ntr, Allu Arjun Started regular shooting Shortly | Sakshi
Sakshi News home page

Kalki-Pushpa 2-Devara: మొన్నటివరకు రిలాక్స్.. ఇకపై దబిడి దిబిడే

Published Thu, Aug 3 2023 5:17 AM | Last Updated on Thu, Aug 3 2023 6:53 AM

Prabhas, Ntr, Allu Arjun Started regular shooting Shortly - Sakshi

షార్ట్‌ బ్రేక్‌ తీసుకున్నారు... ఫుల్లుగా రిలాక్స్‌ అయ్యారు. గెట్‌ సెట్‌ గో అంటూ హుషారుగా షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. కొంత గ్యాప్‌ తర్వాత సెట్స్‌లోకి అడుగుపెడుతున్న స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.  

బిజీ బిజీ
దాదాపు యాభై రోజులు యూఎస్‌లో గడిపి, ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు ప్రభాస్‌. ఇక సినిమా షూటింగ్‌లతో బిజీ కావాలనుకుంటున్నారు. ఇందుకు తగ్గ యాక్షన్‌ ΄్లాన్‌ను రెడీ చేసుకున్నారు. ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజా డీలక్స్‌’ (వర్కింగ్‌ టైటిల్‌), ‘సలార్‌’ చిత్రాలు ఉన్నాయి. ముందుగా ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌లో పాల్గొననున్నారట. మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ను ్రపారంభించాలనుకుంటున్నారట. ఈ షెడ్యూల్‌లో ప్రధానంగా ప్రభాస్, దీపికా పదుకోన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలి సింది.

గతంలో చిత్ర యూనిట్‌ ప్రకటించిన ప్రకారం ‘కల్కి 2898 ఏడీ’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్‌ మరో చిత్రం ‘రాజా డీలక్స్‌’ విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారట ప్రభాస్‌. మరోవైపు ప్రభాస్‌ డైరీలో ఉన్న ‘సలార్‌’ షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తొలి భాగం ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ సెప్టెంబరు 28న రిలీజ్‌ కానుంది. సో.. మలి భాగం షూటింగ్‌ని ఆరంభించడానికి ΄్లాన్‌ చేస్తున్నారట. మొత్తం మీద ప్రభాస్‌ బిజీ బిజీ.

టార్గెట్‌ ఫిక్స్‌
‘దేవర’ సినిమా విషయంలో హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ స్పీడ్‌ మామూలుగా లేదు. ఈ సినిమా వరుస షూటింగ్‌ షెడ్యూల్స్‌ చకా చకా పూర్తవుతున్నాయి. అయితే గత నెల మూడో వారంలో ఓ యాక్షన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశాక ఈ టీమ్‌ చిన్న గ్యాప్‌ తీసుకుంది. రెండు వారాల గ్యాప్‌ తర్వాత ఎన్టీఆర్‌ మళ్లీ అంటే.. జూలై 31న ‘దేవర’ కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌లో జాయిన్‌ అయ్యారు. ఈ కొత్త షెడ్యూల్‌ రెండు వారాల పాటు సాగుతుందని, ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారని తెలిసింది. పీటర్‌ హెయిన్స్‌ అండ్‌ టీమ్‌ ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేసిందట.

ఈ షెడ్యూల్‌తో ‘దేవర’ మేజర్‌ యాక్షన్‌ పార్ట్‌ పూర్తవుతుందని, తదుపరి షెడ్యూల్స్‌లో ఇతర ప్రధాన తారాగణమైన ఈ చిత్రం విలన్‌ సైఫ్‌ అలీఖాన్, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ వంటి వారు పాల్గొనగా, టాకీ పార్ట్‌ను షూట్‌ చేస్తారని తెలిసింది. నవంబరు కల్లా ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసేలా ఎన్టీఆర్‌ టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది. షూటింగ్‌ కాస్త ముందుగానే ముగిసినా.. గ్రాఫిక్స్, పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్స్‌ కోసం ‘దేవర’ టీమ్‌ ఎక్కువ టైమ్‌ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ‘దేవర’ తర్వాత హిందీ ‘వార్‌ 2’, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోని చిత్రాలతో ఎన్టీఆర్‌ బిజీ అవుతారు.

ఏప్రిల్‌లో రిలీజ్‌?
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించింది. ప్రస్తుతం మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’ సెట్స్‌లో ఉంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌కు ఇటీవల కాస్త గ్యాప్‌ వచ్చింది. మళ్లీ ఈ నెల మొదటివారంలో ‘పుష్ప: ది రూల్‌’ సినిమాను సెట్స్‌ పైకి తీసుకుని వెళ్లాలని సుకుమార్‌ సన్నాహాలు చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌ కూడా జాయిన్‌ అవుతారట. అలాగే ‘పుష్ప: ది రూల్‌’ను తొలుత ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్‌ షెడ్యూల్స్‌కి గ్యాప్‌ రావడంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమా కాకుండా... దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా, ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగాతో ఓ సినిమాను అల్లు అర్జున్‌ కమిటైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement